logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బొమ్మెన చింతగూడ వద్ద రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి జూన్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బొమ్మెన చింతగూడ గ్రామాల మధ్య అర్థరాత్రి 9 గంటల సమయంలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది లక్షట్ పేట వైపు నుండి వస్తున్న లెవలింగ్ ట్రాక్టర్ జన్నారం వైపు నుండి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొట్టడంతో మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సునార్కరి పవన్ మగ్గిడి సురేష్ ఆటోలో 9 గంటలకు జన్నారం నుండి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లెవలింగ్ బ్లేడ్ ట్రాక్టర్ అకస్మాత్తుగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగావారు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చిన వెంటనే గాయపడిన వారిని లక్షేట్టిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు మగ్గిడి సురేష్ పరిస్థితి విషమంగా ఉందని మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆస్పత్రిలో వైద్యం జరుగుతున్న సమయంలో మగ్గిడి సురేష్ చనిపోయాడు ఈ ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలియ రావలసి ఉంది

1 hr ago
user_కండ్లే శ్రావణ్ కుమార్
కండ్లే శ్రావణ్ కుమార్
మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago

బొమ్మెన చింతగూడ వద్ద రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి జూన్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బొమ్మెన చింతగూడ గ్రామాల మధ్య అర్థరాత్రి 9 గంటల సమయంలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది లక్షట్ పేట వైపు నుండి వస్తున్న లెవలింగ్ ట్రాక్టర్ జన్నారం వైపు నుండి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొట్టడంతో మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సునార్కరి పవన్ మగ్గిడి సురేష్ ఆటోలో 9 గంటలకు జన్నారం నుండి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లెవలింగ్ బ్లేడ్ ట్రాక్టర్ అకస్మాత్తుగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగావారు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చిన వెంటనే గాయపడిన వారిని లక్షేట్టిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు మగ్గిడి సురేష్ పరిస్థితి విషమంగా ఉందని మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆస్పత్రిలో వైద్యం జరుగుతున్న సమయంలో మగ్గిడి సురేష్ చనిపోయాడు ఈ ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలియ రావలసి ఉంది

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కట్ట లింగాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యుడు యెల్ల శ్రీనివాస్ గంగపుత్ర రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించడంతో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపానాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల దుబాయ్ నుండి సెలవుపై ఇండియాకు వచ్చిన శ్రీనివాస్ ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబంలోనే కాకుండా, గల్ఫ్‌లోని తోటి కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీనివాస్ ఆకస్మిక మరణం నేపథ్యంలో, దుబాయ్‌లో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ సభ్యులందరూ 5 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల్లో కష్టపడి పనిచేస్తూ స్వదేశానికి సెలవుపై వచ్చిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాస్ ప్రమాదానికి గురై మరణించడం అత్యంత బాధాకరమన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి నుండి యెల్ల శ్రీనివాస్ కుటుంబానికి తక్షణమే ₹5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం) వర్తింపజేసి, వారి కుటుంబానికి ఆసరాగా నిలవాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని మరియు స్థానిక ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేశారు. ఈ నివాళుల కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు తోకల శంకర్ గంగపుత్ర, ఉపాధ్యక్షులు బింగి రాజు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ గంగా నర్సన్నతో పాటు పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ అశ్రునయనాలతో నివాళులర్పించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కట్ట లింగాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యుడు యెల్ల శ్రీనివాస్ గంగపుత్ర రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించడంతో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపానాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల దుబాయ్ నుండి సెలవుపై ఇండియాకు వచ్చిన శ్రీనివాస్ ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబంలోనే కాకుండా, గల్ఫ్‌లోని తోటి కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

శ్రీనివాస్ ఆకస్మిక మరణం నేపథ్యంలో, దుబాయ్‌లో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ సభ్యులందరూ 5 నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల్లో కష్టపడి పనిచేస్తూ స్వదేశానికి సెలవుపై వచ్చిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాస్ ప్రమాదానికి గురై మరణించడం అత్యంత బాధాకరమన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి నుండి యెల్ల శ్రీనివాస్ కుటుంబానికి తక్షణమే ₹5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం) వర్తింపజేసి, వారి కుటుంబానికి ఆసరాగా నిలవాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని మరియు స్థానిక ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేశారు.

ఈ నివాళుల కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు తోకల శంకర్ గంగపుత్ర, ఉపాధ్యక్షులు బింగి రాజు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ గంగా నర్సన్నతో పాటు పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ అశ్రునయనాలతో నివాళులర్పించారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Yoga instructor మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • ఏఐటీయూసీ దేశంలోని అన్ని రంగాల కార్మికులకు అండగా నిలుస్తూ, వారి శ్రేయస్సు, వేతనాల పెంపు, హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్. బోస్, కలవేన శంకర్, ఎస్. బాల రాజు, పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఏఐటీయూసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమని, కార్మిక, ఉద్యోగ వర్గాలను ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొందని పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మిక వర్గానికి ఆశాజ్యోతిగా నిలిచి, శ్రమకు తగిన ఫలితం, పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, కనీస వేతనాల కోసం నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. అనేక చట్టాలను తీసుకురావడంలో, కార్మికుల హక్కులను, చట్టాలను కాపాడటంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. అయితే, బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, చివరికి సమ్మె చేసే హక్కును కూడా కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఉందని వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేసి, వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులకు ప్రధాని మోడీ తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, నాయకత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్, ఎస్. బాల రాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహాసభల ఫ్యాట్రన్ కలవేన శంకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్, ఎం.డి. ముక్రం, సుతారి రాములు, అజ్ఞ వేణు, కడారి రాములు, ఆహ్వాన సంఘం నాయకులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, పిట్టల సమ్మయ్య, కాశెట్టి లక్ష్మయ్య, వెల్దండి దామోదర్, అల్లేపు రాజు, నిఖిల్, కేంసారం నర్సయ్య, కొమురయ్య, కవిత, స్వరూప, రాధ, మమత, భీరయ్య, ఎం. తిరుపతి, గందే కొమురయ్య, గంగుల ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు.
    3
    ఏఐటీయూసీ దేశంలోని అన్ని రంగాల కార్మికులకు అండగా నిలుస్తూ, వారి శ్రేయస్సు, వేతనాల పెంపు, హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్. బోస్, కలవేన శంకర్, ఎస్. బాల రాజు, పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఏఐటీయూసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమని, కార్మిక, ఉద్యోగ వర్గాలను ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొందని పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మిక వర్గానికి ఆశాజ్యోతిగా నిలిచి, శ్రమకు తగిన ఫలితం, పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, కనీస వేతనాల కోసం నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. అనేక చట్టాలను తీసుకురావడంలో, కార్మికుల హక్కులను, చట్టాలను కాపాడటంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. అయితే, బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, చివరికి సమ్మె చేసే హక్కును కూడా కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఉందని వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేసి, వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులకు ప్రధాని మోడీ తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, నాయకత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్, ఎస్. బాల రాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహాసభల ఫ్యాట్రన్ కలవేన శంకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్, ఎం.డి. ముక్రం, సుతారి రాములు, అజ్ఞ వేణు, కడారి రాములు, ఆహ్వాన సంఘం నాయకులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, పిట్టల సమ్మయ్య, కాశెట్టి లక్ష్మయ్య, వెల్దండి దామోదర్, అల్లేపు రాజు, నిఖిల్, కేంసారం నర్సయ్య, కొమురయ్య, కవిత, స్వరూప, రాధ, మమత, భీరయ్య, ఎం. తిరుపతి, గందే కొమురయ్య, గంగుల ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    16 hrs ago
  • తెలంగాణలోని బాగురా పట్టణంలోని రైల్వే వంతెన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల సురేష్ కుమార్ అనే యువకుడు మరణించగా, అతని మామయ్య ఆశారాం తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వేగంగా వాహనం నడపడం వల్ల కలిగే నిర్లక్ష్యం, మరియు పరిపాలనా యంత్రాంగం యొక్క ఉదాసీనతను సూచిస్తుంది. ఒక థార్ కారు వేగంగా వచ్చి వెనుక నుండి బైక్‌ను ఢీకొనడంతో, బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు వంతెనపై నుండి కిందపడ్డారు. ఈ ప్రమాదం రహదారి భద్రతకు సంబంధించిన లోపాలను స్పష్టం చేస్తుంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు మరియు పారిపోయిన వాహనం కోసం గాలిస్తున్నారు. అయితే, ఇది కేవలం తదుపరి అధికారిక చర్య మాత్రమే అని పేర్కొన్నారు. వంతెన వంటి ఇరుకైన ప్రదేశాలలో వేగ నియంత్రణకు ఎటువంటి పటిష్టమైన ఏర్పాట్లు లేవు. స్పీడ్ బ్రేకర్‌లు, హెచ్చరిక బోర్డులు మరియు సాధారణ పెట్రోలింగ్ వంటి ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో రహదారి భద్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ఉంది, మరియు హెల్మెట్ వాడకం, వేగ పరిమితిని పాటించడం మరియు వాహనదారుల బాధ్యతపై ఎటువంటి పటిష్టమైన ప్రచారం జరగడం లేదు. ఈ ప్రమాదం తరువాత, ఆ ప్రాంతంలో విషాదం మరియు ఆగ్రహం రెండూ వ్యక్తమయ్యాయి. ప్రజలు కేవలం బాధపడటమే కాకుండా, కోపంగా ఉన్నారని గుమిగూడిన ప్రజలు సూచిస్తున్నారు. ఈ ఆగ్రహం పరిపాలనను పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రేరేపించాలి. రహదారి భద్రత అనేది కేవలం పరిపాలన బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క సామూహిక బాధ్యత అని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. నియమాలు పాటించకపోతే మరియు పరిపాలన పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే, ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని నివేదిక ముగించింది.
    1
    తెలంగాణలోని బాగురా పట్టణంలోని రైల్వే వంతెన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల సురేష్ కుమార్ అనే యువకుడు మరణించగా, అతని మామయ్య ఆశారాం తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వేగంగా వాహనం నడపడం వల్ల కలిగే నిర్లక్ష్యం, మరియు పరిపాలనా యంత్రాంగం యొక్క ఉదాసీనతను సూచిస్తుంది. ఒక థార్ కారు వేగంగా వచ్చి వెనుక నుండి బైక్‌ను ఢీకొనడంతో, బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు వంతెనపై నుండి కిందపడ్డారు.

ఈ ప్రమాదం రహదారి భద్రతకు సంబంధించిన లోపాలను స్పష్టం చేస్తుంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు మరియు పారిపోయిన వాహనం కోసం గాలిస్తున్నారు. అయితే, ఇది కేవలం తదుపరి అధికారిక చర్య మాత్రమే అని పేర్కొన్నారు. వంతెన వంటి ఇరుకైన ప్రదేశాలలో వేగ నియంత్రణకు ఎటువంటి పటిష్టమైన ఏర్పాట్లు లేవు. స్పీడ్ బ్రేకర్‌లు, హెచ్చరిక బోర్డులు మరియు సాధారణ పెట్రోలింగ్ వంటి ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో రహదారి భద్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ఉంది, మరియు హెల్మెట్ వాడకం, వేగ పరిమితిని పాటించడం మరియు వాహనదారుల బాధ్యతపై ఎటువంటి పటిష్టమైన ప్రచారం జరగడం లేదు.

ఈ ప్రమాదం తరువాత, ఆ ప్రాంతంలో విషాదం మరియు ఆగ్రహం రెండూ వ్యక్తమయ్యాయి. ప్రజలు కేవలం బాధపడటమే కాకుండా, కోపంగా ఉన్నారని గుమిగూడిన ప్రజలు సూచిస్తున్నారు. ఈ ఆగ్రహం పరిపాలనను పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రేరేపించాలి. రహదారి భద్రత అనేది కేవలం పరిపాలన బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క సామూహిక బాధ్యత అని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. నియమాలు పాటించకపోతే మరియు పరిపాలన పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే, ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని నివేదిక ముగించింది.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    17 hrs ago
  • కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వావిలాలపల్లి ప్రాంతంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించగా వారి వద్ద 100 గ్రాముల గంజాయి లభ్యమైంది. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకొని సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడి నుండి తీసుకువచ్చారు, ఎవరికి విక్రయించేందుకు తీసుకువచ్చారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ పరిసరాలలో మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
    1
    కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వావిలాలపల్లి ప్రాంతంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించగా వారి వద్ద 100 గ్రాముల గంజాయి లభ్యమైంది. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకొని సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడి నుండి తీసుకువచ్చారు, ఎవరికి విక్రయించేందుకు తీసుకువచ్చారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ పరిసరాలలో మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం అభయ యాప్ (MY AUTO IS SAFE) ఫేజ్-3 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే 100 ఆటోలకు అభయ క్యూఆర్ కోడ్‌లను అనుసంధానం చేసి, ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై మరింత నమ్మకం కల్పించడంతో పాటు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఆటోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తాము సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం కలిగేలా డ్రైవర్లు వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. అభయ యాప్ ద్వారా ఆటోలకు అనుసంధానించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేస్తే డ్రైవర్ ఫోటో, ఫోన్ నంబర్, వాహన వివరాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాల్ లేదా ఫిర్యాదు చేస్తే వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుందని, తక్షణమే సమీప పోలీసులు స్పందించి రక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. మహిళలు, ఇతర ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలని ఎస్పీ కోరారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అసభ్య ప్రవర్తన, హిట్ అండ్ రన్ ఘటనలు లేదా ఆటోలో మరిచిపోయిన వస్తువులపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఎస్పీ సూచించారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభయ యాప్‌తో అనుసంధానం చేసి, డ్రైవర్లకు ₹50తో యాక్సిడెంటల్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో ఏర్పాట్లు చేసి ప్రమాద బీమా పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ బీమాను ప్రతి సంవత్సరం ₹50తో పునరుద్ధరించుకోవాలని, దీని ద్వారా ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆర్.ఐ సురేష్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీనివాస్, అభిచరణ్ మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
    4
    ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం అభయ యాప్ (MY AUTO IS SAFE) ఫేజ్-3 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే 100 ఆటోలకు అభయ క్యూఆర్ కోడ్‌లను అనుసంధానం చేసి, ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై మరింత నమ్మకం కల్పించడంతో పాటు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

ఆటోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తాము సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం కలిగేలా డ్రైవర్లు వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. అభయ యాప్ ద్వారా ఆటోలకు అనుసంధానించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేస్తే డ్రైవర్ ఫోటో, ఫోన్ నంబర్, వాహన వివరాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాల్ లేదా ఫిర్యాదు చేస్తే వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుందని, తక్షణమే సమీప పోలీసులు స్పందించి రక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. మహిళలు, ఇతర ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలని ఎస్పీ కోరారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అసభ్య ప్రవర్తన, హిట్ అండ్ రన్ ఘటనలు లేదా ఆటోలో మరిచిపోయిన వస్తువులపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఎస్పీ సూచించారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభయ యాప్‌తో అనుసంధానం చేసి, డ్రైవర్లకు ₹50తో యాక్సిడెంటల్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో ఏర్పాట్లు చేసి ప్రమాద బీమా పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ బీమాను ప్రతి సంవత్సరం ₹50తో పునరుద్ధరించుకోవాలని, దీని ద్వారా ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆర్.ఐ సురేష్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీనివాస్, అభిచరణ్ మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గురువారం కామారెడ్డిలో మాట్లాడుతూ, 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న తనపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన తనపై నిందలు వేయడం బాధాకరమని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలో తనకంటే జానారెడ్డి కూడా జూనియర్ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విమర్శలు చేస్తున్న వారికి హెచ్చరిక చేస్తూ, "ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే తిరిగి పడుతుంది" అని షబ్బీర్ అలీ అన్నారు.
    1
    కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గురువారం కామారెడ్డిలో మాట్లాడుతూ, 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న తనపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన తనపై నిందలు వేయడం బాధాకరమని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలో తనకంటే జానారెడ్డి కూడా జూనియర్ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విమర్శలు చేస్తున్న వారికి హెచ్చరిక చేస్తూ, "ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే తిరిగి పడుతుంది" అని షబ్బీర్ అలీ అన్నారు.
    user_Dokidi Thirupathi
    Dokidi Thirupathi
    Farmer వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.
    2
    ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    16 hrs ago
  • కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్వింటాలుకు 8 కిలోల తరుగు తీస్తూ రైతులను వంచిస్తున్నారని, అధికార పక్షం అండతో ధర్మపురిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆయన ఆరోపించారు. రూ.2000 కోట్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్న కొప్పుల ఈశ్వర్, చేతకాని మాటలు కట్టిపెట్టి, దమ్ముంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
    1
    కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్వింటాలుకు 8 కిలోల తరుగు తీస్తూ రైతులను వంచిస్తున్నారని, అధికార పక్షం అండతో ధర్మపురిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆయన ఆరోపించారు.

రూ.2000 కోట్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్న కొప్పుల ఈశ్వర్, చేతకాని మాటలు కట్టిపెట్టి, దమ్ముంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగూడా గ్రామంలోని కళావతి ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్‌ను జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో దుకాణంలోని ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, స్టాక్ రిజిస్టర్‌లు, రైతులకు సరఫరా విధానం వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, ఎలాంటి అక్రమ నిల్వలు లేదా అధిక ధరలకు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని దుకాణ నిర్వాహకులకు ఆమె సూచించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని, సరిపడా నిల్వలు ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. స్టాక్ వివరాల నిర్వహణలో నిర్లక్ష్యంపై యజమానికి హెచ్చరిక జారీ చేయబడింది.
    2
    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగూడా గ్రామంలోని కళావతి ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్‌ను జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో దుకాణంలోని ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, స్టాక్ రిజిస్టర్‌లు, రైతులకు సరఫరా విధానం వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు.

రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, ఎలాంటి అక్రమ నిల్వలు లేదా అధిక ధరలకు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని దుకాణ నిర్వాహకులకు ఆమె సూచించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని, సరిపడా నిల్వలు ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా ఆమె పేర్కొన్నారు.

జిల్లాలోని ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. స్టాక్ వివరాల నిర్వహణలో నిర్లక్ష్యంపై యజమానికి హెచ్చరిక జారీ చేయబడింది.
    user_Shiva
    Shiva
    Accountant ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.