Shuru
Apke Nagar Ki App…
గుండెంగా పంచాయతీలో అధికార దుర్వినియోగం?.. వార్డు సభ్యులు గ్రామస్తులు నిరసన.. మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండలం గుండెంగా గ్రామపంచాయతీలో అధికార దుర్వినియోగం ఆరోపణలు కలకలం రేపాయి. సర్పంచ్ బోడ రాజీ కుమారుడు కిషన్ పంచాయతీ చెక్కులు, ఎజెండాలు, తీర్మానాలపై సంతకాలు చేస్తున్నారని గ్రామస్తులు, వార్డు సభ్యులు ఆరోపించారు. ఘటనను అడ్డుకుని ప్రశ్నించిన అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు ఫిర్యాదు చేసి, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ అధికారాలను కుమారుడు వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
M D Azizuddin

More news from తెలంగాణ and nearby areas
- ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- విస్తృత స్థాయిలో జనగామ నగరంలో వాటర్ ప్లాంట్ ల తనిఖీ... జిల్లా కేంద్రమైన జనగామ నగరంలో మున్సిపల్ అధికారులు విస్తృత స్థాయిలో పాల కేంద్రాలను, వాటర్ ప్లాంట్ లను మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు.బుధవారం ఉదయం ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈరోజు ఉదయం కొన్ని పాల సెంటర్లను,వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేసి వాటి శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్ నుండి వచ్చే రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.1
- తాత్కాలిక పారిశుధ్య సిబ్బందికి తొలి నెల జీతాల చెక్కులు.. కార్మికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా నియమించిన 8 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు తొలి నెల జీతాల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బుధవారం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.1
- అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ ఆత్మహత్యాయత్నం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేటలో అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ మంగళవారం సాయినాథ్ వెంచర్ సమీపంలో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మడికొండ పెట్రోలింగ్ సిబ్బంది కొండపల్లి సంపత్, ధారా గోవర్ధన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పి అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.1