Shuru
Apke Nagar Ki App…
బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
Krishna
బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
More news from తెలంగాణ and nearby areas
- బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.2
- అత్యవసరమైనా... నిత్యావసరమైనా వాగు దాటాల్సిందే! అనార్పల్లి–లక్మాపూర్ వాగులపై వంతెనల కోసం స్థానికుల ఆవేదన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని అనార్పల్లి, లక్మాపూర్ గ్రామాల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటడమే పెద్ద సవాలుగా మారుతోంది. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు ఒకరికి ఒకరు సహకరిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటారు. నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా, అత్యవసర వైద్య సేవలు పొందాలన్నా ఇదే మార్గం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. భారీ వర్షాల సమయంలో వాగులు ఉప్పొంగితే గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, రైతులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేక నిస్సహాయంగా వాగు దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఇకనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి అనార్పల్లి, లక్మాపూర్ వాగులపై శాశ్వత వంతెనలు నిర్మించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.1
- తుమ్మిడి హెట్టి గ్రామపంచాయతి లో వర్షాలు బాగా పడటం వలన టం టం1
- స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.1
- బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.1
- వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ హరిత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.4
- *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్* వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.4