Shuru
Apke Nagar Ki App…
వరి ధాన్యం కొనుగోళ్లపై జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సీపీఎం ధర్నాతో తోపులాట జనగామ జిల్లాలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
M D Azizuddin
వరి ధాన్యం కొనుగోళ్లపై జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సీపీఎం ధర్నాతో తోపులాట జనగామ జిల్లాలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
More news from తెలంగాణ and nearby areas
- మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- కరీంనగర్ లో శ్రీశైలం మూలిక వైద్యం...దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదిక్ మందులు పనిచేస్తాయని శ్రీశైలం మూలిక వైద్యం నిర్వాహకులు ఎం.కే నిఖిల్ తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్ లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ లో శ్రీశైల మూలిక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆయుర్వేద వైద్యులు ఎంకే నిఖిల్, క్యాంప్ ఆర్గనైజర్ నాగేంద్ర కుమార్ పాల్గొని ఆయుర్వేద వైద్యం గురించి వివరించారు. మోకాళ్ళ నొప్పులకు, కీళ్ల నొప్పులకు, వాతం, నడుము నొప్పి తలనొప్పి, సయాటికా, స్పాండిలైటీస్, గ్యాస్ ట్రబుల్, షుగర్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు దీర్ఘకాల వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. మూలికల యొక్క గుణం ఏ రోజుకు ఆ రోజు రక్తాన్ని శుద్ధి చేస్తాయని తెలిపారు. ఆయుర్వేద మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆహారంలో ఒక భాగమని స్పష్టం చేశారు. ప్రతి నెల 11వ తేదీన కరీంనగర్లో శిబిరం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు తక్కువ ధరలో మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.4
- గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.5
- Post by Mana Velugu1
- జూదం గుట్టురట్టు.. గణేష్‌నగర్‌లో టాస్క్‌ఫోర్స్ దాడి.. ఏడుగురు అరెస్ట్.. రూ.1.32 లక్షల నగదు స్వాధీనం వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేష్‌నగర్ కాలనీలో జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో రూ.1,32,090 నగదు, ప్లేయింగ్ కార్డులు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఏసీపీ ఏ.మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి.బాబులాల్, ఎస్సై కె.సుధాకర్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.1