Shuru
Apke Nagar Ki App…
మక్దుంపూర్ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న పాత గోడల కూల్చివేత! శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు
ASHOK VENGANI
మక్దుంపూర్ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న పాత గోడల కూల్చివేత! శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు
More news from తెలంగాణ and nearby areas
- శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహులు ఆధ్వర్యంలో ఈ పనులను కొంతన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండలం PACS తాజా మాజీ చైర్మన్ కూడా పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.1
- Post by Narasimulu Narasimulu1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం వేళ నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంతుడి సేవలో లీనమై పోయారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- మహిళలు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు: సంగారెడ్డిలో TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి తండా కు చెందిన గిరిజన దంపతులకు నెల రోజుల క్రితం మగ బిడ్డ జన్మించారు. తొలి కాన్పులో మగ బిడ్డ జన్మించిన ఆనందంగా ఉన్న దంపతులు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు ఓ మధ్యవర్తి ద్వారా బాలు తల్లిదండ్రులను కలిసి బేరం పెట్టారు. 50 వేలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చిన కామారెడ్డి కి చెందిన దంపతులు తీసుకు వెళ్ళారు. అయితే బాబు పుట్టిన తరవాత అంగన్వాడిలో పాలు, ఇతర పోషక ఆహారం కు బాలింత రాకపోవడం తో అనుమానం కలిగిన అంగన్వాడీ టీచర్ ఆరా తీసింది. విషయం అడగడం తో ఇంటికి తాళం వెళ్ళిపోయారు. అధికారులు రంగంలోకి దిగి పోలీస్ లకు సమాచారం అందించారు. కామారెడ్డి లో ఉన్న నెల రోజుల పసికందును తీసుకొని సఖి కేంద్రం కు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు నిర్వాహకురాలు రేణుక తెలిపారు. నెల రోజుల పసి కందు ను విక్రయించడం పై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.1
- శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు1