దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.
దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి
మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో శంకర్ దగ్గర
ఎస్‌ఐ లంచం తీసుకుని వారి
కుటుంబాలకు మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌.𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏#𝐌𝐀𝐋𝐄][𝐁𝐀3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐀𝐍𝐀𝐌 𝐌𝐎𝐍𝐃𝐀-𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂][𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀-𝐒𝐓𝐀𝐓𝐄#𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃)4
- సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణా ప్రాంతం నిజాం నవాబు కబంధ హస్తాలలో మగ్గిందన్నారు.తెలంగాణా ప్రాంతానికి కూడా విముక్తి కావాలని పోరాడిన అమర వీరులకు గౌరవం రావాలని బీజేపీ ఉద్యమం చేస్తుంది.ఖమ్మం జిల్లా లో తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ నిజాం నవాబు కు వ్యతిరేకంగా సంపాదకీయం రాసినందుకు ఆయన్ను హతం చేశారని తెలిపారు. షోయబుల్లాఖాన్ జన్మించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.1
- మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1
- తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న నూతన కలెక్టరేట్ ములుగు జిల్లా, సెప్టెంబర్ 16 (భారత శక్తి): నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.2