Shuru
Apke Nagar Ki App…
మెదక్ డిస్ట్రిక్ట్ మనోహరాబాద్ మండల్ కోనయ్యపల్లి పిటి గ్రామంలో గ్లాస్ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వల్ల గ్రామస్తులకు ఇబ్బంది ఎదురు
Narasimulu Narasimulu
మెదక్ డిస్ట్రిక్ట్ మనోహరాబాద్ మండల్ కోనయ్యపల్లి పిటి గ్రామంలో గ్లాస్ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వల్ల గ్రామస్తులకు ఇబ్బంది ఎదురు
More news from తెలంగాణ and nearby areas
- Post by Narasimulu Narasimulu1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- రంజాన్ మాసం సహనం, దానం, సహోదర భావానికి ప్రతీక అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోయిన్ పల్లి, కడక్ పుర, నేతాజీ నగర్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన కజూర్ తినిపించి నేటి ఉపవాస దీక్ష విరమింప చేశారు. భారత దేశంలో సర్వ మతాలు సమానమేనని తెలిపారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రేస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర మండల రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రజల సమస్యలు పట్టించుకోలేని అధ్యక్షుడు పన్నీరు మహేష్ ఆరోపించారు. కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ లో 52 బిల్డింగులు,6420 కుటుంబాలు ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రోడ్డు సమస్య, రోజు కనీసం ఒక రెండు మూడు బైకులు కిందపడి ప్రజలను కాలు చేతులు వేరే కొట్టుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండి కలెక్టర్ కు మరియు జిహెచ్ఎంసి వారికి మరియు నాగారం మున్సిపాలిటీ అధికారులకు, ఎన్నిసార్లు వినతిపత్రం వచ్చినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్న అధికారులు మరియు లీడర్లు , రాంపల్లి డబుల్ బెడ్రూంలో ఇల్లు అలెర్ట్మెంట్ చేశారు. అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కావట్లేదు, బస్తీ దావకాన లేదు, అంగన్వాడి కేంద్రం లేదు, ప్రజలు కనీసం అక్కడ ఏదైనా పని చేసుకుని బతకడానికి వసతులు లేవు, ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి సెంటర్ అవి కూడా ఓపెన్ చేయకుండా, తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాగారం మున్సిపాలిటీకి టాక్సీ కూడా పే చేయడం జరిగింది. ఒక్కొక్కరు 1980 రూపాయలు టాక్స్ కడుతున్నారు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాక్స్ కట్టని వారికి నోటీసులు అందిస్తామని చెప్పి పేద ప్రజలను భయాందోళనకు గురిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్ సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వ స్పందించకపోతే కాలనీ ప్రజలందరం పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.1
- పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.1