సదాశివనగర్ మండలంలో నానో యూరియా వాడకంపై అవగాహన, డ్రోన్ సహాయంతో పిచికారి చేయడం సులువు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పత్రిక ప్రకటన తేది:11.03.2026 కామారెడ్డి జిల్లా బుధవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని సదాశివ నగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలంలో నానో యూరియా వాడకంపై అవగాహన, డ్రోన్ సహాయంతో పిచికారి చేయడం సులువు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పత్రిక ప్రకటన తేది:11.03.2026 కామారెడ్డి జిల్లా బుధవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని సదాశివ నగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కళ్యాణి గ్రామ మహిళా సోదరిమణులందరూ మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ మహిళలు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు మరియు గ్రామ అధ్యక్షులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల అభివృద్ధి కోసం మహిళా సమాఖ్య భవనం ఏర్పాటు చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ అన్న గారికి మహిళలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.1
- तेलंगाना में दर्दनाक हादसा, करंट लगने से दो लोग जिंदा जले; सामने आया VIDEO मंचेरियाल: तेलंगाना के मंचेरियाल जिले से एक दर्दनाक हादसा सामने आया है। यहां इलेक्ट्रिक शॉक लगने की वजह से दो युवकों की मौत हो गई। जानकारी के मुताबिक दोनों युवक एक पेट्रोल पंप के पास मौजूद थे। इस दौरान यहां एक लोहे का खंभा बिजली की मेन लाइन की तार से टकरा गए। लोहे के खंभे से सटने की वजह से इलेक्ट्रिक शॉक लग गया और दोनों युवक मौके पर ही जल गए। आग में जलने की वजह से युवकों की मौत हो गई। घटना का वीडियो भी सामने आया है, जो सोशल मीडिया पर वायरल हो रहा है।1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు1
- మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి. మార్చి15 న హనుమకొండ, వరంగల్ పట్టణంలో నిర్వహించబోయే హమాలీ మహా గర్జనను విజయవంతం చేయాలని హమాలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. అట్టి హమాలి మహాగర్జన సభకు హమాలి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.1
- శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహులు ఆధ్వర్యంలో ఈ పనులను కొంతన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండలం PACS తాజా మాజీ చైర్మన్ కూడా పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.1
- ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.4
- *డిజిటల్ బాటలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల:* కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ బుధవారం ఆరవ రోజు కళాశాలలో పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, పాలనలో పారదర్శకతను పెంచేందుకు రికార్డుల నవీకరణ మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల,శ్రమదానం పై ప్రత్యేక దృష్టి సారించారు. పాత రికార్డులను స్కాన్ చేసి భద్రపరిచే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లు మరియు సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత ఫైళ్లనుఅప్‌డేట్ చేశారు. కళాశాలలోని ఫర్నిచర్ కి అవసరమైన చిన్న తరహా మరమ్మతులు చేపట్టి, తరగతి గదులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కళాశాల పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు, రికార్డుల నిర్వహణను,తరగతి గదులను డిజిటలైజ్ చేయడం ద్వారా సమాచారాన్ని వేగంగా,బోధన ఆకర్షణీయంగా పొందే వీలుంటుందని రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులను సరికొత్త హంగులతో, ఆధునిక వసతులతో ఆహ్వానించడానికి కళాశాల అధ్యాపకులు,సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య, వివిధ విభాగాల డీన్లు, ఆచార్యులు, సహాయ ఆచార్యులు, అనుబంధ ఆచార్యులు, అధ్యాపక మరియు కార్యాలయ సిబ్బంది,ఎన్సిసి, ఎన్ఎస్ఎస్,వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.1