స్లగ్:-కల్లూరు లో రోడ్ సేఫ్టీ కార్యక్రమం లో పాల్గున్న ఏసీపీ వసుందర యాదవ్ ఐపీస్ యాంకర్ వాయిస్:- ఖమ్మం జిల్లా కల్లూరులో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కల్లూరులో నిర్వహించిన ఈ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ వసుంధర యాదవ్ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని ఆమె తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మీ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. మద్యం సేవించి వాహనం నడపకండి అని అన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ముత్తిలింగయ్య, ఎస్సై హరిత, మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, విద్యుత్ శాఖ ఏఈ మహేంద్ర బాబు, ఎన్‌హెచ్‌ఏ అధికారులు, మున్సిపల్ మేనేజర్ నాగేశ్వరావు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Post by V Ramarao2
- అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.1
- మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- Post by Syyed taher1
- Post by SS NEWS1
- ఈరోజు నకిరేకల్ లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ & ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలేసి ఆశ వర్కర్లను మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడం స్పష్టమైన ద్రోహం. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచ్చి, రాష్ట్ర నాయకులు, ఆశ వర్కర్లను అరెస్టు చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, ఇది ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతు నొక్కే చర్య. ఈ విధానం నియంతృత్వ పాలనకు సంకేతం. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లను అనగదొక్కే ప్రయత్నం చేస్తే అది ప్రజల ఆగ్రహన్నీ రెచ్చగొట్టడమే. ప్రభుత్వం వెంటనే తన నిరంకుశ వైఖరిని విరమిచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతుందన్నారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో ఈరోజు BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు & ఆశా ల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక ఆధ్వర్యంలో BRTU అనుబంధ ఆశ వర్కర్లు నకిరేకల్ PHC వద్ద నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా చేసి నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఆశ వర్కర్ల డిమాండ్లు: 1. ఆశ వర్కర్లకు ఇచ్చిన 18000 ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి. 2. ప్రజాస్వామ్య పోరాటoను అణచివేయడం వెంటనే ఆపాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పోరాటం మరింత తీవ్రత దాలుస్తుందని అన్నారు .ఆశ వర్కర్లను తక్కువగా అంచనా వేయకండి. ఆశాల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చమని BRTU డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో SK సుల్తానా, కొండ అనసూర్య, A హైమావతి, M నీలావతి, M స్వప్న, V సుజాత, CH ఇందిర, P లలిత, P రేణుక, Y విజయలక్ష్మి, CH నాగమణి, B జ్యోతి తదితరులు పాల్గొన్నారు.4
- Post by V Ramarao1