logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    1
    ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు
MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    46 min ago
  • కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగే గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టును సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో గిరి ప్రదక్షిణను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వేములవాడ కొండగట్టు ధర్మపురి మూడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
    3
    కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని హామీ
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగే గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టును సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు  తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో గిరి ప్రదక్షిణను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని  తెలిపారు. వేములవాడ కొండగట్టు ధర్మపురి మూడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • బెజ్జంకి మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరం ప్రారంభం బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి ప్రత్యేక శిబిరాన్ని సోమవారం సర్పంచ్ బొల్లం శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగించుకుని శిబిరంలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఈ శిబిరంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసం, గణిత శాస్త్ర మెలకువలు, నృత్యం, క్రీడలు, ఇండోర్ గేమ్స్ తదితర అంశాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపాల్ మాలోతు సంగీత తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, వార్డు సభ్యులు ఎలిగే సతీష్, తిప్పారపు మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    బెజ్జంకి మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరం ప్రారంభం
బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి ప్రత్యేక శిబిరాన్ని సోమవారం సర్పంచ్ బొల్లం శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగించుకుని శిబిరంలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మే 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఈ శిబిరంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసం, గణిత శాస్త్ర మెలకువలు, నృత్యం, క్రీడలు, ఇండోర్ గేమ్స్ తదితర అంశాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపాల్ మాలోతు సంగీత తెలిపారు.
కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, వార్డు సభ్యులు ఎలిగే సతీష్, తిప్పారపు మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    22 hrs ago
  • ఖమ్మం లో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన
    1
    ఖమ్మం లో త్రాగునీటి సమస్య 
పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    17 min ago
  • మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్, గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    3
    మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ 
అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు.
ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు.
కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు.
అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్,
గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • వరి ధాన్యం కొనుగోళ్లపై జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సీపీఎం ధర్నాతో తోపులాట జనగామ జిల్లాలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
    1
    వరి ధాన్యం కొనుగోళ్లపై జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సీపీఎం ధర్నాతో తోపులాట
జనగామ జిల్లాలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు, దీక్ష స్వాములు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కాషాయ శోభతో కళకళలాడుతున్నాయి. వేసవి దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా, రేపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
    4
    తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు, దీక్ష స్వాములు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కాషాయ శోభతో కళకళలాడుతున్నాయి. వేసవి దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా, రేపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    1
    బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని
నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.