Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో కోతుల కొట్లాట ఒక మహిళ ప్రాణం తీసింది. రెండంతస్తుల భవనంపై కోతులు హల్‌చల్ చేస్తుండగా, భవనం మెట్లపై ఉంచిన సిమెంటు ఇటుక కింద కూర్చున్న కొనపర్తి పద్మ అనే మహిళ తలపై పడింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారని మృతురాలి భర్త సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాంతంలో కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
K.V.REDDY
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో కోతుల కొట్లాట ఒక మహిళ ప్రాణం తీసింది. రెండంతస్తుల భవనంపై కోతులు హల్‌చల్ చేస్తుండగా, భవనం మెట్లపై ఉంచిన సిమెంటు ఇటుక కింద కూర్చున్న కొనపర్తి పద్మ అనే మహిళ తలపై పడింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారని మృతురాలి భర్త సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాంతంలో కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- తమ డిమాండ్ల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు గురువారం అడ్డుకుని అరెస్ట్ చేశారు. గన్‌పార్క్ వద్ద నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. నిరసనకు దిగిన జర్నలిస్టులను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జర్నలిస్టులు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. గన్‌పార్క్ వద్ద జర్నలిస్టుల అరెస్టుతో సచివాలయం ముట్టడి కార్యక్రమం భగ్నమైంది.1
- సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా అప్పులు చేసి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపిందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పన్నుల భారం పెంచుతూ సామాన్య వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లేలా విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును సైతం రాజకీయ ప్రయోజనాల కోసం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం “వికసిత్ భారత్” పేరుతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, నిరుద్యోగం, ధరల భారం, రైతుల సమస్యలు వంటి వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నట్లు చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా చాడ వెంకటరెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా అన్నారు.1
- ఏఐటీయూసీ దేశంలోని అన్ని రంగాల కార్మికులకు అండగా నిలుస్తూ, వారి శ్రేయస్సు, వేతనాల పెంపు, హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్. బోస్, కలవేన శంకర్, ఎస్. బాల రాజు, పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఏఐటీయూసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమని, కార్మిక, ఉద్యోగ వర్గాలను ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొందని పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మిక వర్గానికి ఆశాజ్యోతిగా నిలిచి, శ్రమకు తగిన ఫలితం, పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, కనీస వేతనాల కోసం నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. అనేక చట్టాలను తీసుకురావడంలో, కార్మికుల హక్కులను, చట్టాలను కాపాడటంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. అయితే, బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, చివరికి సమ్మె చేసే హక్కును కూడా కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఉందని వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేసి, వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులకు ప్రధాని మోడీ తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, నాయకత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్, ఎస్. బాల రాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహాసభల ఫ్యాట్రన్ కలవేన శంకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్, ఎం.డి. ముక్రం, సుతారి రాములు, అజ్ఞ వేణు, కడారి రాములు, ఆహ్వాన సంఘం నాయకులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, పిట్టల సమ్మయ్య, కాశెట్టి లక్ష్మయ్య, వెల్దండి దామోదర్, అల్లేపు రాజు, నిఖిల్, కేంసారం నర్సయ్య, కొమురయ్య, కవిత, స్వరూప, రాధ, మమత, భీరయ్య, ఎం. తిరుపతి, గందే కొమురయ్య, గంగుల ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు.3
- కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్వింటాలుకు 8 కిలోల తరుగు తీస్తూ రైతులను వంచిస్తున్నారని, అధికార పక్షం అండతో ధర్మపురిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆయన ఆరోపించారు. రూ.2000 కోట్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్న కొప్పుల ఈశ్వర్, చేతకాని మాటలు కట్టిపెట్టి, దమ్ముంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గప్‌చుప్‌లు విక్రయించిన మోహన లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. అతని గప్‌చుప్‌లు తిని 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో మోహన్‌లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గప్‌చుప్‌ల తయారీకి అతను ఉపయోగించిన వివిధ రకాల ఆహార పదార్థాల ఏడు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఈ సంఘటన జరిగిన చాలా ఆలస్యంగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన చిన్నారులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలను సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో మంచి వర్షాలు కురవాలని, పంటలు, పశువులు, గ్రామస్తులు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.1
- తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోసం పోరాటం చేసేవారిపై కేసులు పెడతారని, మరి తెలంగాణ ప్రజలను అగౌరవపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో పర్యటించిన కవిత, నగరంలోని కోతిరాంపూర్, శాతవాహన యూనివర్సిటీ వద్ద టీఆర్ఎస్ జెండా పండుగలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆనవాళ్లను పక్కన పెడుతున్నారని కవిత ఆరోపించారు. అందుకే పక్క రాష్ట్రం నుంచి మళ్ళీ పెత్తనం కోసం వస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతూ తమ నాయకుల విగ్రహాలను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా తమ హక్కుల కోసం పోరాడటం ఆవేదన కలిగిస్తోందని కవిత అన్నారు. ఉద్యమకారులకు అన్ని చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు చలనం లేదని ఆమె పేర్కొన్నారు. తాము పోరాటం చేస్తే కమిటీలు వేసి, ఆ తర్వాత మర్చిపోతారని, ఉద్యమకారులను గుర్తించటానికి కూడా ఈ ప్రభుత్వం 30 నెలల కాలం గడిపేసిందని విమర్శించారు. 12 వందల మంది అమరులైతే పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఆడిపోసుకుందని, కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. తమ రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయుల చిహ్నం రాచరిక పోకడ అంటూ తీసేశాడని ఆరోపించారు. చార్మినార్, పూర్ణకుంభం కూడా తీసేసే ప్రయత్నం చేస్తే వ్యతిరేకత రావటంతో ఆగిపోయారని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ ఇలాగే చేశారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారని, ఉద్యమ తల్లి విగ్రహానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న సాకుతో ఈ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని తెచ్చిందని విమర్శించారు. మొన్నటి జూన్ 2 లోపు విగ్రహాన్ని పెట్టాలని తెలంగాణ రక్షణ సేన తరఫున ధర్నాలు చేసినా పట్టించుకోలేదన్నారు. జయశంకర్ సార్ విగ్రహాన్ని అప్పటి ప్రభుత్వం పెట్టలేదని, ఈ ప్రభుత్వం కూడా పెట్టడం లేదని కవిత ఆరోపించారు. పసికూన లాంటి తమ కొత్త పార్టీని నడిపేందుకు ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె కోరారు.3
- హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు ఓటరు అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కేవలం ప్రతిపక్ష హోదా మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో పాలకపక్ష హోదా కూడా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌లో హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తుండటంతో, ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.1
- ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.2