logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్‌లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. స్కూళ్లు, కాలేజీల సమయానికి అదనంగా బస్సులు నడుపుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహా లక్ష్మి పథకం ప్రారంభమయ్యాక ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, కొత్త రూట్లలో బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని విమర్శించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ బస్సులకు ఉచిత ప్రయాణమే కాకుండా, ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసిందని మంత్రులు తెలిపారు. ప్రయాణికులతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలని, వారికి అసౌకర్యం కలిగించవద్దని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్నికలు పూర్తవగానే గెలిచిన సంఘం నాయకులతో అధికారుల కమిటీలో విలీనం ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రులు వెల్లడించారు. పీఆర్సీ ప్రకటించి, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, విలీనం చేస్తుండటం పట్ల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్న మంత్రులు, గురుకుల పాఠశాలల్లో మెస్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచామని, అనుభవం ఉన్న అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించి, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, మిల్క్ పథకాలను ప్రారంభించామని చెప్పారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు 2-3 వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారని, హాస్పిటళ్లు, దేవాలయాలకు ఉచితంగా వెళ్తున్నారని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ దేశంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పేదల ప్రభుత్వం అని మంత్రులు అభివర్ణించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం డిసెంబర్ 3, 2023న అధికారంలోకి వచ్చి, డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఆర్టీసీలో అప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామని, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేసి, కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు. దేశంలోనే ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొంటూ, ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుందని, దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా తెలంగాణ ఆర్టీసీ అని, 10 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ప్రయాణికులతో మాట్లాడుతుంటే వారు రోజుకు 200 రూపాయల వరకు ఛార్జీలు ఆదా చేసుకుంటూ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. ఆటో కార్మికులు తమ ఉద్యమకారులని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. జూన్ 21న నీట్ పరీక్ష రాసే వారికి ఉచిత ప్రయాణం అందించాలని NSUI అధ్యక్షుడు వెంకట్ స్వామి కోరారని, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి హాల్ టికెట్ ఉన్నవారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ముందుకు వెళ్తుందని ఆయన నొక్కి చెప్పారు.

1 hr ago
user_శాతవాహన కరీంనగర్
శాతవాహన కరీంనగర్
కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్‌లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. స్కూళ్లు, కాలేజీల సమయానికి అదనంగా బస్సులు నడుపుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహా లక్ష్మి పథకం ప్రారంభమయ్యాక ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, కొత్త రూట్లలో బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని విమర్శించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ బస్సులకు ఉచిత ప్రయాణమే కాకుండా, ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసిందని మంత్రులు తెలిపారు. ప్రయాణికులతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలని, వారికి అసౌకర్యం కలిగించవద్దని సూచించారు. ఆర్టీసీ

కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్నికలు పూర్తవగానే గెలిచిన సంఘం నాయకులతో అధికారుల కమిటీలో విలీనం ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రులు వెల్లడించారు. పీఆర్సీ ప్రకటించి, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, విలీనం చేస్తుండటం పట్ల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్న మంత్రులు, గురుకుల పాఠశాలల్లో మెస్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచామని, అనుభవం ఉన్న అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించి, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, మిల్క్ పథకాలను ప్రారంభించామని చెప్పారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు 2-3 వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారని, హాస్పిటళ్లు, దేవాలయాలకు ఉచితంగా వెళ్తున్నారని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత

విద్యుత్, 500 గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ దేశంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పేదల ప్రభుత్వం అని మంత్రులు అభివర్ణించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం డిసెంబర్ 3, 2023న అధికారంలోకి వచ్చి, డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఆర్టీసీలో అప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామని, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేసి, కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు. దేశంలోనే ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని

పేర్కొంటూ, ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుందని, దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా తెలంగాణ ఆర్టీసీ అని, 10 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ప్రయాణికులతో మాట్లాడుతుంటే వారు రోజుకు 200 రూపాయల వరకు ఛార్జీలు ఆదా చేసుకుంటూ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. ఆటో కార్మికులు తమ ఉద్యమకారులని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. జూన్ 21న నీట్ పరీక్ష రాసే వారికి ఉచిత ప్రయాణం అందించాలని NSUI అధ్యక్షుడు వెంకట్ స్వామి కోరారని, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి హాల్ టికెట్ ఉన్నవారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ముందుకు వెళ్తుందని ఆయన నొక్కి చెప్పారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్‌లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. స్కూళ్లు, కాలేజీల సమయానికి అదనంగా బస్సులు నడుపుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహా లక్ష్మి పథకం ప్రారంభమయ్యాక ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, కొత్త రూట్లలో బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని విమర్శించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ బస్సులకు ఉచిత ప్రయాణమే కాకుండా, ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసిందని మంత్రులు తెలిపారు. ప్రయాణికులతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలని, వారికి అసౌకర్యం కలిగించవద్దని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్నికలు పూర్తవగానే గెలిచిన సంఘం నాయకులతో అధికారుల కమిటీలో విలీనం ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రులు వెల్లడించారు. పీఆర్సీ ప్రకటించి, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, విలీనం చేస్తుండటం పట్ల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్న మంత్రులు, గురుకుల పాఠశాలల్లో మెస్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచామని, అనుభవం ఉన్న అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించి, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, మిల్క్ పథకాలను ప్రారంభించామని చెప్పారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు 2-3 వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారని, హాస్పిటళ్లు, దేవాలయాలకు ఉచితంగా వెళ్తున్నారని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ దేశంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పేదల ప్రభుత్వం అని మంత్రులు అభివర్ణించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం డిసెంబర్ 3, 2023న అధికారంలోకి వచ్చి, డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఆర్టీసీలో అప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామని, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేసి, కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు. దేశంలోనే ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొంటూ, ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుందని, దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా తెలంగాణ ఆర్టీసీ అని, 10 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ప్రయాణికులతో మాట్లాడుతుంటే వారు రోజుకు 200 రూపాయల వరకు ఛార్జీలు ఆదా చేసుకుంటూ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. ఆటో కార్మికులు తమ ఉద్యమకారులని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. జూన్ 21న నీట్ పరీక్ష రాసే వారికి ఉచిత ప్రయాణం అందించాలని NSUI అధ్యక్షుడు వెంకట్ స్వామి కోరారని, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి హాల్ టికెట్ ఉన్నవారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ముందుకు వెళ్తుందని ఆయన నొక్కి చెప్పారు.
    4
    తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్‌లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. స్కూళ్లు, కాలేజీల సమయానికి అదనంగా బస్సులు నడుపుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహా లక్ష్మి పథకం ప్రారంభమయ్యాక ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, కొత్త రూట్లలో బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని విమర్శించారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ బస్సులకు ఉచిత ప్రయాణమే కాకుండా, ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసిందని మంత్రులు తెలిపారు. ప్రయాణికులతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలని, వారికి అసౌకర్యం కలిగించవద్దని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్నికలు పూర్తవగానే గెలిచిన సంఘం నాయకులతో అధికారుల కమిటీలో విలీనం ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రులు వెల్లడించారు. పీఆర్సీ ప్రకటించి, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, విలీనం చేస్తుండటం పట్ల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్న మంత్రులు, గురుకుల పాఠశాలల్లో మెస్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచామని, అనుభవం ఉన్న అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించి, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, మిల్క్ పథకాలను ప్రారంభించామని చెప్పారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు 2-3 వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారని, హాస్పిటళ్లు, దేవాలయాలకు ఉచితంగా వెళ్తున్నారని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ దేశంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పేదల ప్రభుత్వం అని మంత్రులు అభివర్ణించారు.

అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం డిసెంబర్ 3, 2023న అధికారంలోకి వచ్చి, డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఆర్టీసీలో అప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామని, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేసి, కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు. దేశంలోనే ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొంటూ, ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుందని, దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా తెలంగాణ ఆర్టీసీ అని, 10 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ప్రయాణికులతో మాట్లాడుతుంటే వారు రోజుకు 200 రూపాయల వరకు ఛార్జీలు ఆదా చేసుకుంటూ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. ఆటో కార్మికులు తమ ఉద్యమకారులని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. జూన్ 21న నీట్ పరీక్ష రాసే వారికి ఉచిత ప్రయాణం అందించాలని NSUI అధ్యక్షుడు వెంకట్ స్వామి కోరారని, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి హాల్ టికెట్ ఉన్నవారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ముందుకు వెళ్తుందని ఆయన నొక్కి చెప్పారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్‌మెంట్‌ తేదీని ప్రకటించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇదురు వెంకన్న డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన రీజినల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం 55 రోజుల ఆర్టీసీ సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేసిందని, ఈ క్రమంలో 36 మంది కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం కనికరించలేదని, ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని వెంకన్న వాపోయారు. కార్మిక సంఘాలను రద్దు చేశారని కూడా మండిపడ్డారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికుల వేతన సవరణ, కేటగిరీల ఖాళీల భర్తీ, పనిభారం తగ్గింపు వంటి డిమాండ్ల కోసం ఉద్యమించినట్లు తెలిపారు. 2023లో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఈ డిమాండ్లకు సానుకూలంగా స్పందించి, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏప్రిల్ 22న సమ్మెకు దిగామని, ఈ క్రమంలో శంకర్ గౌడ్ అనే కార్మికుడు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి అత్యవసర క్యాబినెట్‌లో మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి చర్చలకు ఆహ్వానించిందని వెంకన్న తెలిపారు. ముఖ్యమంత్రి మొదట విలీనం కావాలా లేక గుర్తింపు సంఘం ఎన్నికలు కావాలా అని అడిగినప్పుడు, కార్మిక సంఘాలు ముందుగా గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వివరించారు. అయితే, ప్రస్తుతం సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాతే విలీనం అంటూ ప్రకటించి కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ముందుగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామన్న నిర్ణయాన్ని ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చినట్లు వెంకన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె తర్వాత ఈ ఏడాది మే 1న ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా తాము విలీనమే ముందు జరగాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. అన్ని కార్మిక సంఘాలు కూడా ముందు విలీనానికే మొగ్గు చూపుతున్నందున, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియను ఆపేసి, విలీన ప్రక్రియను చేపట్టాలని ఆయన కోరారు. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశంలో చర్చించి విలీన ప్రక్రియను ప్రకటించి, కార్మికుల గందరగోళ పరిస్థితులకు తెరదించాలని వెంకన్న పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే మరో ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకు మల్ల సమ్మయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బెజ్జంకి కాళిదాస్, రీజనల్ కార్యదర్శి కొమ్మ కొమురయ్య యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్‌మెంట్‌ తేదీని ప్రకటించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇదురు వెంకన్న డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన రీజినల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం 55 రోజుల ఆర్టీసీ సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేసిందని, ఈ క్రమంలో 36 మంది కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం కనికరించలేదని, ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని వెంకన్న వాపోయారు. కార్మిక సంఘాలను రద్దు చేశారని కూడా మండిపడ్డారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికుల వేతన సవరణ, కేటగిరీల ఖాళీల భర్తీ, పనిభారం తగ్గింపు వంటి డిమాండ్ల కోసం ఉద్యమించినట్లు తెలిపారు. 2023లో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఈ డిమాండ్లకు సానుకూలంగా స్పందించి, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏప్రిల్ 22న సమ్మెకు దిగామని, ఈ క్రమంలో శంకర్ గౌడ్ అనే కార్మికుడు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు.

దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి అత్యవసర క్యాబినెట్‌లో మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి చర్చలకు ఆహ్వానించిందని వెంకన్న తెలిపారు. ముఖ్యమంత్రి మొదట విలీనం కావాలా లేక గుర్తింపు సంఘం ఎన్నికలు కావాలా అని అడిగినప్పుడు, కార్మిక సంఘాలు ముందుగా గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వివరించారు. అయితే, ప్రస్తుతం సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాతే విలీనం అంటూ ప్రకటించి కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ముందుగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామన్న నిర్ణయాన్ని ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చినట్లు వెంకన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె తర్వాత ఈ ఏడాది మే 1న ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా తాము విలీనమే ముందు జరగాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. అన్ని కార్మిక సంఘాలు కూడా ముందు విలీనానికే మొగ్గు చూపుతున్నందున, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియను ఆపేసి, విలీన ప్రక్రియను చేపట్టాలని ఆయన కోరారు. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశంలో చర్చించి విలీన ప్రక్రియను ప్రకటించి, కార్మికుల గందరగోళ పరిస్థితులకు తెరదించాలని వెంకన్న పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే మరో ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకు మల్ల సమ్మయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బెజ్జంకి కాళిదాస్, రీజనల్ కార్యదర్శి కొమ్మ కొమురయ్య యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆయన కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కలిసి, కళాశాల హాస్టల్ భవన నిర్మాణంతో పాటు పలు సమస్యలను వినతి పత్రం ద్వారా అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి బండి సంజయ్, బాలుర, బాలికల హాస్టల్ భవన నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన భవన నిర్మాణ కాంట్రాక్టర్ తో మాట్లాడగా, కాంట్రాక్టర్ నెల రోజుల్లో నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం క్యాంపస్ లో హాస్టల్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో జనరేటర్ లేకపోవడంతో కరెంట్ లేని సమయాల్లో క్లాస్ ల నిర్వహణ ఇబ్బందిగా మారిందని, నిర్వహణ సమస్యలున్నాయని పేర్కొన్నారు. ఆధునిక ఆడిటోరియం, స్పోర్ట్స్ స్టేడియం లేకపోవడంపైనా విద్యార్థులు ఇబ్బందులను తెలిపారు. దీనితో పాటు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ విద్యార్థినులకు టాయిలెట్ సౌకర్యాలు సరిగా లేవని ఒక విద్యార్థిని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలపై బండి సంజయ్ వెంటనే చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం తానే జనరేటర్ ను కొనుగోలు చేసి అందిస్తానని హామీ ఇవ్వడంతోపాటు, తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే, సీఎస్సార్ నిధులతో టాయిలెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. హాస్టల్ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆధునిక ఆడిటోరియం, స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుపై తగిన నిర్ణయం తీసుకుంటానని బండి సంజయ్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. మంత్రి బండి సంజయ్ సానుకూల హామీలపై విద్యార్థులు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.
    1
    కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆయన కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కలిసి, కళాశాల హాస్టల్ భవన నిర్మాణంతో పాటు పలు సమస్యలను వినతి పత్రం ద్వారా అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి బండి సంజయ్, బాలుర, బాలికల హాస్టల్ భవన నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన భవన నిర్మాణ కాంట్రాక్టర్ తో మాట్లాడగా, కాంట్రాక్టర్ నెల రోజుల్లో నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగిస్తానని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం క్యాంపస్ లో హాస్టల్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో జనరేటర్ లేకపోవడంతో కరెంట్ లేని సమయాల్లో క్లాస్ ల నిర్వహణ ఇబ్బందిగా మారిందని, నిర్వహణ సమస్యలున్నాయని పేర్కొన్నారు. ఆధునిక ఆడిటోరియం, స్పోర్ట్స్ స్టేడియం లేకపోవడంపైనా విద్యార్థులు ఇబ్బందులను తెలిపారు. దీనితో పాటు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ విద్యార్థినులకు టాయిలెట్ సౌకర్యాలు సరిగా లేవని ఒక విద్యార్థిని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలపై బండి సంజయ్ వెంటనే చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం తానే జనరేటర్ ను కొనుగోలు చేసి అందిస్తానని హామీ ఇవ్వడంతోపాటు, తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే, సీఎస్సార్ నిధులతో టాయిలెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. హాస్టల్ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆధునిక ఆడిటోరియం, స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుపై తగిన నిర్ణయం తీసుకుంటానని బండి సంజయ్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

మంత్రి బండి సంజయ్ సానుకూల హామీలపై విద్యార్థులు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. అధికారులు తన మాట వినడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఇది ఆయన కొత్త డ్రామా అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రతిదానికి బీఆర్ఎస్ పార్టీని నిందిస్తే ప్రజలు నమ్మడం లేదని రేవంత్ రెడ్డి గ్రహించారని, అందుకే ఇప్పుడు అధికారులపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డికి చేతగాక అధికారుల మీద ఏడవడం సరికాదని హరీష్ రావు ప్రశ్నించారు.
    1
    తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. అధికారులు తన మాట వినడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఇది ఆయన కొత్త డ్రామా అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

ప్రతిదానికి బీఆర్ఎస్ పార్టీని నిందిస్తే ప్రజలు నమ్మడం లేదని రేవంత్ రెడ్డి గ్రహించారని, అందుకే ఇప్పుడు అధికారులపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డికి చేతగాక అధికారుల మీద ఏడవడం సరికాదని హరీష్ రావు ప్రశ్నించారు.
    user_Dokidi Thirupathi
    Dokidi Thirupathi
    Local News Reporter వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 18న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన జెండా పండగ కార్యక్రమంలో భాగంగా జరుగుతుందని పార్టీ రాష్ట్ర పరిశీలకులు రంజిత్ కుమార్ తెలిపారు. ఆయన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు. కవిత పాత పెట్రోల్ బంక్ నుండి బయలుదేరి నేతన్న విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    2
    తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 18న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన జెండా పండగ కార్యక్రమంలో భాగంగా జరుగుతుందని పార్టీ రాష్ట్ర పరిశీలకులు రంజిత్ కుమార్ తెలిపారు. ఆయన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు.

కవిత పాత పెట్రోల్ బంక్ నుండి బయలుదేరి నేతన్న విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు కొంతవరకు ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఇది వారికి ఒక సానుకూల పరిణామంగా నిలిచింది.
    1
    తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు కొంతవరకు ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఇది వారికి ఒక సానుకూల పరిణామంగా నిలిచింది.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Sircilla, Rajanna Sircilla•
    23 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2023 వరకు గత ప్రభుత్వ అవినీతి, దోపిడీని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం దాదాపు పదేళ్లపాటు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుని, ఆస్తులు పెంచుకుని తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు స్కామ్‌లకు, కమిషన్లకు బ్రాండ్ అంబాసిడర్ అని నరేందర్ రెడ్డి విమర్శించారు. హాస్టల్ నిధుల విషయంలో 2000 కోట్ల స్కామ్ జరిగిందని హరీష్ రావు అబద్ధాలు చెప్తున్నారని, వాస్తవానికి ఆ శాఖకు కేటాయించిన నిధులే 1100 కోట్లు (టెండర్ ప్రక్రియ ద్వారా 680 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 500 కోట్లు) అని స్పష్టం చేశారు. కింది స్థాయి నుండి, విద్యార్థి మరియు ఉద్యమ నాయకులుగా ఎదిగిన మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబుల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదన్నారు. గత 10 ఏళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా మెస్ ఛార్జీలు పెంచని ఘనత గత ప్రభుత్వానిదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మెస్, కాస్మెటిక్ ఛార్జీలను 40 శాతానికి పైగా పెంచామని తెలిపారు. కరీంనగర్‌లో అభివృద్ధి ఆగిపోలేదని, గతంలో జరిగిన అవినీతి పాలన మాత్రమే ఆగిపోయిందని గంగుల కమలాకర్‌కు కౌంటర్ ఇచ్చారు. అలాగే వందల కోట్ల అవినీతికి పాల్పడ్డ పుట్ట మధుకర్, నిజాయితీపరుడైన శ్రీధర్ బాబు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత గడీల పాలనలో కేవలం నలుగురి కోసమే ప్రభుత్వం నడిచిందని, హోంమంత్రి కూడా ముఖ్యమంత్రిని కలవలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు మంత్రులు పూర్తి స్వేచ్ఛతో, పట్టుతో శాఖలను నడిపిస్తూ ప్రజా పాలన అందిస్తున్నారని తెలిపారు. పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారని, ఇంకొక్కసారి నాయకుల మీద నోరు పారేసుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
    1
    తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2023 వరకు గత ప్రభుత్వ అవినీతి, దోపిడీని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం దాదాపు పదేళ్లపాటు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుని, ఆస్తులు పెంచుకుని తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని ఆరోపించారు.

మాజీ మంత్రి హరీష్ రావు స్కామ్‌లకు, కమిషన్లకు బ్రాండ్ అంబాసిడర్ అని నరేందర్ రెడ్డి విమర్శించారు. హాస్టల్ నిధుల విషయంలో 2000 కోట్ల స్కామ్ జరిగిందని హరీష్ రావు అబద్ధాలు చెప్తున్నారని, వాస్తవానికి ఆ శాఖకు కేటాయించిన నిధులే 1100 కోట్లు (టెండర్ ప్రక్రియ ద్వారా 680 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 500 కోట్లు) అని స్పష్టం చేశారు. కింది స్థాయి నుండి, విద్యార్థి మరియు ఉద్యమ నాయకులుగా ఎదిగిన మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబుల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదన్నారు. గత 10 ఏళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా మెస్ ఛార్జీలు పెంచని ఘనత గత ప్రభుత్వానిదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మెస్, కాస్మెటిక్ ఛార్జీలను 40 శాతానికి పైగా పెంచామని తెలిపారు.

కరీంనగర్‌లో అభివృద్ధి ఆగిపోలేదని, గతంలో జరిగిన అవినీతి పాలన మాత్రమే ఆగిపోయిందని గంగుల కమలాకర్‌కు కౌంటర్ ఇచ్చారు. అలాగే వందల కోట్ల అవినీతికి పాల్పడ్డ పుట్ట మధుకర్, నిజాయితీపరుడైన శ్రీధర్ బాబు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత గడీల పాలనలో కేవలం నలుగురి కోసమే ప్రభుత్వం నడిచిందని, హోంమంత్రి కూడా ముఖ్యమంత్రిని కలవలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు మంత్రులు పూర్తి స్వేచ్ఛతో, పట్టుతో శాఖలను నడిపిస్తూ ప్రజా పాలన అందిస్తున్నారని తెలిపారు. పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారని, ఇంకొక్కసారి నాయకుల మీద నోరు పారేసుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలోని తాళ్లకుంటలో నీరు లేకపోవడం వల్ల సుమారు 10 క్వింటాళ్ల చేపలు చనిపోయాయని స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లకుంటలో సరిపడా నీరు లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని వారు వాపోయారు. గత కొన్ని నెలలుగా ఈ సమస్యపై ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు విన్నవించినా వారు పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదనగా తెలిపారు. చేప పిల్లలను రూ.50,000 పెట్టి కొనుగోలు చేసి కుంటలో వదిలితే, అవి పెరిగి పెద్దయ్యాక విక్రయించే సమయంలో నీరు లేక చనిపోతుండటం తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. తోటపల్లి నుంచి వచ్చే డి8 ఉపకాలవ నుంచి తాళ్లకుంటలోకి నీటిని విడుదల చేసి, మిగిలిన చేపలను కాపాడాలని మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు. లేకపోతే తాము మరింత తీవ్రంగా నష్టపోతామని వారు స్పష్టం చేశారు. నీరు లేకపోవడంతో చేపలు చనిపోతున్నాయని, ఇది తమకు తీరని వేదన మిగిల్చిందని చాకలివానిపల్లె మత్స్యకారులు పునరుద్ఘాటించారు.
    2
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలోని తాళ్లకుంటలో నీరు లేకపోవడం వల్ల సుమారు 10 క్వింటాళ్ల చేపలు చనిపోయాయని స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తాళ్లకుంటలో సరిపడా నీరు లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని వారు వాపోయారు. గత కొన్ని నెలలుగా ఈ సమస్యపై ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు విన్నవించినా వారు పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదనగా తెలిపారు.

చేప పిల్లలను రూ.50,000 పెట్టి కొనుగోలు చేసి కుంటలో వదిలితే, అవి పెరిగి పెద్దయ్యాక విక్రయించే సమయంలో నీరు లేక చనిపోతుండటం తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. తోటపల్లి నుంచి వచ్చే డి8 ఉపకాలవ నుంచి తాళ్లకుంటలోకి నీటిని విడుదల చేసి, మిగిలిన చేపలను కాపాడాలని మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.

లేకపోతే తాము మరింత తీవ్రంగా నష్టపోతామని వారు స్పష్టం చేశారు. నీరు లేకపోవడంతో చేపలు చనిపోతున్నాయని, ఇది తమకు తీరని వేదన మిగిల్చిందని చాకలివానిపల్లె మత్స్యకారులు పునరుద్ఘాటించారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.