రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గప్‌చుప్‌లు విక్రయించిన మోహన లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. అతని గప్‌చుప్‌లు తిని 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో మోహన్‌లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గప్‌చుప్‌ల తయారీకి అతను ఉపయోగించిన వివిధ రకాల ఆహార పదార్థాల ఏడు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఈ సంఘటన జరిగిన చాలా ఆలస్యంగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన చిన్నారులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గప్‌చుప్‌లు విక్రయించిన మోహన లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. అతని గప్‌చుప్‌లు తిని 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో మోహన్‌లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
గప్‌చుప్‌ల తయారీకి అతను ఉపయోగించిన వివిధ రకాల ఆహార పదార్థాల ఏడు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఈ సంఘటన జరిగిన చాలా ఆలస్యంగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో
ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన చిన్నారులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలను సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో మంచి వర్షాలు కురవాలని, పంటలు, పశువులు, గ్రామస్తులు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.1
- సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా అప్పులు చేసి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపిందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పన్నుల భారం పెంచుతూ సామాన్య వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లేలా విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును సైతం రాజకీయ ప్రయోజనాల కోసం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం “వికసిత్ భారత్” పేరుతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, నిరుద్యోగం, ధరల భారం, రైతుల సమస్యలు వంటి వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నట్లు చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా చాడ వెంకటరెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా అన్నారు.1
- ఏఐటీయూసీ దేశంలోని అన్ని రంగాల కార్మికులకు అండగా నిలుస్తూ, వారి శ్రేయస్సు, వేతనాల పెంపు, హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్. బోస్, కలవేన శంకర్, ఎస్. బాల రాజు, పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఏఐటీయూసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమని, కార్మిక, ఉద్యోగ వర్గాలను ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొందని పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మిక వర్గానికి ఆశాజ్యోతిగా నిలిచి, శ్రమకు తగిన ఫలితం, పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, కనీస వేతనాల కోసం నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. అనేక చట్టాలను తీసుకురావడంలో, కార్మికుల హక్కులను, చట్టాలను కాపాడటంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. అయితే, బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, చివరికి సమ్మె చేసే హక్కును కూడా కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఉందని వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేసి, వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులకు ప్రధాని మోడీ తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, నాయకత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్, ఎస్. బాల రాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహాసభల ఫ్యాట్రన్ కలవేన శంకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్, ఎం.డి. ముక్రం, సుతారి రాములు, అజ్ఞ వేణు, కడారి రాములు, ఆహ్వాన సంఘం నాయకులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, పిట్టల సమ్మయ్య, కాశెట్టి లక్ష్మయ్య, వెల్దండి దామోదర్, అల్లేపు రాజు, నిఖిల్, కేంసారం నర్సయ్య, కొమురయ్య, కవిత, స్వరూప, రాధ, మమత, భీరయ్య, ఎం. తిరుపతి, గందే కొమురయ్య, గంగుల ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు.3
- కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్వింటాలుకు 8 కిలోల తరుగు తీస్తూ రైతులను వంచిస్తున్నారని, అధికార పక్షం అండతో ధర్మపురిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆయన ఆరోపించారు. రూ.2000 కోట్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్న కొప్పుల ఈశ్వర్, చేతకాని మాటలు కట్టిపెట్టి, దమ్ముంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.1
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు వచ్చి తన అన్నపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ సిరిసిల్లకు వీకెండ్ టూర్‌లా వచ్చిపోతాడని కవిత విమర్శించారు. జెండా పండుగలో భాగంగా సిరిసిల్లలో జెండా ఆవిష్కరించిన ఆమె, నేతన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కవిత, కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు డిస్కం గురించి కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని, మాట్లాడేంత తీరిక ఆయనకు లేదా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించిన ఆమె, కేటీఆర్ రేవంత్ రెడ్డిపై మాట్లాడడం మానేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ నాయకులు పేగు బంధం తెంచుకున్నారని, అందుకే తెలంగాణ రక్షణ సేన వచ్చిందని తెలిపారు. అక్రమ ఇసుక దందా కారణంగా నేరెళ్లలో ఎనిమిది మంది బీసీ, ఎస్సీలను తీవ్రంగా కొట్టారని గుర్తు చేసిన కవిత, కేంద్ర ఎస్సీ ఎస్టీ సంఘం దగ్గర పెండింగ్‌లో ఉన్న నేరెళ్ల బాధితుల కేసు స్థితిని బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల అన్నదమ్ములకు అండగా ఉంటామని, వారికి న్యాయం ఎలా జరగదో తాను చూస్తానని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో లక్షా ఎనిమిది వేల ఎకరాలకు రావాల్సిన నీరు కేవలం 480 ఎకరాలకు మాత్రమే వస్తుందని కవిత ఆరోపించారు. 'వర్కర్ టు ఓనర్' పథకం అమలు చేయకపోవడంతో ఆ షెడ్లు ధాన్యం నిలువ చేయడానికి వాడుతున్నారని తెలిపారు. సిరిసిల్లలో నేతన్నల పవర్లూమ్‌లు ఉన్నప్పటికీ, యార్న్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పిల్లలను చదివించడానికి ప్రైవేట్ స్కూలు ఫీజులు కట్టే పరిస్థితి లేదని, ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేవని, ప్రభుత్వ ఆసుపత్రిలో సూది ఉంటే దూది ఉండటం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతుందని ఎత్తిచూపారు. తెలంగాణలో ప్రజల బతుకులు ఏం చేస్తే మారుతాయో ఆలోచించాలని, ఆడవాళ్ళ గురించి ఆలోచించే పార్టీ ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేనను స్థాపించుకున్నామని కవిత వివరించారు. ఉచిత విద్య, వైద్యమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామని, నిరుద్యోగ యువతకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.4
- మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గురువారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేటలో వన యోజన పార్కును ఘనంగా ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా వారు డీఎఫ్ఓ జోజి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజినిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, అక్కన్నపేట పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు, రాష్ట్రంలోని మొత్తం 11 పార్కులకు రూ. 22 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జూలైలో 765 డీజీ రోడ్డులో మొదటి దశ కింద 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ, భావితరాల కోసం జిల్లాకు కేటాయించిన 31 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని, మైనింగ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో చెట్లను నాటాలని సూచించారు. అంతకుముందు, వారు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.1
- తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌కు చెందిన పలువురు చిన్నారులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఈ ఘటనతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు పరామర్శించారు. అలాగే, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో కలిసి పరామర్శించారు. గత సోమవారం సాయంత్రం తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో సుమారు 20 మంది చిన్నారులు గప్ చుప్‌లు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేటీఆర్ కలిసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారని, వారికి ఏమీ కాదని ధైర్యం చెప్పారు. వైద్యం విషయంలో ఏదైనా అవసరం ఉంటే తనకు చెప్పాలని చిన్నారుల తల్లిదండ్రులతో అన్నారు. అక్కడే ఉన్న వైద్యులతో మాట్లాడుతూ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. అవసరమైతే కరీంనగర్‌కు తరలించి మంచి వైద్యం అందేలా చూడాలని కూడా సూచించారు.1
- ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.2