Shuru
Apke Nagar Ki App…
పరిశీలకులు ఎం రాజమౌళి పర్యవేక్షణలో పెద్దాపూర్ మల్లన్న స్వామి హుండీ ఆదాయ లెక్కింపు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం జాతర హుండీలను పరిశీలకులు ఎం. రాజమొగిలి పర్యవేక్షణలో లెక్కించారు. హుండీల ద్వారా రూ.14,03,544 నగదు, 560 గ్రాముల మిశ్రమ వెండి లభించగా, సేవా టికెట్లు ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,17,400, పట్నాల ద్వారా రూ.1,42,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముద్దం విక్రమ్ గౌడ్, చైర్మన్ జవిడి తిరుపతి రెడ్డి, సర్పంచ్ సుమలత–జీవన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
పరిశీలకులు ఎం రాజమౌళి పర్యవేక్షణలో పెద్దాపూర్ మల్లన్న స్వామి హుండీ ఆదాయ లెక్కింపు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం జాతర హుండీలను పరిశీలకులు ఎం. రాజమొగిలి పర్యవేక్షణలో లెక్కించారు. హుండీల ద్వారా రూ.14,03,544 నగదు, 560 గ్రాముల మిశ్రమ వెండి లభించగా, సేవా టికెట్లు ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,17,400, పట్నాల ద్వారా రూ.1,42,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముద్దం విక్రమ్ గౌడ్, చైర్మన్ జవిడి తిరుపతి రెడ్డి, సర్పంచ్ సుమలత–జీవన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ బంజారా భవన్ లో శ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు..3
- మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి. మార్చి15 న హనుమకొండ, వరంగల్ పట్టణంలో నిర్వహించబోయే హమాలీ మహా గర్జనను విజయవంతం చేయాలని హమాలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. అట్టి హమాలి మహాగర్జన సభకు హమాలి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.1
- ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.1
- మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.1
- तेलंगाना में दर्दनाक हादसा, करंट लगने से दो लोग जिंदा जले; सामने आया VIDEO मंचेरियाल: तेलंगाना के मंचेरियाल जिले से एक दर्दनाक हादसा सामने आया है। यहां इलेक्ट्रिक शॉक लगने की वजह से दो युवकों की मौत हो गई। जानकारी के मुताबिक दोनों युवक एक पेट्रोल पंप के पास मौजूद थे। इस दौरान यहां एक लोहे का खंभा बिजली की मेन लाइन की तार से टकरा गए। लोहे के खंभे से सटने की वजह से इलेक्ट्रिक शॉक लग गया और दोनों युवक मौके पर ही जल गए। आग में जलने की वजह से युवकों की मौत हो गई। घटना का वीडियो भी सामने आया है, जो सोशल मीडिया पर वायरल हो रहा है।1
- వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.3
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డగా మారింది. మెట్ పల్లి గ్రామంలో ఏకంగా 9 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. గ్రామపంచాయతీ సమీపంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను రంగంలో దించి విచారణ చేపట్టారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు , మొలంగూర్ గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో దొంగలు రెచ్చిపోవడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. గత రెండు మూడు మాసాల నుంచి ఇండ్లు, కిరణ షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.1