logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తాడిపత్రిలో ఇటీవల వైయస్ఆర్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగులకుంట కేశవ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై జగనన్న స్వయంగా వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. ఈ దాడిలో ప్రభావితమైన కేశవ రెడ్డికి అండగా ఉంటామని జగనన్న పూర్తి భరోసా ఇచ్చారు.

8 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Urban, Telangana•
8 hrs ago

తాడిపత్రిలో ఇటీవల వైయస్ఆర్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగులకుంట కేశవ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై జగనన్న స్వయంగా వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. ఈ దాడిలో ప్రభావితమైన కేశవ రెడ్డికి అండగా ఉంటామని జగనన్న పూర్తి భరోసా ఇచ్చారు.

More news from Telangana and nearby areas
  • ఢిల్లీ నివాసితులకు చెత్త కుప్పల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, ఆధునిక వ్యర్థాల నిర్వహణ, బయో-మైనింగ్ మరియు శాస్త్రీయ పారవేయడం వంటి పద్ధతుల ద్వారా సంవత్సరాల నాటి సమస్యకు పరిష్కారం కనుగొనబడుతోంది. దీని ద్వారా స్వచ్ఛమైన, అందమైన మరియు అభివృద్ధి చెందిన ఢిల్లీని నిర్మించే పనికి వేగవంతం చేయబడుతోంది.
    1
    ఢిల్లీ నివాసితులకు చెత్త కుప్పల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, ఆధునిక వ్యర్థాల నిర్వహణ, బయో-మైనింగ్ మరియు శాస్త్రీయ పారవేయడం వంటి పద్ధతుల ద్వారా సంవత్సరాల నాటి సమస్యకు పరిష్కారం కనుగొనబడుతోంది. దీని ద్వారా స్వచ్ఛమైన, అందమైన మరియు అభివృద్ధి చెందిన ఢిల్లీని నిర్మించే పనికి వేగవంతం చేయబడుతోంది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    5 hrs ago
  • జన్నారం పోలీసులు కేవలం కేసులు నమోదు చేసి, ఖైదీలను కోర్టులో హాజరుపరచడానికే పరిమితం కాకుండా, ఒక తరాన్ని నాశనం కాకుండా కాపాడే ‘లైఫ్ గార్డ్స్’గా తమను తాము నిరూపించుకుంటున్నారు. రొటీన్ క్రైమ్ స్టోరీలకు భిన్నంగా, జన్నారం పోలీస్ స్టేషన్ ఇప్పుడు సామాజిక సంస్కరణల కేంద్రంగా మారుతోంది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ క్రైమ్ ఫ్రీ సొసైటీ విజన్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ వ్యూహాత్మక చర్యలు, ఏసీపీ ప్రకాష్‌ పర్యవేక్షణలో, జన్నారం పోలీస్ యంత్రాంగం యువత భవిష్యత్తే లక్ష్యంగా కార్యాచరణలోకి దిగింది. నూతన ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జన్నారం పోలీస్ శాఖ తన పంథాను మార్చుకుంది. కేవలం పెట్రోలింగ్‌కే పరిమితం కాకుండా, ఎక్కడ గ్రామసభ జరిగినా, ఎక్కడ నలుగురు యువకులు కనిపించినా ఎస్ఐ అక్కడికి వెళ్లి తక్షణమే స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులకు, యువతకు, గ్రామస్థులకు ‘మత్తు’ మహమ్మారి వెనుక ఉన్న సామాజిక వినాశనాన్ని కళ్లకు కడుతున్నారు. జన్నారం పోలీస్ యంత్రాంగం "చట్టం తన పని తాను చేస్తుంది. కానీ యువత ప్రాణాలు పోయాక శిక్షలు వేస్తే లాభం లేదు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ (ముందు జాగ్రత్తే ముఖ్యం). గంజాయి ముఠాల ఆట కట్టిస్తాం.. యువతను రక్షిస్తాం" అని స్పష్టం చేసింది. పోలీసులు ఇచ్చిన పిలుపుతో విద్యార్థి లోకం కదిలింది. పోనకల్ రామాలయం నుండి బస్ స్టాండ్ వరకు జరిగిన భారీ అవగాహన ర్యాలీ జన్నారం చరిత్రలోనే నిలిచిపోయేలా సాగింది. "డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యం ముద్దు!" అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చేతుల్లో ప్లకార్డులతో విద్యార్థులు నిలబడితే, వారికి అండగా ఖాకీ సైన్యం నడిచింది. ఈ విధంగా పోలీస్ శాఖ స్టేషన్ దాటి జనంలోకి వచ్చి, లాఠీ పక్కనపెట్టి ‘బోధన’ వైపు అడుగులేస్తూ జన్నారంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.
    4
    జన్నారం పోలీసులు కేవలం కేసులు నమోదు చేసి, ఖైదీలను కోర్టులో హాజరుపరచడానికే పరిమితం కాకుండా, ఒక తరాన్ని నాశనం కాకుండా కాపాడే ‘లైఫ్ గార్డ్స్’గా తమను తాము నిరూపించుకుంటున్నారు. రొటీన్ క్రైమ్ స్టోరీలకు భిన్నంగా, జన్నారం పోలీస్ స్టేషన్ ఇప్పుడు సామాజిక సంస్కరణల కేంద్రంగా మారుతోంది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ క్రైమ్ ఫ్రీ సొసైటీ విజన్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ వ్యూహాత్మక చర్యలు, ఏసీపీ ప్రకాష్‌ పర్యవేక్షణలో, జన్నారం పోలీస్ యంత్రాంగం యువత భవిష్యత్తే లక్ష్యంగా కార్యాచరణలోకి దిగింది.

నూతన ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జన్నారం పోలీస్ శాఖ తన పంథాను మార్చుకుంది. కేవలం పెట్రోలింగ్‌కే పరిమితం కాకుండా, ఎక్కడ గ్రామసభ జరిగినా, ఎక్కడ నలుగురు యువకులు కనిపించినా ఎస్ఐ అక్కడికి వెళ్లి తక్షణమే స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులకు, యువతకు, గ్రామస్థులకు ‘మత్తు’ మహమ్మారి వెనుక ఉన్న సామాజిక వినాశనాన్ని కళ్లకు కడుతున్నారు. జన్నారం పోలీస్ యంత్రాంగం "చట్టం తన పని తాను చేస్తుంది. కానీ యువత ప్రాణాలు పోయాక శిక్షలు వేస్తే లాభం లేదు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ (ముందు జాగ్రత్తే ముఖ్యం). గంజాయి ముఠాల ఆట కట్టిస్తాం.. యువతను రక్షిస్తాం" అని స్పష్టం చేసింది.

పోలీసులు ఇచ్చిన పిలుపుతో విద్యార్థి లోకం కదిలింది. పోనకల్ రామాలయం నుండి బస్ స్టాండ్ వరకు జరిగిన భారీ అవగాహన ర్యాలీ జన్నారం చరిత్రలోనే నిలిచిపోయేలా సాగింది. "డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యం ముద్దు!" అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చేతుల్లో ప్లకార్డులతో విద్యార్థులు నిలబడితే, వారికి అండగా ఖాకీ సైన్యం నడిచింది. ఈ విధంగా పోలీస్ శాఖ స్టేషన్ దాటి జనంలోకి వచ్చి, లాఠీ పక్కనపెట్టి ‘బోధన’ వైపు అడుగులేస్తూ జన్నారంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి)లో ఒక ఫ్రీజర్ బాక్స్ అవసరంపై సిర్పూర్ టీ యూనిటీ వారం రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. ఈ పిలుపునకు స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు అందించి తమ సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి దాతకు యూనిటీ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే సామాజిక అవసరాలను నెరవేర్చడం సాధ్యమవుతుందని ఈ యూనిటీ సభ్యులు పేర్కొన్నారు.
    1
    కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి)లో ఒక ఫ్రీజర్ బాక్స్ అవసరంపై సిర్పూర్ టీ యూనిటీ వారం రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. ఈ పిలుపునకు స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు అందించి తమ సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి దాతకు యూనిటీ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే సామాజిక అవసరాలను నెరవేర్చడం సాధ్యమవుతుందని ఈ యూనిటీ సభ్యులు పేర్కొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ధర్మపురి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన బీజేపీ కార్యకర్త ఆసం సురేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు దామేర రామ సుధాకర్ రావు పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వారి నివాసానికి చేరుకున్న ఆయన, బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించడంతో పాటు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటమే బీజేపీ లక్ష్యమని దామేర రామ సుధాకర్ రావు పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, భవిష్యత్తులో అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
    1
    ధర్మపురి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన బీజేపీ కార్యకర్త ఆసం సురేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు దామేర రామ సుధాకర్ రావు పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వారి నివాసానికి చేరుకున్న ఆయన, బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించడంతో పాటు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా, కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటమే బీజేపీ లక్ష్యమని దామేర రామ సుధాకర్ రావు పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, భవిష్యత్తులో అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం వర్షం కురిసింది. చాలా రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న నగర ప్రజలకు ఈ వాన ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో, వేసవి వేడి నుండి ప్రజలు ఊరట పొందారు. మున్సిపల్ అధికారులు ముందుస్తుగా చేపట్టిన చర్యల కారణంగా రోడ్లపై ఎక్కడా నీరు నిలవలేదు. అంతేకాకుండా, వర్షం కురిసినప్పటికీ నగరంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేదా ఇతర ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితి ప్రశాంతంగా కొనసాగింది.
    1
    నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం వర్షం కురిసింది. చాలా రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న నగర ప్రజలకు ఈ వాన ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో, వేసవి వేడి నుండి ప్రజలు ఊరట పొందారు. మున్సిపల్ అధికారులు ముందుస్తుగా చేపట్టిన చర్యల కారణంగా రోడ్లపై ఎక్కడా నీరు నిలవలేదు. అంతేకాకుండా, వర్షం కురిసినప్పటికీ నగరంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేదా ఇతర ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితి ప్రశాంతంగా కొనసాగింది.
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • సిరికొండ మండలంలోని తుంపల్లి ప్రభుత్వ పాఠశాలలో యాంటీ డ్రగ్ వీక్ సందర్భంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం, వీరంతా కలిసి గ్రామంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో మాదకద్రవ్యాలపై చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
    1
    సిరికొండ మండలంలోని తుంపల్లి ప్రభుత్వ పాఠశాలలో యాంటీ డ్రగ్ వీక్ సందర్భంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం, వీరంతా కలిసి గ్రామంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో మాదకద్రవ్యాలపై చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
    user_RC REDDY
    RC REDDY
    Nizamabad Rural, Telangana•
    8 hrs ago
  • తెలంగాణవ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో గురువారం నుండి 'ఎస్.ఐ.ఆర్' (SIR) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఓటర్ల జాబితాలో లోపాలను సవరించి, పారదర్శకమైన జాబితాను రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఓట్ల తొలగింపుపై వస్తున్న అపోహలను నమ్మవద్దని, అర్హులైన నిజమైన ఓటర్ల ఓట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించబడవని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బి.ఎల్.ఓ) నేరుగా ఓటర్ల ఇళ్లకు వస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా తన ఓటు వివరాలను సరిచూసుకున్నారు. బి.ఎల్.ఓ కలెక్టర్ నివాసానికి వచ్చి, రీప్రింటెడ్ ఎనిమరేషన్ ఫామ్ ద్వారా ఆయన ఓటు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఉన్న తన వివరాలను నమోదు చేసి, ఒక స్పష్టమైన ఫోటోను జతపరిచి బి.ఎల్.ఓకు అందజేశారు. కలెక్టర్ తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ, ప్రస్తుతం తన ఓటు ఆదిలాబాద్‌లోనే ఉన్నప్పటికీ, 2002 నాటికి అది ఇక్కడ లేదని, అప్పట్లో తన తండ్రి గారి ఓటు బీహార్‌లోని అరరియా జిల్లా, ఫార్బిస్‌గంజ్ నియోజకవర్గంలో ఉండేదని తెలిపారు. గతంలోనే దానికి సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినందున, ఇప్పుడు అదే వివరాలను ఫామ్‌లో నింపి బి.ఎల్.ఓకు అందజేశారని, బి.ఎల్.ఓ వెంటనే ఆ వివరాలను 'బి.ఎల్.ఓ యాప్' (BLO App) లో వెరిఫై చేసి సబ్మిట్ చేశారని వివరించారు. ప్రస్తుతం సాగుతున్న ఈ ఎనిమరేషన్ ప్రక్రియ ఈ రోజు నుండి జూలై 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. తమ తల్లిదండ్రుల ఓట్లు వేరే రాష్ట్రాల్లోనో లేదా ఇతర జిల్లాల్లోనో ఉన్నాయని చెబితే, ఇక్కడున్న తమ ఓటు కట్ అయిపోతుందేమోనని కొందరు భయపడుతున్నారని, అలాంటి అపోహలను అస్సలు నమ్మవద్దని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎనిమరేషన్ ఫామ్స్ సమర్పించిన తర్వాత జూలై 31న 'డ్రాఫ్ట్ రోల్' (ముసాయిదా ఓటర్ల జాబితా) ప్రచురించబడుతుందని, అందులో 2002 డేటాబేస్ ప్రకారం వివరాలు నింపి ఇచ్చిన వారందరి ఓట్ల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఓట్ల తొలగింపుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు. నిజమైన ఓటర్లందరూ తప్పకుండా ఈ ఎనిమరేషన్ ఫామ్‌ను నింపి, అందులో తమ వివరాలతో పాటు తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ లేదా గార్డియన్ల ఓట్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. నింపిన ఫామ్‌లలో ఒక కాపీ ఓటర్ వద్ద భద్రంగా ఉంటుందని, మరొకటి బి.ఎల్.ఓకు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణవ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో గురువారం నుండి 'ఎస్.ఐ.ఆర్' (SIR) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఓటర్ల జాబితాలో లోపాలను సవరించి, పారదర్శకమైన జాబితాను రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఓట్ల తొలగింపుపై వస్తున్న అపోహలను నమ్మవద్దని, అర్హులైన నిజమైన ఓటర్ల ఓట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించబడవని స్పష్టం చేశారు.

ఈ ప్రత్యేక ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బి.ఎల్.ఓ) నేరుగా ఓటర్ల ఇళ్లకు వస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా తన ఓటు వివరాలను సరిచూసుకున్నారు. బి.ఎల్.ఓ కలెక్టర్ నివాసానికి వచ్చి, రీప్రింటెడ్ ఎనిమరేషన్ ఫామ్ ద్వారా ఆయన ఓటు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఉన్న తన వివరాలను నమోదు చేసి, ఒక స్పష్టమైన ఫోటోను జతపరిచి బి.ఎల్.ఓకు అందజేశారు. కలెక్టర్ తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ, ప్రస్తుతం తన ఓటు ఆదిలాబాద్‌లోనే ఉన్నప్పటికీ, 2002 నాటికి అది ఇక్కడ లేదని, అప్పట్లో తన తండ్రి గారి ఓటు బీహార్‌లోని అరరియా జిల్లా, ఫార్బిస్‌గంజ్ నియోజకవర్గంలో ఉండేదని తెలిపారు. గతంలోనే దానికి సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినందున, ఇప్పుడు అదే వివరాలను ఫామ్‌లో నింపి బి.ఎల్.ఓకు అందజేశారని, బి.ఎల్.ఓ వెంటనే ఆ వివరాలను 'బి.ఎల్.ఓ యాప్' (BLO App) లో వెరిఫై చేసి సబ్మిట్ చేశారని వివరించారు.

ప్రస్తుతం సాగుతున్న ఈ ఎనిమరేషన్ ప్రక్రియ ఈ రోజు నుండి జూలై 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. తమ తల్లిదండ్రుల ఓట్లు వేరే రాష్ట్రాల్లోనో లేదా ఇతర జిల్లాల్లోనో ఉన్నాయని చెబితే, ఇక్కడున్న తమ ఓటు కట్ అయిపోతుందేమోనని కొందరు భయపడుతున్నారని, అలాంటి అపోహలను అస్సలు నమ్మవద్దని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎనిమరేషన్ ఫామ్స్ సమర్పించిన తర్వాత జూలై 31న 'డ్రాఫ్ట్ రోల్' (ముసాయిదా ఓటర్ల జాబితా) ప్రచురించబడుతుందని, అందులో 2002 డేటాబేస్ ప్రకారం వివరాలు నింపి ఇచ్చిన వారందరి ఓట్ల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఓట్ల తొలగింపుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు. నిజమైన ఓటర్లందరూ తప్పకుండా ఈ ఎనిమరేషన్ ఫామ్‌ను నింపి, అందులో తమ వివరాలతో పాటు తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ లేదా గార్డియన్ల ఓట్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. నింపిన ఫామ్‌లలో ఒక కాపీ ఓటర్ వద్ద భద్రంగా ఉంటుందని, మరొకటి బి.ఎల్.ఓకు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    6 hrs ago
  • మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేటలోని బస్టాండ్‌లో బస్సును వెనక్కి తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వెలగం దేవక్క గురువారం బ్యాంకు పని నిమిత్తం పట్టణానికి వచ్చారు. బస్సును రివర్స్ చేసే క్రమంలో ఆమె కాళ్ళపై నుండి బస్సు టైర్లు వెళ్లడంతో దేవక్క తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
    1
    మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేటలోని బస్టాండ్‌లో బస్సును వెనక్కి తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వెలగం దేవక్క గురువారం బ్యాంకు పని నిమిత్తం పట్టణానికి వచ్చారు. బస్సును రివర్స్ చేసే క్రమంలో ఆమె కాళ్ళపై నుండి బస్సు టైర్లు వెళ్లడంతో దేవక్క తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.