logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం.... జిల్లాలో #63_మంది బాల కార్మికులకు విముక్తి – జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్... బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, విడిచిపెట్టబడిన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ తెలిపారు.బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి జూలై 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్–XII చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి సబ్‌డివిజన్ పరిధిలో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్‌తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో హోటళ్లు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 63 మంది బాల కార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలతో పనులు చేయిస్తున్న యజమానులపై 26 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నా, బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నా, లేదా తప్పిపోయిన, విడిచిపెట్టబడిన చిన్నారుల సమాచారం తెలిసినా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా డయల్–100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం కావడానికి సహకరించిన పోలీసు శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, జిల్లా బాలల సంరక్షణ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

11 hrs ago
user_MD. YOUSUF ALI KHAN
MD. YOUSUF ALI KHAN
కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
11 hrs ago
1c5edbf6-af4a-4c46-a5f1-6e22a41753df

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం.... జిల్లాలో #63_మంది బాల కార్మికులకు విముక్తి – జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్... బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, విడిచిపెట్టబడిన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ తెలిపారు.బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి జూలై 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్–XII చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి సబ్‌డివిజన్ పరిధిలో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్‌తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో హోటళ్లు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 63 మంది బాల కార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)

d9706ced-a87b-4072-a982-b9062387af28

ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలతో పనులు చేయిస్తున్న యజమానులపై 26 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నా, బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నా, లేదా తప్పిపోయిన, విడిచిపెట్టబడిన చిన్నారుల సమాచారం తెలిసినా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా డయల్–100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం కావడానికి సహకరించిన పోలీసు శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, జిల్లా బాలల సంరక్షణ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    1
    సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం."
"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... 
సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది."
**"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి మంత్రి కామెంట్స్ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి.. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఉత్తమ్ కుమార్ కామెంట్స్ శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా ఎలా ఉంది ప్రజలు గమనించాలి జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము
    4
    నిజామాబాదు జిల్లా 

శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి 

మంత్రి కామెంట్స్ 

ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది 

కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు

బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి 

గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు 

దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి..

అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది 
కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది 

కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది


ఉత్తమ్ కుమార్ కామెంట్స్ 

శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది 

మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది 



రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది  స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం 

మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది 

దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి 

నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు 

ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు 

కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై 

అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా  ఉన్నాయి 

బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా  ఎలా ఉంది ప్రజలు గమనించాలి 

జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము
    user_Boss
    Boss
    Photographer భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    1
    జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు
బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని  ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.
    1
    చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి
జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం
జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ​ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్
అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు..
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
​ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    51 min ago
  • వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్ ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు
    1
    వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్
వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు
ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్
ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్
ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి
నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి..* ఓట్ల కోసం విద్యార్థులకు మాయమాటలు చెప్పి ,గెలిచి గద్దనెక్కిన తర్వాత విద్యార్థుల ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తున్నాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులను అవమానించడం బాధాకరం.. *తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని బస్టాండ్ దగ్గర బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేయడం జరిగింది..* *ఈ సందర్భంగా జిల్లా యువమోర్చ అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ..* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వారిని ఈ విధంగా సంబోధించడం విద్యార్థులను, వారి కష్టాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుందని అన్నారు.. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కనీసం ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని "క్రిమినల్స్", "వేస్ట్" అంటూ నోరుపారేసుకోవడం వారి అహంకార పూరిత వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే—రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. నిరుద్యోగ భృతి 4,000 వేలు, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైన ఈ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపైనే ఇటువంటి నిందలు వేయడం దురదృష్టకరం అని కాంగ్రెస్ ప్రభుత్వ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమించి ఎండగడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి ,బిజెపి నాయకులు, రజినీకాంత్,భూమేష్ యాదవ్,సందీప్, చిరంజీవి, అశోక్ ,బిజెవైఎం నాయకులు అరుణ్,రాజు, సందీప్, సాయి, ప్రణయ్ తదితరులు ఉన్నారు..
    1
    ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి..*
ఓట్ల కోసం విద్యార్థులకు మాయమాటలు చెప్పి ,గెలిచి గద్దనెక్కిన తర్వాత విద్యార్థుల ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తున్నాడు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులను అవమానించడం  బాధాకరం..
*తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని  బస్టాండ్  దగ్గర బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు  ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం  కార్యక్రమం చేయడం జరిగింది..*
*ఈ సందర్భంగా జిల్లా యువమోర్చ అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ..*
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వారిని ఈ విధంగా సంబోధించడం విద్యార్థులను, వారి కష్టాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుందని అన్నారు..
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది.  ఇటీవల ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కనీసం ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని "క్రిమినల్స్", "వేస్ట్" అంటూ నోరుపారేసుకోవడం వారి అహంకార పూరిత వైఖరికి నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే—రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. 
నిరుద్యోగ భృతి 4,000 వేలు, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైన ఈ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపైనే ఇటువంటి నిందలు వేయడం దురదృష్టకరం అని  కాంగ్రెస్ ప్రభుత్వ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమించి ఎండగడుతుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి ,బిజెపి  నాయకులు, రజినీకాంత్,భూమేష్ యాదవ్,సందీప్, చిరంజీవి, అశోక్ ,బిజెవైఎం నాయకులు అరుణ్,రాజు, సందీప్, సాయి, ప్రణయ్  తదితరులు ఉన్నారు..
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.