Shuru
Apke Nagar Ki App…
మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళా చక్రపాణిని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షుడు రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Satheesh gangu
మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళా చక్రపాణిని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షుడు రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.1
- రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.1
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డగా మారింది. మెట్ పల్లి గ్రామంలో ఏకంగా 9 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. గ్రామపంచాయతీ సమీపంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను రంగంలో దించి విచారణ చేపట్టారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు , మొలంగూర్ గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో దొంగలు రెచ్చిపోవడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. గత రెండు మూడు మాసాల నుంచి ఇండ్లు, కిరణ షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.1
- పత్రికా ప్రకటన తేది :10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమాన్ని ఆశిష్ సంగ్వాన్, IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు , గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి (FMD) అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. "టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు; ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం , బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం , పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని తెలిపారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు , పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధకశాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య ,పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లలో సెస్ విద్యుత్ కార్మికుల 72 గంటల విధులు బహిష్కరణ. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించి సెస్ కార్యాలయం ఆవరణలో నిరసన తెలుపుతున్న విద్యుత్ కార్మికులు.1