కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.
కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది.
హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో
భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల
నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.
- కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.4
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- కరీంనగర్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ముగిసింది. మే 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కళాకారులకు ఉపాధి అవకాశాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.2
- చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.1
- తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ఆలస్యం నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు – “అత్త, కోడలు రావాలి” అంటూ రాస్తారోకోతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. 40 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తొర్రూరు–మహబూబాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ కేంద్రానికి సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అత్త (ఝాన్సీ రెడ్డి), కోడలు (యశస్విని రెడ్డి) రావాలి” అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.1
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని నిన్న రాత్రి డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన1
- పోలీసుల అదుపులో కరీంనగర్ జ్యువెలరీ షాప్ దొంగలు.. బెంగాల్ లో కొంత గోల్డ్ రికవరీ.. త్వరలో అరెస్టు చూపే అవకాశం రాజకీయంగా దుమారం రేపిన కరీంనగర్ లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అంతరాష్ట్ర బీహార్ కు చెందిన ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ముఠా సభ్యులు ఇద్దరితో పాటు గోల్డ్ కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత బంగారాన్ని రికవరీ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసుల వేట కొనసాగుతుంది. పోలీసులకు చిక్కకుండా పగడ్బందీ వ్యూహంతో పారిపోయిన దొంగలు, పలుచోట్ల సిసి కెమెరాకు చిక్కడం ధర్మపురిలో బైక్, బుగ్గారం శివారులో మొబైల్ ఫోన్ పడేసి పోవడంతో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లైంది. ప్రధాన నిందితుడు రెండురోజుల కిందట పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు చిక్కగా పీఎంజేలో దోచుకున్న బంగారు ఆభరణాలలో కొంత పశ్చిమబెంగాల్ లో విక్రయించినట్లు నిర్థారించి రికవరీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో కరీంనగర్ తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 16 బృందాలుగా విడిపోయి గాలింపు కొనసాగిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జ్యువెల్లరీ షాప్ చోరీ నిందితుల అరెస్టు చూపించే అవకాశం ఉంది.1