logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగే గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టును సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో గిరి ప్రదక్షిణను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వేములవాడ కొండగట్టు ధర్మపురి మూడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

5 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
5 hrs ago

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగే గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టును సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కుమార్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాబోయే కాలంలో గిరి ప్రదక్షిణను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వేములవాడ కొండగట్టు ధర్మపురి మూడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

More news from తెలంగాణ and nearby areas
  • హైదరాబాద్ లో యువకుడు హత్య...పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో శవం...11 రోజుల తర్వాత దొరికిన ఆచూకీ, మహిళతో సహా ముగ్గురు అరెస్టు. ప్రేమ యవ్వారం వేధింపులు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన యువతి దక్కకపోవడంతో ఫోన్ లో వేధిస్తు ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళడంతో పక్క ప్లాన్ తో. హైదరాబాద్ లో హత్య చేసి మంథని అటవీ ప్రాంతంలో శవాన్ని పడేశారు. 11 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం లభించడంతో పోలీసులు హత్య కేసును చేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ దారుణ హత్యకు గురయ్యారు. పది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో అతని శవం లభించింది. హైదరాబాదులో హత్యకు గురైతే శవం మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడిదలగండి వద్ద లోయలో లభించింది. ప్రేమ యవ్వారం, వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గోదావరిఖని ఏ సి పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీ కి అదే గ్రామానికి చెందిన అలేఖ్యతో టెన్త్ క్లాస్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం సాగించారు. కానీ అలేఖ్య మరో యువకుడు నీలం నవీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ లో కలిసిన వంశీ, అలేఖ్య ఫోన్ నెంబర్ తీసుకొని నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులతోపాటు ఏకంగా వారి ఇంటికే వెళ్ళి గొడవపడ్డాడు. విసిగిపోయిన అలేఖ్య తన భర్తకు విషయం చెప్పడంతో పక్కా ప్లాన్ తో అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అలేఖ్యకు వంశీ ఫోన్ చేయగానే హైదరాబాదులో తన ప్లాట్ కు రమ్మంది. వెంటనే వంశీ ఏప్రిల్ 30న హైదరాబాద్ కు వెళ్లాడు. అలేఖ్య ప్లాట్ కు వెళ్ళిన వంశీని నవీన్ భాస్కర్ కారులో తీసుకుని భాస్కర్ రూమ్ కి వెళ్లారు. డ్యూటీ ఉందని నవీన్ బయటికి వెళ్లి పోగా వంశీ, భాస్కర్ మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం తాగిన అనంతరం కత్తి తీసుకుని వంశీని హత్య చేసి చాపలో చుట్టి కార్ లో భాస్కర్ ఒక్కరే మంథని కి తరలించి గాడుదులగండి వద్ద లోయలో పడేశారు. 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ తిరిగి రాకపోవడంతో తల్లి శంకరమ్మ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కాల్ డాటా సేకరించగా అలేఖ్య నవీన్ భాస్కర్ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా మృతదేహాన్ని మంథని వద్ద గాడుదలగండి లోయలో పడేసినట్టు తెలుపడంతో ఆదివారం పోలీసులు శవాన్ని వెలికి తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల ఆందోళనకు దిగారు. బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు హత్య కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు ఏసిపి రమేష్ తెలిపారు.
    3
    హైదరాబాద్ లో యువకుడు హత్య...పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో శవం...11 రోజుల తర్వాత దొరికిన ఆచూకీ, మహిళతో సహా ముగ్గురు అరెస్టు.
ప్రేమ యవ్వారం వేధింపులు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన యువతి దక్కకపోవడంతో ఫోన్ లో వేధిస్తు ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళడంతో పక్క ప్లాన్ తో. హైదరాబాద్ లో హత్య చేసి మంథని అటవీ ప్రాంతంలో శవాన్ని పడేశారు. 11 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం లభించడంతో పోలీసులు హత్య కేసును చేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ దారుణ హత్యకు గురయ్యారు. పది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో అతని శవం లభించింది. హైదరాబాదులో హత్యకు గురైతే శవం మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడిదలగండి వద్ద లోయలో లభించింది. ప్రేమ యవ్వారం, వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గోదావరిఖని ఏ సి పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీ కి అదే గ్రామానికి చెందిన అలేఖ్యతో టెన్త్ క్లాస్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం సాగించారు. కానీ అలేఖ్య మరో యువకుడు నీలం నవీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ లో  కలిసిన వంశీ, అలేఖ్య ఫోన్ నెంబర్ తీసుకొని నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులతోపాటు ఏకంగా వారి ఇంటికే వెళ్ళి గొడవపడ్డాడు. విసిగిపోయిన అలేఖ్య తన భర్తకు విషయం చెప్పడంతో పక్కా ప్లాన్ తో అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అలేఖ్యకు వంశీ ఫోన్ చేయగానే హైదరాబాదులో   తన ప్లాట్ కు రమ్మంది. వెంటనే వంశీ ఏప్రిల్ 30న హైదరాబాద్ కు వెళ్లాడు. అలేఖ్య ప్లాట్ కు వెళ్ళిన వంశీని నవీన్ భాస్కర్ కారులో తీసుకుని భాస్కర్ రూమ్ కి వెళ్లారు. డ్యూటీ ఉందని నవీన్ బయటికి వెళ్లి పోగా వంశీ, భాస్కర్ మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం తాగిన అనంతరం కత్తి తీసుకుని వంశీని హత్య చేసి చాపలో చుట్టి కార్ లో భాస్కర్ ఒక్కరే మంథని కి తరలించి గాడుదులగండి వద్ద లోయలో పడేశారు. 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ తిరిగి రాకపోవడంతో తల్లి శంకరమ్మ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కాల్ డాటా సేకరించగా అలేఖ్య నవీన్ భాస్కర్ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా మృతదేహాన్ని మంథని వద్ద గాడుదలగండి లోయలో పడేసినట్టు తెలుపడంతో ఆదివారం పోలీసులు శవాన్ని వెలికి తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల ఆందోళనకు దిగారు. బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు హత్య కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు ఏసిపి రమేష్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    28 min ago
  • విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
    5
    విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం
మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    52 min ago
  • కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది. *బండి సంజయ్ తప్పు చేశాడు..* *జయం న్యూస్ మీడియా యూట్యూబ్* *కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది..* కుట్ర చేస్తున్నారు అని అనడం కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా అనేది మీరు నిరూపించుకోవాలి కొంతమంది మున్నూరు కాపు నాయకులు ఎదో కుట్ర చేస్తున్నారు అంటున్నారు కానీ బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయే వేరే పార్టీ నాయకుడు అని మీ పట్ల వివక్ష ఉండదు, అదేవిదంగా కేంద్ర మంత్రి అని విచారణ పక్క దారి పట్టే అవకాశం లేదు – మంత్రి పొన్నం ప్రభాకర్
    1
    కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది.
*బండి సంజయ్ తప్పు చేశాడు..*
*జయం న్యూస్ మీడియా యూట్యూబ్*
*కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది..*
కుట్ర చేస్తున్నారు అని అనడం కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా అనేది మీరు నిరూపించుకోవాలి 
కొంతమంది మున్నూరు కాపు నాయకులు ఎదో కుట్ర చేస్తున్నారు అంటున్నారు కానీ బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయే 
వేరే పార్టీ నాయకుడు అని మీ పట్ల వివక్ష ఉండదు, అదేవిదంగా కేంద్ర మంత్రి అని విచారణ పక్క దారి పట్టే అవకాశం లేదు 
– మంత్రి పొన్నం ప్రభాకర్
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer ఎల్లందకుంట, కరీంనగర్, తెలంగాణ•
    32 min ago
  • మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్, గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    3
    మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ 
అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు.
ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు.
కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు.
అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్,
గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
    2
    సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ 
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.  నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే  బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • కొండగట్టు ​అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
    1
    కొండగట్టు ​అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Yoga instructor మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
    1
    మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పొక్సో కేసు రాజకీయ దుమారం...బిఆర్ఎస్ ఆందోళన...సిట్ వేసి విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ పై ఫోక్సో కేసు నమోదు కావడం, ప్రతిగా తనను ఓ యువతి పేరెంట్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భగీరథ ఫిర్యాదుతో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. బండి భగీరథ పై ఫోక్సోకేసు నమోదు కావడం పట్ల వెంటనే అతని అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో టిఆర్ఎస్వి మహిళా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పలుచోట్ల పోలీస్ స్టేషన్ నందు నిరసన తెలిపారు. అమ్మవార్లను నమ్మే బండి సంజయ్ తన కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలడా అని సవాల్ విసిరారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. వెంటనే పొక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
    1
    కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పొక్సో కేసు రాజకీయ దుమారం...బిఆర్ఎస్ ఆందోళన...సిట్ వేసి విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ పై ఫోక్సో కేసు నమోదు కావడం, ప్రతిగా తనను ఓ యువతి పేరెంట్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భగీరథ ఫిర్యాదుతో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. బండి భగీరథ పై ఫోక్సోకేసు నమోదు కావడం పట్ల వెంటనే అతని అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో టిఆర్ఎస్వి మహిళా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పలుచోట్ల పోలీస్ స్టేషన్ నందు నిరసన తెలిపారు.   అమ్మవార్లను నమ్మే బండి సంజయ్ తన కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలడా అని సవాల్ విసిరారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. వెంటనే పొక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    44 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.