Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
Suresh Kumar
ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు ఆకేరులో వరద రాలేదు. కాగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆకేరు జలకళను సంతరించుకుంది. దీంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మండలంలోని మున్నేరు సైతం భారీగా ప్రవహిస్తుంది.1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- వినాయకుడి పూజకు అతిథిగా ఎలుక! అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ట్రైబల్ గర్ల్స్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన గణేశుడి మండపంలోకి వచ్చిన ఎలుక.. మైకుల హోరు, విద్యార్థుల భజనల మధ్య కూడా ఏమాత్రం భయపడకుండా గణేశుడి విగ్రహం వద్దే కూర్చుంది. దీంతో విద్యార్థులు, స్థానికులు ఆశ్చర్యపోయారు..!1
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- భూ వివాదం లో ఎస్ ఐ తలదూర్చారంటు దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ కుటుంబం ధర్నా.. మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు తూర్పు తండా కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి కి చెందిన కుటుంబం ధర్నా దిగింది.. దంతాల పల్లి ఎస్ ఐ రవి కుమార్ మా భూమి విషయం లో కలుగ చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.. మాకు న్యాయం చేయాలనీ లేనట్టాయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలనీ బాధిత కుటుంబం వేడుకుంటుంది..1
- చేతులెత్తి మొక్కుతారు అంతలోనే కాళ్లతో తొక్కేస్తారు ఏమిటో !1
- మేడే కాలనీలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలు.. స్కూల్ ఎదుట అధ్వానంగా ఉన్న పరిస్థితులపై సర్పంచ్ పరిశీలన... సారపాక: మేడే కాలనీలోని పాఠశాల ఎదుట అధ్వానంగా ఉన్న డ్రైనేజీ, రహదారి సమస్యలను సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు, స్థానికులు రాకపోకలు సాగించే ప్రాంతంలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. రహదారి పరిస్థితిని కూడా పరిశీలించిన ఆయన సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థల హద్దులకు సంబంధించిన విషయంలో సర్పంచ్, కొందరు స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పాఠశాల ఎదుట ఉన్న స్థలం తమ పరిధిలోకి వస్తుందనే విషయంలో ఇరువర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ సమస్యతో మురుగునీరు సక్రమంగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, రహదారి సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే స్థల హద్దుల విషయంలో తలెత్తిన వివాదానికి సంబంధించి సంబంధిత రికార్డులను పరిశీలించి, అధికారుల సమక్షంలో హద్దులను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమస్యపై అధికారులు స్పందించి పాఠశాల పరిసరాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరుతున్నారు.4