logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*వృద్ధులకు మాయ మాటలు చెప్పి పింఛను అపహరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి* *లబోదిబోమంటున్న బాధితురాళ్ళు* మండపేట. ఎనిమిది వేలు రావాల్సిన పింఛను నాలుగువేలె రావడం ఏంటి అంటూ ఓ వ్యక్తి వృద్ధులను మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ పట్టణంలో అందినకాడికి డబ్బులు అపహరించుకుపోతున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే మండపేట సెయింట్ ఆన్స్ స్కూల్ వీధిలో కాసిలంక సుబ్బారావు అనే వ్యక్తి కి ఈ రోజు ఉదయమే 4 వేల రూపాయల పింఛను అందింది. కాలి సమస్య కారణంగా ఇతను నడవలేడు. భార్యే అన్ని చూసుకుంటుంది. కాగా ఈ రోజు ఉదయం 9.30 సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వీరి వద్దకు వచ్చాడు. వస్తూనే అమ్మా మీకు పింఛను ఎంత వస్తుంది అని సుబ్బారావు భార్య గంగా భవాని నీ ప్రశ్నించాడు. నాలుగు వేలు అని చెప్పగా అదేంటి నీకు ఎనిమిది వేలు ఇవ్వలేదా అని ప్రశ్నించాడు. లేదని చెప్పగా నీ భర్త నడవలేడుగా మీలాంటి వారికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అంటూ ప్రేమగా నాలుగు మాటలు కలిపాడు. మీ ఆధార కార్డు, ఫోటోలు కావాలి అని చెప్పాడు. మీకు ఎంత డబ్బులు ఇచ్చారో ఇలా చూపించండి అంటూ చేతిలో నాలుగు వేలు పెట్టీ ఫోటో తీసుకున్నాడు. ఆపై ఎవరికో ఫోన్ చేసి పేరు వివరాలు చెప్పి వెంటనే 8 వేలు పట్టుకుని రావాలని చెప్పాడు. మీ దగ్గరి డబ్బులు ఇలా ఇచ్చేయండి వేరొకరు వచ్చి 8 వేలు ఇస్తారని చెప్పి అక్కడ నుండి ఉడాయించాడు. కాగా తాజా గా అందిన సమాచారం ప్రకారం 29వార్డులో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఇద్దరికి ఆ పింఛనే ఆధారమని, అది కాస్తా మొత్తం పోయిందని, ఇక ఈ నెల అంతా ఎలా గడపాలి అంటూ మోసానికి గురైన వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాగా ఈ మోసగాడు పట్టణం లోనే తిరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు పింఛనుదారులను, అమాయకులను అప్రమత్తం చేయాల్సి ఉంది.

1 hr ago
user_Raju Nandikolla
Raju Nandikolla
Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
ccbc899e-c463-4133-b2cf-c03d1c117087

More news from Andhra Pradesh and nearby areas
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    18 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    17 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Life changing opportunity 💥 ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰 Part time / Full time work available Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇 Limited seats only 🚀
    1
    Life changing opportunity 💥  
ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰  
Part time / Full time work available  
Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇  
Limited seats only 🚀
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    చెరుకుపల్లె హెచ్.ఓ అరుంబాక, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Adimlamrambabu Adimlamrambabu
    1
    Post by Adimlamrambabu Adimlamrambabu
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.