logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.

15 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
15 hrs ago

ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు

జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్వింటాలుకు 8 కిలోల తరుగు తీస్తూ రైతులను వంచిస్తున్నారని, అధికార పక్షం అండతో ధర్మపురిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆయన ఆరోపించారు. రూ.2000 కోట్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్న కొప్పుల ఈశ్వర్, చేతకాని మాటలు కట్టిపెట్టి, దమ్ముంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
    1
    కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్వింటాలుకు 8 కిలోల తరుగు తీస్తూ రైతులను వంచిస్తున్నారని, అధికార పక్షం అండతో ధర్మపురిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆయన ఆరోపించారు.

రూ.2000 కోట్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్న కొప్పుల ఈశ్వర్, చేతకాని మాటలు కట్టిపెట్టి, దమ్ముంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
  • జగిత్యాల జిల్లా ధర్మపురిలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో కోతుల కొట్లాట ఒక మహిళ ప్రాణం తీసింది. రెండంతస్తుల భవనంపై కోతులు హల్‌చల్ చేస్తుండగా, భవనం మెట్లపై ఉంచిన సిమెంటు ఇటుక కింద కూర్చున్న కొనపర్తి పద్మ అనే మహిళ తలపై పడింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారని మృతురాలి భర్త సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాంతంలో కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    జగిత్యాల జిల్లా ధర్మపురిలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో కోతుల కొట్లాట ఒక మహిళ ప్రాణం తీసింది. రెండంతస్తుల భవనంపై కోతులు హల్‌చల్ చేస్తుండగా, భవనం మెట్లపై ఉంచిన సిమెంటు ఇటుక కింద కూర్చున్న కొనపర్తి పద్మ అనే మహిళ తలపై పడింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారని మృతురాలి భర్త సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాంతంలో కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    12 hrs ago
  • సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా అప్పులు చేసి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపిందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పన్నుల భారం పెంచుతూ సామాన్య వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లేలా విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును సైతం రాజకీయ ప్రయోజనాల కోసం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం “వికసిత్ భారత్” పేరుతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, నిరుద్యోగం, ధరల భారం, రైతుల సమస్యలు వంటి వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నట్లు చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా చాడ వెంకటరెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
    1
    సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా అప్పులు చేసి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపిందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పన్నుల భారం పెంచుతూ సామాన్య వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లేలా విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును సైతం రాజకీయ ప్రయోజనాల కోసం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం “వికసిత్ భారత్” పేరుతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, నిరుద్యోగం, ధరల భారం, రైతుల సమస్యలు వంటి వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నట్లు చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా చాడ వెంకటరెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గప్‌చుప్‌లు విక్రయించిన మోహన లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. అతని గప్‌చుప్‌లు తిని 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో మోహన్‌లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గప్‌చుప్‌ల తయారీకి అతను ఉపయోగించిన వివిధ రకాల ఆహార పదార్థాల ఏడు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఈ సంఘటన జరిగిన చాలా ఆలస్యంగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన చిన్నారులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గప్‌చుప్‌లు విక్రయించిన మోహన లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. అతని గప్‌చుప్‌లు తిని 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో మోహన్‌లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గప్‌చుప్‌ల తయారీకి అతను ఉపయోగించిన వివిధ రకాల ఆహార పదార్థాల ఏడు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

అయితే, ఈ సంఘటన జరిగిన చాలా ఆలస్యంగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన చిన్నారులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 hrs ago
  • తమ డిమాండ్ల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు గురువారం అడ్డుకుని అరెస్ట్ చేశారు. గన్‌పార్క్ వద్ద నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. నిరసనకు దిగిన జర్నలిస్టులను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జర్నలిస్టులు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. గన్‌పార్క్ వద్ద జర్నలిస్టుల అరెస్టుతో సచివాలయం ముట్టడి కార్యక్రమం భగ్నమైంది.
    1
    తమ డిమాండ్ల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు గురువారం అడ్డుకుని అరెస్ట్ చేశారు. గన్‌పార్క్ వద్ద నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. నిరసనకు దిగిన జర్నలిస్టులను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జర్నలిస్టులు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. గన్‌పార్క్ వద్ద జర్నలిస్టుల అరెస్టుతో సచివాలయం ముట్టడి కార్యక్రమం భగ్నమైంది.
    user_Dokidi Thirupathi
    Dokidi Thirupathi
    Farmer వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మరియు కలెక్టర్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు తెలిపారు. అనంతరం, నాటిన మొక్కలను పరిశీలించిన మంత్రులు, వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రవి ప్రసాద్, డీఆర్‌డీఓ రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ సహా పలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మరియు కలెక్టర్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు తెలిపారు.

అనంతరం, నాటిన మొక్కలను పరిశీలించిన మంత్రులు, వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రవి ప్రసాద్, డీఆర్‌డీఓ రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ సహా పలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.
    2
    ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    15 hrs ago
  • తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోసం పోరాటం చేసేవారిపై కేసులు పెడతారని, మరి తెలంగాణ ప్రజలను అగౌరవపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో పర్యటించిన కవిత, నగరంలోని కోతిరాంపూర్, శాతవాహన యూనివర్సిటీ వద్ద టీఆర్ఎస్ జెండా పండుగలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆనవాళ్లను పక్కన పెడుతున్నారని కవిత ఆరోపించారు. అందుకే పక్క రాష్ట్రం నుంచి మళ్ళీ పెత్తనం కోసం వస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతూ తమ నాయకుల విగ్రహాలను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా తమ హక్కుల కోసం పోరాడటం ఆవేదన కలిగిస్తోందని కవిత అన్నారు. ఉద్యమకారులకు అన్ని చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు చలనం లేదని ఆమె పేర్కొన్నారు. తాము పోరాటం చేస్తే కమిటీలు వేసి, ఆ తర్వాత మర్చిపోతారని, ఉద్యమకారులను గుర్తించటానికి కూడా ఈ ప్రభుత్వం 30 నెలల కాలం గడిపేసిందని విమర్శించారు. 12 వందల మంది అమరులైతే పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఆడిపోసుకుందని, కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. తమ రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయుల చిహ్నం రాచరిక పోకడ అంటూ తీసేశాడని ఆరోపించారు. చార్మినార్, పూర్ణకుంభం కూడా తీసేసే ప్రయత్నం చేస్తే వ్యతిరేకత రావటంతో ఆగిపోయారని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ ఇలాగే చేశారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారని, ఉద్యమ తల్లి విగ్రహానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న సాకుతో ఈ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని తెచ్చిందని విమర్శించారు. మొన్నటి జూన్ 2 లోపు విగ్రహాన్ని పెట్టాలని తెలంగాణ రక్షణ సేన తరఫున ధర్నాలు చేసినా పట్టించుకోలేదన్నారు. జయశంకర్ సార్ విగ్రహాన్ని అప్పటి ప్రభుత్వం పెట్టలేదని, ఈ ప్రభుత్వం కూడా పెట్టడం లేదని కవిత ఆరోపించారు. పసికూన లాంటి తమ కొత్త పార్టీని నడిపేందుకు ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె కోరారు.
    3
    తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోసం పోరాటం చేసేవారిపై కేసులు పెడతారని, మరి తెలంగాణ ప్రజలను అగౌరవపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

కరీంనగర్‌లో పర్యటించిన కవిత, నగరంలోని కోతిరాంపూర్, శాతవాహన యూనివర్సిటీ వద్ద టీఆర్ఎస్ జెండా పండుగలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆనవాళ్లను పక్కన పెడుతున్నారని కవిత ఆరోపించారు. అందుకే పక్క రాష్ట్రం నుంచి మళ్ళీ పెత్తనం కోసం వస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతూ తమ నాయకుల విగ్రహాలను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా తమ హక్కుల కోసం పోరాడటం ఆవేదన కలిగిస్తోందని కవిత అన్నారు. ఉద్యమకారులకు అన్ని చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు చలనం లేదని ఆమె పేర్కొన్నారు. తాము పోరాటం చేస్తే కమిటీలు వేసి, ఆ తర్వాత మర్చిపోతారని, ఉద్యమకారులను గుర్తించటానికి కూడా ఈ ప్రభుత్వం 30 నెలల కాలం గడిపేసిందని విమర్శించారు. 12 వందల మంది అమరులైతే పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఆడిపోసుకుందని, కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. తమ రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయుల చిహ్నం రాచరిక పోకడ అంటూ తీసేశాడని ఆరోపించారు. చార్మినార్, పూర్ణకుంభం కూడా తీసేసే ప్రయత్నం చేస్తే వ్యతిరేకత రావటంతో ఆగిపోయారని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ ఇలాగే చేశారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారని, ఉద్యమ తల్లి విగ్రహానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న సాకుతో ఈ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని తెచ్చిందని విమర్శించారు. మొన్నటి జూన్ 2 లోపు విగ్రహాన్ని పెట్టాలని తెలంగాణ రక్షణ సేన తరఫున ధర్నాలు చేసినా పట్టించుకోలేదన్నారు. జయశంకర్ సార్ విగ్రహాన్ని అప్పటి ప్రభుత్వం పెట్టలేదని, ఈ ప్రభుత్వం కూడా పెట్టడం లేదని కవిత ఆరోపించారు. పసికూన లాంటి తమ కొత్త పార్టీని నడిపేందుకు ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌కు చెందిన పలువురు చిన్నారులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఈ ఘటనతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు పరామర్శించారు. అలాగే, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.
    1
    తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌కు చెందిన పలువురు చిన్నారులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఈ ఘటనతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చిన్నారులు చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు పరామర్శించారు. అలాగే, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.