Shuru
Apke Nagar Ki App…
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి)లో ఒక ఫ్రీజర్ బాక్స్ అవసరంపై సిర్పూర్ టీ యూనిటీ వారం రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. ఈ పిలుపునకు స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు అందించి తమ సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి దాతకు యూనిటీ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే సామాజిక అవసరాలను నెరవేర్చడం సాధ్యమవుతుందని ఈ యూనిటీ సభ్యులు పేర్కొన్నారు.
Krishna
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి)లో ఒక ఫ్రీజర్ బాక్స్ అవసరంపై సిర్పూర్ టీ యూనిటీ వారం రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. ఈ పిలుపునకు స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు అందించి తమ సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి దాతకు యూనిటీ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే సామాజిక అవసరాలను నెరవేర్చడం సాధ్యమవుతుందని ఈ యూనిటీ సభ్యులు పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి)లో ఒక ఫ్రీజర్ బాక్స్ అవసరంపై సిర్పూర్ టీ యూనిటీ వారం రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. ఈ పిలుపునకు స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు అందించి తమ సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి దాతకు యూనిటీ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే సామాజిక అవసరాలను నెరవేర్చడం సాధ్యమవుతుందని ఈ యూనిటీ సభ్యులు పేర్కొన్నారు.1
- జన్నారం పోలీసులు కేవలం కేసులు నమోదు చేసి, ఖైదీలను కోర్టులో హాజరుపరచడానికే పరిమితం కాకుండా, ఒక తరాన్ని నాశనం కాకుండా కాపాడే ‘లైఫ్ గార్డ్స్’గా తమను తాము నిరూపించుకుంటున్నారు. రొటీన్ క్రైమ్ స్టోరీలకు భిన్నంగా, జన్నారం పోలీస్ స్టేషన్ ఇప్పుడు సామాజిక సంస్కరణల కేంద్రంగా మారుతోంది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ క్రైమ్ ఫ్రీ సొసైటీ విజన్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ వ్యూహాత్మక చర్యలు, ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో, జన్నారం పోలీస్ యంత్రాంగం యువత భవిష్యత్తే లక్ష్యంగా కార్యాచరణలోకి దిగింది. నూతన ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జన్నారం పోలీస్ శాఖ తన పంథాను మార్చుకుంది. కేవలం పెట్రోలింగ్‌కే పరిమితం కాకుండా, ఎక్కడ గ్రామసభ జరిగినా, ఎక్కడ నలుగురు యువకులు కనిపించినా ఎస్ఐ అక్కడికి వెళ్లి తక్షణమే స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులకు, యువతకు, గ్రామస్థులకు ‘మత్తు’ మహమ్మారి వెనుక ఉన్న సామాజిక వినాశనాన్ని కళ్లకు కడుతున్నారు. జన్నారం పోలీస్ యంత్రాంగం "చట్టం తన పని తాను చేస్తుంది. కానీ యువత ప్రాణాలు పోయాక శిక్షలు వేస్తే లాభం లేదు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ (ముందు జాగ్రత్తే ముఖ్యం). గంజాయి ముఠాల ఆట కట్టిస్తాం.. యువతను రక్షిస్తాం" అని స్పష్టం చేసింది. పోలీసులు ఇచ్చిన పిలుపుతో విద్యార్థి లోకం కదిలింది. పోనకల్ రామాలయం నుండి బస్ స్టాండ్ వరకు జరిగిన భారీ అవగాహన ర్యాలీ జన్నారం చరిత్రలోనే నిలిచిపోయేలా సాగింది. "డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యం ముద్దు!" అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చేతుల్లో ప్లకార్డులతో విద్యార్థులు నిలబడితే, వారికి అండగా ఖాకీ సైన్యం నడిచింది. ఈ విధంగా పోలీస్ శాఖ స్టేషన్ దాటి జనంలోకి వచ్చి, లాఠీ పక్కనపెట్టి ‘బోధన’ వైపు అడుగులేస్తూ జన్నారంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.4
- ధర్మపురి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన బీజేపీ కార్యకర్త ఆసం సురేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు దామేర రామ సుధాకర్ రావు పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వారి నివాసానికి చేరుకున్న ఆయన, బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించడంతో పాటు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటమే బీజేపీ లక్ష్యమని దామేర రామ సుధాకర్ రావు పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, భవిష్యత్తులో అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.1
- ఢిల్లీ నివాసితులకు చెత్త కుప్పల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, ఆధునిక వ్యర్థాల నిర్వహణ, బయో-మైనింగ్ మరియు శాస్త్రీయ పారవేయడం వంటి పద్ధతుల ద్వారా సంవత్సరాల నాటి సమస్యకు పరిష్కారం కనుగొనబడుతోంది. దీని ద్వారా స్వచ్ఛమైన, అందమైన మరియు అభివృద్ధి చెందిన ఢిల్లీని నిర్మించే పనికి వేగవంతం చేయబడుతోంది.1
- నగరంలోని 47వ డివిజన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, ఏ ఒక్క అసలైన ఓటరుకూ అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను బీఎల్ఏలు దగ్గరుండి చూసుకోవాలని ఆయన సూచించారు. మ్యాపింగ్ అయిన ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలను స్వయంగా నింపించి, బీఎల్ఓల ద్వారా అప్‌లోడ్ చేయించాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌లు నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ లిస్ట్‌లో ఓటు నమోదు కాదని, కాబట్టి ప్రతి ఎన్యూమరేషన్ ఫారమ్ తప్పకుండా నింపించి ఇవ్వాలని బీఎల్ఏలకు స్పష్టమైన సూచనలు చేశారు. అలాగే, బీఎల్ఓలతో కలిసి బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా ఎన్యూమరేషన్ పత్రాలు తప్పకుండా నింపించి ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, బీఎల్ఓ సునీత, బీఎల్ఓ సూపర్ వైజర్ జమున, శ్రీనివాస్ గౌడ్, కేశవ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. గురువారం మధ్యాహ్నం ఈ మండలాల్లో భారీ వర్షం కురియగా, ఉదయం పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా మారారు. ఈ నేపథ్యంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వ్యవసాయ అధికారులు రైతులకు కీలక సూచనలు చేస్తూ, తమ పొలాలను దున్ని సిద్ధంగా ఉంచుకోవాలని, అయితే మరో రెండు మూడు భారీ వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు నాటే ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారు.1
- మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేటలోని బస్టాండ్‌లో బస్సును వెనక్కి తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వెలగం దేవక్క గురువారం బ్యాంకు పని నిమిత్తం పట్టణానికి వచ్చారు. బస్సును రివర్స్ చేసే క్రమంలో ఆమె కాళ్ళపై నుండి బస్సు టైర్లు వెళ్లడంతో దేవక్క తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.1