దళితులను పట్టించుకోని ప్రభుత్వం – ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ..? ఎస్సీ సబ్ ప్లాన్ నిధులపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. ధర్మసమాజ్ పార్టీ తొర్రూరు మండల కన్వీనర్ ఐలయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద యాకమల్లు. తొర్రూరు మహబూబాబాద్ సెప్టెంబర్ 17... షెడ్యూల్డ్ కులాల ప్రత్యక్ష అభివృద్ధి కోసం కేటాయించే ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ధర్మసమాజ్ పార్టీ తొర్రూరు మండల కన్వీనర్ డొనుక ఐలయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మంద యాక మల్లు లు డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పందుల విజయ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డొనక ఐలయ్య, మంద యాకమల్లు మాదిగ లు పాల్గొని మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని ఆరోపించారు. దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా విడుదల చేసి, అర్హులైన ఎస్సీలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపు, విడుదల, ఖర్చు వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురావాలని, దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేసి, అర్హులైన ఎస్సీలకు అందించకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మండల ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి గుడెల్లి మధు మాదిగ, బందు శ్రీమన్ మాదిగ, బందు సంజీవ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1