జనగామలో అకాల వర్షం బీభత్సం: మార్కెట్ యార్డ్‌లో తడిసిన మక్కలు.. కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
జనగామలో అకాల వర్షం బీభత్సం: మార్కెట్ యార్డ్‌లో తడిసిన మక్కలు.. కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో
ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి
రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం
తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్ళు పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, 10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.2
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- Post by Ramprasad islavath1
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1