logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అభిచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి కూనవరం మండలం అభిచర్ల గ్రామ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పండ్రా జుపల్లి గ్రామం నుంచి చింతూరు వైపు ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు, చింతూరు నుంచి కూనవరం వైపు కాంకర్ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్‌ను ఢీకొట్టారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటన స్థలంలోనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను పంద్రాజుపల్లి గ్రామానికి చెందిన వంజం లక్ష్మణ్(24), ముల్లూరు గ్రామానికి చెందిన పద్ధం కార్తీక్(25)గా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభిచర్ల గ్రామానికి చెందిన శ్యామల భీమేశ్వరావును వెంటనే 108 అంబులెన్స్‌లో కూనవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కూనవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

3 hrs ago
user_Sode Prasad
Sode Prasad
Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
cf7032ef-3f4b-4b93-9fb0-b3e4d9199e8c

అభిచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి కూనవరం మండలం అభిచర్ల గ్రామ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పండ్రా జుపల్లి గ్రామం నుంచి చింతూరు వైపు ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న

37b9fced-3c34-42ea-81d1-16da01c6a687

ముగ్గురు యువకులు, చింతూరు నుంచి కూనవరం వైపు కాంకర్ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్‌ను ఢీకొట్టారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటన స్థలంలోనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను పంద్రాజుపల్లి గ్రామానికి చెందిన వంజం

f7df93c6-8ef0-4013-9d66-65d51b638e18

లక్ష్మణ్(24), ముల్లూరు గ్రామానికి చెందిన పద్ధం కార్తీక్(25)గా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభిచర్ల గ్రామానికి చెందిన శ్యామల భీమేశ్వరావును వెంటనే 108 అంబులెన్స్‌లో కూనవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం

0cda0f0e-be7c-419e-afc2-87180c912c00

కోసం భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కూనవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.
    1
    సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు.
పల్నాడు జిల్లా..
సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు
ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం
సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను  ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు.
నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు.
ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
    1
    ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ 
కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. 
తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు.
గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
    1
    మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • 'ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకాశయానం' సాధారణంగా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం లేదా దాతలు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం చూస్తుంటాం. కానీ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎం. సత్యారావు విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలలను నిజం చేశారు. ​మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు విమానం ఎక్కడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయుడు సత్యారావు తెలిపారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన జీతపు సొమ్మును విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఈ విధంగా వెచ్చించడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమాన ప్రయాణం కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాకుండా, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ఒక గొప్ప పునాదిగా నిలుస్తుందని వారు కొనియాడారు.
    1
    'ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకాశయానం'
సాధారణంగా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం లేదా దాతలు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం చూస్తుంటాం. కానీ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎం. సత్యారావు  విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలలను నిజం చేశారు.
​మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు విమానం ఎక్కడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయుడు సత్యారావు తెలిపారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన జీతపు సొమ్మును విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఈ విధంగా వెచ్చించడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమాన ప్రయాణం కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాకుండా, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ఒక గొప్ప పునాదిగా నిలుస్తుందని వారు కొనియాడారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    1
    బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని
నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    2 hrs ago
  • రైతుల ఇబ్బందులపై కరీంనగర్ ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం....రైతులను ఇబ్బంది పెడితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరిక ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడడానికి ప్రధాన కారణం రైస్ మిల్లర్లేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిర్యాదు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాగ్ లో 43 కేజీల ధాన్యం తూకం వేయడాన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ నిర్లక్ష్యం వల్ల రైతులకు సమస్యలు తప్పడం లేదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను పెట్టి నిరంతరం ధాన్యం కొనుగోలను పర్యవేక్షించాలని, టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై చర్యలు చేపడుతామని కలెక్టర్ చిత్రమిశ్రా ప్రకటించారు.
    2
    రైతుల ఇబ్బందులపై కరీంనగర్ ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం....రైతులను ఇబ్బంది పెడితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరిక
ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడడానికి ప్రధాన కారణం రైస్ మిల్లర్లేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిర్యాదు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాగ్ లో 43 కేజీల ధాన్యం తూకం వేయడాన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ నిర్లక్ష్యం వల్ల రైతులకు సమస్యలు తప్పడం లేదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను పెట్టి నిరంతరం ధాన్యం కొనుగోలను పర్యవేక్షించాలని, టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై చర్యలు చేపడుతామని కలెక్టర్ చిత్రమిశ్రా ప్రకటించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    1
    ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు
MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    46 min ago
  • గారపాడు శ్రీ భావన రుషి ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలు . పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామంలో సోమవారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠ, నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సారధ్యం లో క్రతువులు పూర్తయి న సందర్భంగా సోమవారం నాడు 16 రోజుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్త మహాశయులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
    1
    గారపాడు శ్రీ భావన రుషి ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలు  .
పెదకూరపాడు మండలంలోని గారపాడు  గ్రామంలో సోమవారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠ, నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సారధ్యం లో క్రతువులు పూర్తయి న సందర్భంగా సోమవారం నాడు 16 రోజుల వేడుక జరిగింది.
ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్త మహాశయులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు
    1
    సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు 
గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.