logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మున్సిపల్ ఆఫీస్ అధికారులపైవచ్చిన ఫిర్యాదులపై తనిఖీలు చేపట్టిన ఎసిబి అధికారులు యాంకర్ వాయిస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. కార్యాలయం గేట్లు మూసివేసి లోపల పలు రికార్డులను పరిశీలించిన అధికారులు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్,ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, బిల్లుల చెల్లింపులు, పన్నుల వసూళ్లలో ఉన్న లోపాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు పలువురు అధికారులు, సిబ్బందిని విడివిడిగా విచారించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ మాట్లాడుతూ... డీజీ ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నామని సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంపై తమకు పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. మున్సిపాలిటీలో ఇంటి పన్నులు సరిగా వసూలు చేయలేదని నీటి పన్నులు సక్రమంగా వసూలు చేయడంలో జాప్యం జరిగినట్లు గుర్తించామని చెప్పారు. అలాగే సిబ్బంది విధులకు గైర్హాజర్ అవటంతో పాటు పనితీరు సరిగా లేదని పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని ఆఫీసులో రికార్డులతో పాటు కమిషనర్,మేనేజర్ ఇండ్ల వద్ద జరిపిన సోదాలలో లభించిన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని సోదాల అనంతరం పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు డి.ఎస్.పి రమేష్.

3 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
3 hrs ago

మున్సిపల్ ఆఫీస్ అధికారులపైవచ్చిన ఫిర్యాదులపై తనిఖీలు చేపట్టిన ఎసిబి అధికారులు యాంకర్ వాయిస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. కార్యాలయం గేట్లు మూసివేసి లోపల పలు రికార్డులను పరిశీలించిన అధికారులు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్,ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, బిల్లుల చెల్లింపులు, పన్నుల వసూళ్లలో ఉన్న లోపాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు పలువురు అధికారులు, సిబ్బందిని విడివిడిగా విచారించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏసీబీ

డీఎస్పీ వై. రమేష్ మాట్లాడుతూ... డీజీ ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నామని సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంపై తమకు పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. మున్సిపాలిటీలో ఇంటి పన్నులు సరిగా వసూలు చేయలేదని నీటి పన్నులు సక్రమంగా వసూలు చేయడంలో జాప్యం జరిగినట్లు గుర్తించామని చెప్పారు. అలాగే సిబ్బంది విధులకు గైర్హాజర్ అవటంతో పాటు పనితీరు సరిగా లేదని పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని ఆఫీసులో రికార్డులతో పాటు కమిషనర్,మేనేజర్ ఇండ్ల వద్ద జరిపిన సోదాలలో లభించిన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని సోదాల అనంతరం పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు డి.ఎస్.పి రమేష్.

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    46 min ago
  • అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    1
    అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ
అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    4
    ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    16 min ago
  • మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో  అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా  డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    1
    మండపేట టౌన్ న్యూస్...
అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో  అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా  డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.