8 వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.
8 వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.
- *డిజిటల్ బాటలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల:* కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ బుధవారం ఆరవ రోజు కళాశాలలో పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, పాలనలో పారదర్శకతను పెంచేందుకు రికార్డుల నవీకరణ మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల,శ్రమదానం పై ప్రత్యేక దృష్టి సారించారు. పాత రికార్డులను స్కాన్ చేసి భద్రపరిచే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లు మరియు సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత ఫైళ్లనుఅప్‌డేట్ చేశారు. కళాశాలలోని ఫర్నిచర్ కి అవసరమైన చిన్న తరహా మరమ్మతులు చేపట్టి, తరగతి గదులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కళాశాల పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు, రికార్డుల నిర్వహణను,తరగతి గదులను డిజిటలైజ్ చేయడం ద్వారా సమాచారాన్ని వేగంగా,బోధన ఆకర్షణీయంగా పొందే వీలుంటుందని రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులను సరికొత్త హంగులతో, ఆధునిక వసతులతో ఆహ్వానించడానికి కళాశాల అధ్యాపకులు,సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య, వివిధ విభాగాల డీన్లు, ఆచార్యులు, సహాయ ఆచార్యులు, అనుబంధ ఆచార్యులు, అధ్యాపక మరియు కార్యాలయ సిబ్బంది,ఎన్సిసి, ఎన్ఎస్ఎస్,వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డగా మారింది. మెట్ పల్లి గ్రామంలో ఏకంగా 9 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. గ్రామపంచాయతీ సమీపంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను రంగంలో దించి విచారణ చేపట్టారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు , మొలంగూర్ గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో దొంగలు రెచ్చిపోవడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. గత రెండు మూడు మాసాల నుంచి ఇండ్లు, కిరణ షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.1
- Post by Narasimulu Narasimulu1
- జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.1
- పత్రిక ప్రకటన తేది:11.03.2026 కామారెడ్డి జిల్లా బుధవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని సదాశివ నగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ వరంగల్ నగరాల్లో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి త్వరలో ఒక్క విధానం అమలు చేయబోతున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని, ఏడాదిలోగా కరీంనగర్ డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి కరీంనగర్ లో పర్యటించారు. పలు హోటళ్ళను సందర్శించి ప్లాస్టిక్ నిషేధం, పరిసరాలు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించవద్దని, స్టీల్ వస్తువులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనంతరం డంపింగ్ యార్డును సందర్శించి పెద్దపెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందన్నారు. గతంలో కేంద్ర మంత్రి కట్టర్ కరీంనగర్ కి వచ్చినప్పుడు ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న అనారోగ్యాలకు కారణం అవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశామని, ఇటీవల సీఎం చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. సీఎం సభా వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. డంపింగ్ యార్డ్ తరలింపులో డైలీ వచ్చే వెస్ట్ మేనేజ్మెంట్... ఇప్పటికే స్టోర్ అయిన వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా తరలించాలని దానిపై ఒక విధానాన్ని తీసుకుంటామన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులం, అధికారులు బాధ్యత తీసుకున్నామని త్వరలోనే శాశ్వత పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు. 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ ను ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక రోజులో అయ్యేది కాదని, సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తామని స్పష్టం చేశారు.4