మెట్ పల్లిలో 9 ఇళ్ళలో చోరీ... వరస చోరీలతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులు.. క్లూస్ టీమ్ తో విచారణ చేపట్టిన పోలీసులు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డగా మారింది. మెట్ పల్లి గ్రామంలో ఏకంగా 9 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. గ్రామపంచాయతీ సమీపంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను రంగంలో దించి విచారణ చేపట్టారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు , మొలంగూర్ గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో దొంగలు రెచ్చిపోవడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. గత రెండు మూడు మాసాల నుంచి ఇండ్లు, కిరణ షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
మెట్ పల్లిలో 9 ఇళ్ళలో చోరీ... వరస చోరీలతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులు.. క్లూస్ టీమ్ తో విచారణ చేపట్టిన పోలీసులు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డగా మారింది. మెట్ పల్లి గ్రామంలో ఏకంగా 9 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. గ్రామపంచాయతీ సమీపంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను రంగంలో దించి విచారణ చేపట్టారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు , మొలంగూర్ గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో దొంగలు రెచ్చిపోవడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. గత రెండు మూడు మాసాల నుంచి ఇండ్లు, కిరణ షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డగా మారింది. మెట్ పల్లి గ్రామంలో ఏకంగా 9 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. గ్రామపంచాయతీ సమీపంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను రంగంలో దించి విచారణ చేపట్టారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు , మొలంగూర్ గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో దొంగలు రెచ్చిపోవడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. గత రెండు మూడు మాసాల నుంచి ఇండ్లు, కిరణ షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.1
- ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.1
- సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.1
- వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.3
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటి విలువ సుమారు ₹45,000. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.1
- కరీంనగర్ వరంగల్ నగరాల్లో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి త్వరలో ఒక్క విధానం అమలు చేయబోతున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని, ఏడాదిలోగా కరీంనగర్ డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి కరీంనగర్ లో పర్యటించారు. పలు హోటళ్ళను సందర్శించి ప్లాస్టిక్ నిషేధం, పరిసరాలు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించవద్దని, స్టీల్ వస్తువులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనంతరం డంపింగ్ యార్డును సందర్శించి పెద్దపెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందన్నారు. గతంలో కేంద్ర మంత్రి కట్టర్ కరీంనగర్ కి వచ్చినప్పుడు ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న అనారోగ్యాలకు కారణం అవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశామని, ఇటీవల సీఎం చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. సీఎం సభా వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. డంపింగ్ యార్డ్ తరలింపులో డైలీ వచ్చే వెస్ట్ మేనేజ్మెంట్... ఇప్పటికే స్టోర్ అయిన వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా తరలించాలని దానిపై ఒక విధానాన్ని తీసుకుంటామన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులం, అధికారులు బాధ్యత తీసుకున్నామని త్వరలోనే శాశ్వత పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు. 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ ను ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక రోజులో అయ్యేది కాదని, సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తామని స్పష్టం చేశారు.4