పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటలి... రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ... జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. వరంగల్ జిల్లా, ఆగస్టు 25: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని, నాటిన ప్రతి మొక్కను రక్షించాలాని, ఇందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా మొక్కలు నాటి పెంచడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆమె అన్నారు. వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా ఫారెస్ట్ అధికారి నిఖిత,గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రభావం కారణంగా వన మహోత్సవ కార్యక్రమం కొంత ఆలస్యమైందన్నారు. ఒక్క రోజులోనే 10 శాతం మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిలో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. సకాలంలో వర్షాలు కురవకపోవడానికి సరైన వృక్ష సంపద లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు. వృక్షాలు మానవ మనుగడకు ఎంతో దోహదపడతాయని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్లు అత్యంత అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచి సంరక్షించాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగాలని సూచించారు. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. మొక్కలను నాటడం తో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. చెట్లను నరకకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ... వరంగల్ జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటివరకు సుమారు 13 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వృక్ష సంపదతోనే పర్యావరణ సమతుల్యత ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎఫ్ భీమా నాయక్ మాట్లాడుతూ... వృక్ష సంపద సమృద్ధిగా ఉంటే వాతావరణ మార్పుల ప్రభావం తగ్గి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, తహసీల్దార్ ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటలి... రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ... జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. వరంగల్ జిల్లా, ఆగస్టు 25: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని, నాటిన ప్రతి మొక్కను రక్షించాలాని, ఇందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా మొక్కలు నాటి పెంచడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆమె అన్నారు. వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా ఫారెస్ట్ అధికారి నిఖిత,గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రభావం కారణంగా వన మహోత్సవ కార్యక్రమం కొంత ఆలస్యమైందన్నారు. ఒక్క రోజులోనే 10 శాతం మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిలో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో
విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. సకాలంలో వర్షాలు కురవకపోవడానికి సరైన వృక్ష సంపద లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు. వృక్షాలు మానవ మనుగడకు ఎంతో దోహదపడతాయని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్లు అత్యంత అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచి సంరక్షించాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగాలని సూచించారు. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. మొక్కలను నాటడం తో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. చెట్లను నరకకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ... వరంగల్ జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటివరకు సుమారు 13 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వృక్ష సంపదతోనే పర్యావరణ సమతుల్యత ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎఫ్ భీమా నాయక్ మాట్లాడుతూ... వృక్ష సంపద సమృద్ధిగా ఉంటే వాతావరణ మార్పుల ప్రభావం తగ్గి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, తహసీల్దార్ ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
- మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కలెక్టర్ హేమంత్ బోర్కాడే. ములుగు జిల్లా. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- హుస్నాబాద్ 20వ వార్డులో పందుల బెడద................... ......... హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో పెద్ద సంఖ్యలో పందులు సంచరిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.1
- రంగశాయిపేటలో ఘనంగా వనమహోత్సవం.. మొక్కలు నాటిన మంత్రి కొండా సురేఖ వరంగల్: ఖిలా వరంగల్ పరిధిలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రకృతి సంపద సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.1