logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి : డిజిటల్ బాటలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రజాపాలన, ప్రగతిప్రణాళిక విధానాలపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి, ప్రిన్సిపల్ *డిజిటల్ బాటలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల:* కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ బుధవారం ఆరవ రోజు కళాశాలలో పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, పాలనలో పారదర్శకతను పెంచేందుకు రికార్డుల నవీకరణ మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల,శ్రమదానం పై ప్రత్యేక దృష్టి సారించారు. పాత రికార్డులను స్కాన్ చేసి భద్రపరిచే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లు మరియు సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత ఫైళ్లనుఅప్‌డేట్ చేశారు. కళాశాలలోని ఫర్నిచర్ కి అవసరమైన చిన్న తరహా మరమ్మతులు చేపట్టి, తరగతి గదులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కళాశాల పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు, రికార్డుల నిర్వహణను,తరగతి గదులను డిజిటలైజ్ చేయడం ద్వారా సమాచారాన్ని వేగంగా,బోధన ఆకర్షణీయంగా పొందే వీలుంటుందని రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులను సరికొత్త హంగులతో, ఆధునిక వసతులతో ఆహ్వానించడానికి కళాశాల అధ్యాపకులు,సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య, వివిధ విభాగాల డీన్లు, ఆచార్యులు, సహాయ ఆచార్యులు, అనుబంధ ఆచార్యులు, అధ్యాపక మరియు కార్యాలయ సిబ్బంది,ఎన్సిసి, ఎన్ఎస్ఎస్,వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

కామారెడ్డి : డిజిటల్ బాటలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రజాపాలన, ప్రగతిప్రణాళిక విధానాలపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి, ప్రిన్సిపల్ *డిజిటల్ బాటలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల:* కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ బుధవారం ఆరవ రోజు కళాశాలలో పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, పాలనలో పారదర్శకతను పెంచేందుకు రికార్డుల నవీకరణ మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల,శ్రమదానం పై ప్రత్యేక దృష్టి సారించారు. పాత రికార్డులను స్కాన్ చేసి భద్రపరిచే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లు మరియు సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత ఫైళ్లనుఅప్‌డేట్ చేశారు. కళాశాలలోని ఫర్నిచర్ కి అవసరమైన చిన్న తరహా మరమ్మతులు చేపట్టి, తరగతి గదులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కళాశాల పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు, రికార్డుల నిర్వహణను,తరగతి గదులను డిజిటలైజ్ చేయడం ద్వారా సమాచారాన్ని వేగంగా,బోధన ఆకర్షణీయంగా పొందే వీలుంటుందని రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులను సరికొత్త హంగులతో, ఆధునిక వసతులతో ఆహ్వానించడానికి కళాశాల అధ్యాపకులు,సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య, వివిధ విభాగాల డీన్లు, ఆచార్యులు, సహాయ ఆచార్యులు, అనుబంధ ఆచార్యులు, అధ్యాపక మరియు కార్యాలయ సిబ్బంది,ఎన్సిసి, ఎన్ఎస్ఎస్,వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.
    1
    సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం  ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు  సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు
    1
    శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    13 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు
    1
    పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • పత్రిక ప్రకటన తేది:11.03.2026 కామారెడ్డి జిల్లా బుధవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని సదాశివ నగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది:11.03.2026
కామారెడ్డి జిల్లా బుధవారం
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా  జిల్లాలోని సదాశివ నగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది  రైతులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
    1
    రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహనతో సమాజం పట్ల గౌరవం కలిగిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అనంతరం మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహనతో సమాజం పట్ల గౌరవం కలిగిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అనంతరం మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.