logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్‌.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం  బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు  రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్‌, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.

1 day ago
user_ఎర్రబోయిన మురళి యాదవ్
ఎర్రబోయిన మురళి యాదవ్
Photographer దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
1 day ago
845a643d-bcac-49a5-8787-31c0262a2bbc

ఇంటి దారి వివాదం

87a65a63-3ca3-409f-8cac-46d07b2db8cd

ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్‌.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్

-దంతాలపల్లి:-

ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం  బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు  రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్‌, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో  శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు       మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.
    4
    దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా?
దారి కోసం.. దండయాత్రా?
ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్
ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా?
సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం!
అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన
దంతాలపల్లి  మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో  శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు       మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.
    user_ఎర్రబోయిన మురళి యాదవ్
    ఎర్రబోయిన మురళి యాదవ్
    Photographer దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..
    1
    కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్.....
మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ
*ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు
లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్  అన్నారు.
నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్  ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు.
మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్  అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న  మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి  ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు.
వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు.
సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు.
సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు.
ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు.
CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు.
సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు.
ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • తెలంగాణ రైతాoగా పోరాట యోధుల్ని స్మరించుకుందాం :సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ పార్టీ 78 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాట యోధులు తన విప్లవ పందాను కొనసాగిస్తూ ప్రజల హక్కుల కోసం తపించారాని పేర్కొన్నారు.. అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడారు.. ఈ కార్యక్రమం లోజిల్లా కౌన్సిల్ సభ్యులు రషీద్ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
    2
    తెలంగాణ రైతాoగా పోరాట యోధుల్ని స్మరించుకుందాం :సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ పార్టీ 78 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాట యోధులు తన విప్లవ పందాను కొనసాగిస్తూ ప్రజల హక్కుల కోసం తపించారాని పేర్కొన్నారు..
అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడారు..
ఈ కార్యక్రమం లోజిల్లా కౌన్సిల్ సభ్యులు రషీద్ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
    1
    వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
  • హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security
    1
    హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Khanapur, Warangal•
    1 hr ago
  • రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.
    1
    రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........
రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్  అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • మడికొండలో కొండచిలువ కలకలం.. అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం మడికొండ హైవేపై డీసీసీ బ్యాంక్ పక్కన వేకువజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. రద్దీ ప్రాంతంలో పాము రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యార. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అలాగే ఇలాంటి ఘటనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
    1
    మడికొండలో కొండచిలువ కలకలం.. అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు
హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం మడికొండ హైవేపై డీసీసీ బ్యాంక్ పక్కన వేకువజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. రద్దీ ప్రాంతంలో పాము రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యార. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అలాగే ఇలాంటి ఘటనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    5 hrs ago
  • తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్.. మహబూబాబాద్ జిల్లా తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్ చేసింది.. ప్రధాన రహవారిపై పడగ విప్పి ఉండటాన్ని కాసేపు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.. ఆ తర్వాత రోడ్ వెంబడి ఉండే డివైడర్ వైపు చెట్ల పొదల్లోకి నాగు పాము వెళ్లడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..
    1
    తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్..
మహబూబాబాద్ జిల్లా తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్ చేసింది..
ప్రధాన రహవారిపై పడగ విప్పి ఉండటాన్ని కాసేపు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.. ఆ తర్వాత రోడ్ వెంబడి ఉండే డివైడర్ వైపు చెట్ల పొదల్లోకి నాగు పాము వెళ్లడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.