Shuru
Apke Nagar Ki App…
నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
Vijay Bhaskar
నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.1
- బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.1
- అనకాపల్లి జిల్లా: ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం రోలు గుంటలో.. మంచినీళ్లు ఇవ్వండి చేతులు జోడించి వేడుకుంటున్నాము.. దళితులు బిరుదులు పేద మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీ.. అనకాపల్లి జిల్లా రోలుగుంట కేంద్రంలో కాలనీలో దళితులు. గిరిజనులు. ఇతర పేద మహిళలు ఖాళీ బిందెలతో. మూడు వీధిలో రాలి నిర్వహించడం జరిగింది. వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలి CSR. DFM నిధుల నుండి వాటర్ ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలి. జిల్లా కలెక్టర్ గారు జోకులు చేసుకోవాలి రోలుగుంట మండలంలో రోలుగుంట తో పాటు నిండుగొండ కే నాయుడుపాలెం కొవ్వూరు.ఎన్ కొత్తూరు. అంట్లపాలెం రాజుపేట ముని పెళ్లి గొల్లపేట గ్రామాలను ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటికి 13000 మంది జనాభా రక్షత తాగునీరు అందించడానికి 2004 సంవత్సరంలో3 కోట్ల 50 లక్షల రూపాయలతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిధులతో జానకిరాంపురం గ్రామం వద్ద వరాహ నదిలో 3 భారీ బోరు బావులు తవ్వించారు. అక్కడినుండి రోలుగుంట లో లక్ష లీటర్లు సామర్థ్యం ఉన్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్లైన్ ద్వారా అందించారు. ఈ పథకం ప్రారంభించి కొద్ది రోజులు సక్రమంగా పనిచేసింది ఇప్పుడు 20 వేల మంది జనాభా పెరిగారు. వరాహ నది బోరుబావుడు చుట్టూ ఇసుక మాఫియా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. దీంతో గ్రామాలకు నీరు సరఫరా బంద్ అయిపోయింది అమృత ధార ( జల్జీవన్ మిషన్)2020-21 ద్వారా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు పనులు చేపట్టకపోవడంతో కోటమ్మ ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది తిరిగి కూటమి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన అని చెప్పారు. అధికారులు చెబుతున్నారు. నేటికీ ఫ్లోరిడ్ గ్రామంగా గుర్తించి 23 సంవత్సరాలు అవుతుంది. పాత పైపులు పగిలిపోయాయి. అధికారులు అప్పులు చేసుకొని రిపేర్ చేస్తున్నారు. స్కీం మాత్రం కేటాయించడం లేదు. గ్రామంలో సొంత బోర్లు తీసుకున్న నీరు రావడం లేదు. కనీసం ఫ్లోరైడ్ నీరు కూడా దొరకడం లేదు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రతి గ్రామానికి రక్షత మంచినీరు సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలో చెప్తున్నారు. కనీసం మండల కేంద్రంలో నీరు సరఫరా చేయకపోవడం చాలా అన్యాయం. 12 కుటుంబాల వారు సొంతంగా బోరు తీసుకోవడం జరిగింది. నీరు పడలేదు లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి నీరు రావడం లేదు దళిత గిరిజన ఇతర పేద వీధులన్నిటికీ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రోలుగుంట నిండుగొండ. కొవ్వూరు రెవిన్యూ పరిధిలో 12 నల్లరాయి క్వారీలు. ఉన్నాయి. పర్యావరణ అనుమతులు గ్రామసభలు పెట్టేటప్పుడు గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుతాం. మెడికల్ క్యాంప్ పెడతాం సభలో ప్రకటిస్తున్నారు. 20 సంవత్సరాల నుండి ఖాళీ కరాప నిర్వహిస్తున్నారు సి ఎస్ ఆర్ Csr. డిస్ట్రిక్ట్ పండు నిధులు రోలుగుంట మంచినీరికి కేటాయించకపోవడం చాలా అన్యాయం ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ జై గారితో ఫోన్లో మాట్లాడగా వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. నీరు లేదు. చెప్పారు. తక్షణమే దళిత గిరిజన కాలనీకి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు v నూకరత్నం v శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.3
- డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు1
- శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి..... సాలి హుండాం బౌద్ధారామం గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.1
- రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.2
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1