వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ హరిత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ హరిత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి
మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి
ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా
తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
- కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.2
- మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.1
- బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.1
- బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం.......... ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.1
- కుంటాల బి లో మళ్లీ గులాబీ జోష్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో చేరికలు నెరడిగొండ మండలం కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారు పార్టీలో చేరగా,ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ.. గతంలో మరో పార్టీలో చేరడం తప్పిదమని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో కొనసాగుతామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.2
- *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్* వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.4