logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మరియు కలెక్టర్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు తెలిపారు. అనంతరం, నాటిన మొక్కలను పరిశీలించిన మంత్రులు, వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రవి ప్రసాద్, డీఆర్‌డీఓ రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ సహా పలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

9 hrs ago
user_Sk chaitanya
Sk chaitanya
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
9 hrs ago

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మరియు కలెక్టర్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు తెలిపారు. అనంతరం, నాటిన మొక్కలను పరిశీలించిన మంత్రులు, వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రవి ప్రసాద్, డీఆర్‌డీఓ రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ సహా పలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఏఐటీయూసీ దేశంలోని అన్ని రంగాల కార్మికులకు అండగా నిలుస్తూ, వారి శ్రేయస్సు, వేతనాల పెంపు, హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్. బోస్, కలవేన శంకర్, ఎస్. బాల రాజు, పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఏఐటీయూసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమని, కార్మిక, ఉద్యోగ వర్గాలను ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొందని పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మిక వర్గానికి ఆశాజ్యోతిగా నిలిచి, శ్రమకు తగిన ఫలితం, పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, కనీస వేతనాల కోసం నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. అనేక చట్టాలను తీసుకురావడంలో, కార్మికుల హక్కులను, చట్టాలను కాపాడటంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. అయితే, బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, చివరికి సమ్మె చేసే హక్కును కూడా కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఉందని వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేసి, వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులకు ప్రధాని మోడీ తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, నాయకత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్, ఎస్. బాల రాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహాసభల ఫ్యాట్రన్ కలవేన శంకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్, ఎం.డి. ముక్రం, సుతారి రాములు, అజ్ఞ వేణు, కడారి రాములు, ఆహ్వాన సంఘం నాయకులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, పిట్టల సమ్మయ్య, కాశెట్టి లక్ష్మయ్య, వెల్దండి దామోదర్, అల్లేపు రాజు, నిఖిల్, కేంసారం నర్సయ్య, కొమురయ్య, కవిత, స్వరూప, రాధ, మమత, భీరయ్య, ఎం. తిరుపతి, గందే కొమురయ్య, గంగుల ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు.
    3
    ఏఐటీయూసీ దేశంలోని అన్ని రంగాల కార్మికులకు అండగా నిలుస్తూ, వారి శ్రేయస్సు, వేతనాల పెంపు, హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్. బోస్, కలవేన శంకర్, ఎస్. బాల రాజు, పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఏఐటీయూసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమని, కార్మిక, ఉద్యోగ వర్గాలను ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొందని పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మిక వర్గానికి ఆశాజ్యోతిగా నిలిచి, శ్రమకు తగిన ఫలితం, పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, కనీస వేతనాల కోసం నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. అనేక చట్టాలను తీసుకురావడంలో, కార్మికుల హక్కులను, చట్టాలను కాపాడటంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. అయితే, బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, చివరికి సమ్మె చేసే హక్కును కూడా కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఉందని వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేసి, వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులకు ప్రధాని మోడీ తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, నాయకత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్, ఎస్. బాల రాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహాసభల ఫ్యాట్రన్ కలవేన శంకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్, ఎం.డి. ముక్రం, సుతారి రాములు, అజ్ఞ వేణు, కడారి రాములు, ఆహ్వాన సంఘం నాయకులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, పిట్టల సమ్మయ్య, కాశెట్టి లక్ష్మయ్య, వెల్దండి దామోదర్, అల్లేపు రాజు, నిఖిల్, కేంసారం నర్సయ్య, కొమురయ్య, కవిత, స్వరూప, రాధ, మమత, భీరయ్య, ఎం. తిరుపతి, గందే కొమురయ్య, గంగుల ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    15 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గప్‌చుప్‌లు విక్రయించిన మోహన లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. అతని గప్‌చుప్‌లు తిని 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో మోహన్‌లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గప్‌చుప్‌ల తయారీకి అతను ఉపయోగించిన వివిధ రకాల ఆహార పదార్థాల ఏడు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఈ సంఘటన జరిగిన చాలా ఆలస్యంగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన చిన్నారులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గప్‌చుప్‌లు విక్రయించిన మోహన లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. అతని గప్‌చుప్‌లు తిని 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో మోహన్‌లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గప్‌చుప్‌ల తయారీకి అతను ఉపయోగించిన వివిధ రకాల ఆహార పదార్థాల ఏడు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

అయితే, ఈ సంఘటన జరిగిన చాలా ఆలస్యంగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన చిన్నారులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    16 hrs ago
  • నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.
    1
    నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.
    user_Bandi Laxman
    Bandi Laxman
    Local News Reporter కమ్మర్‌పల్లి, నిజామాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వావిలాలపల్లి ప్రాంతంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించగా వారి వద్ద 100 గ్రాముల గంజాయి లభ్యమైంది. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకొని సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడి నుండి తీసుకువచ్చారు, ఎవరికి విక్రయించేందుకు తీసుకువచ్చారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ పరిసరాలలో మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
    1
    కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వావిలాలపల్లి ప్రాంతంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించగా వారి వద్ద 100 గ్రాముల గంజాయి లభ్యమైంది. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకొని సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడి నుండి తీసుకువచ్చారు, ఎవరికి విక్రయించేందుకు తీసుకువచ్చారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ పరిసరాలలో మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
  • మంచిర్యాల జిల్లా చెన్నూరులో పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి చెన్నూరు మహిళా మండల అధ్యక్షురాలిగా కర్రు శ్రావణి ఎన్నికయ్యారు. ఆమె ప్రగతిశీల మహిళా మండలి పి.ఓ.డబ్ల్యూ.లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అక్క (జ్యోతక్క) మరియు చెన్నూరు మండల ఉపాధ్యక్షురాలు అనిత అక్క మహిళల అన్యాయాలు, హక్కుల గురించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు నెలకు ₹4,000 పెన్షన్ ఇస్తామని, అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ₹2,600 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని, ఆ మాటలకు అర్థం లేకుండా పోయిందని వారు విమర్శించారు. ఈ హామీల గురించి ఇప్పటివరకు ఎటువంటి ఊసూ లేదని, ప్రభుత్వం మహిళలను చులకన చేస్తోందని ఆరోపించారు. మహిళల కోసం ఏదైనా చేస్తామని, కోట్ల అధికారిణులను చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో లేవని స్పష్టం చేశారు. పనిచేసే పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి ఎల్లప్పుడూ మహిళల వెంటే ఉంటుందని, వారి కోసం పోరాడుతుందని జ్యోతక్క అన్నారు. మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు ఎక్కడో ఒకచోట రోజూ వినబడుతున్నాయని, దీనికి సరైన చట్టాలు లేకపోవడంతో నిందితులు చట్టపరంగా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళల కోసం ఎంతకైనా తెగించి ముందడుగు వేస్తామని కర్రు శ్రావణి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు జ్యోతక్క, ఉపాధ్యక్షురాలు అనిత అక్క, కర్రు శ్రావణి, సరోజన తదితరులు పాల్గొన్నారు.
    1
    మంచిర్యాల జిల్లా చెన్నూరులో పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి చెన్నూరు మహిళా మండల అధ్యక్షురాలిగా కర్రు శ్రావణి ఎన్నికయ్యారు. ఆమె ప్రగతిశీల మహిళా మండలి పి.ఓ.డబ్ల్యూ.లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అక్క (జ్యోతక్క) మరియు చెన్నూరు మండల ఉపాధ్యక్షురాలు అనిత అక్క మహిళల అన్యాయాలు, హక్కుల గురించి మాట్లాడారు.

ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు నెలకు ₹4,000 పెన్షన్ ఇస్తామని, అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ₹2,600 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని, ఆ మాటలకు అర్థం లేకుండా పోయిందని వారు విమర్శించారు. ఈ హామీల గురించి ఇప్పటివరకు ఎటువంటి ఊసూ లేదని, ప్రభుత్వం మహిళలను చులకన చేస్తోందని ఆరోపించారు. మహిళల కోసం ఏదైనా చేస్తామని, కోట్ల అధికారిణులను చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో లేవని స్పష్టం చేశారు.

పనిచేసే పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి ఎల్లప్పుడూ మహిళల వెంటే ఉంటుందని, వారి కోసం పోరాడుతుందని జ్యోతక్క అన్నారు. మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు ఎక్కడో ఒకచోట రోజూ వినబడుతున్నాయని, దీనికి సరైన చట్టాలు లేకపోవడంతో నిందితులు చట్టపరంగా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళల కోసం ఎంతకైనా తెగించి ముందడుగు వేస్తామని కర్రు శ్రావణి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు జ్యోతక్క, ఉపాధ్యక్షురాలు అనిత అక్క, కర్రు శ్రావణి, సరోజన తదితరులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో కలిసి పరామర్శించారు. గత సోమవారం సాయంత్రం తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో సుమారు 20 మంది చిన్నారులు గప్ చుప్‌లు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేటీఆర్ కలిసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారని, వారికి ఏమీ కాదని ధైర్యం చెప్పారు. వైద్యం విషయంలో ఏదైనా అవసరం ఉంటే తనకు చెప్పాలని చిన్నారుల తల్లిదండ్రులతో అన్నారు. అక్కడే ఉన్న వైద్యులతో మాట్లాడుతూ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. అవసరమైతే కరీంనగర్‌కు తరలించి మంచి వైద్యం అందేలా చూడాలని కూడా సూచించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో కలిసి పరామర్శించారు. గత సోమవారం సాయంత్రం తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో సుమారు 20 మంది చిన్నారులు గప్ చుప్‌లు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఆసుపత్రి పాలయ్యారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేటీఆర్ కలిసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారని, వారికి ఏమీ కాదని ధైర్యం చెప్పారు. వైద్యం విషయంలో ఏదైనా అవసరం ఉంటే తనకు చెప్పాలని చిన్నారుల తల్లిదండ్రులతో అన్నారు. అక్కడే ఉన్న వైద్యులతో మాట్లాడుతూ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. అవసరమైతే కరీంనగర్‌కు తరలించి మంచి వైద్యం అందేలా చూడాలని కూడా సూచించారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 hrs ago
  • ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.
    2
    ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడాన్ని AIMIM కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ స్వాగతించారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రానికి వెంటనే స్పందించి ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ కలెక్టర్ కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు AIMIM తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మజీద్ హుస్సేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫ్ఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    15 hrs ago
  • తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌కు చెందిన పలువురు చిన్నారులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఈ ఘటనతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు పరామర్శించారు. అలాగే, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.
    1
    తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌కు చెందిన పలువురు చిన్నారులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఈ ఘటనతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చిన్నారులు చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు పరామర్శించారు. అలాగే, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    16 hrs ago
  • బొమ్మెన చింతగూడ వద్ద రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి జూన్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బొమ్మెన చింతగూడ గ్రామాల మధ్య అర్థరాత్రి 9 గంటల సమయంలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది లక్షట్ పేట వైపు నుండి వస్తున్న లెవలింగ్ ట్రాక్టర్ జన్నారం వైపు నుండి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొట్టడంతో మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సునార్కరి పవన్ మగ్గిడి సురేష్ ఆటోలో 9 గంటలకు జన్నారం నుండి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లెవలింగ్ బ్లేడ్ ట్రాక్టర్ అకస్మాత్తుగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగావారు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చిన వెంటనే గాయపడిన వారిని లక్షేట్టిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు మగ్గిడి సురేష్ పరిస్థితి విషమంగా ఉందని మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆస్పత్రిలో వైద్యం జరుగుతున్న సమయంలో మగ్గిడి సురేష్ చనిపోయాడు ఈ ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలియ రావలసి ఉంది
    1
    బొమ్మెన చింతగూడ వద్ద రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
జూన్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బొమ్మెన చింతగూడ గ్రామాల మధ్య అర్థరాత్రి 9 గంటల సమయంలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది లక్షట్ పేట వైపు నుండి వస్తున్న లెవలింగ్ ట్రాక్టర్ జన్నారం వైపు నుండి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొట్టడంతో మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సునార్కరి పవన్ మగ్గిడి సురేష్ ఆటోలో 9 గంటలకు జన్నారం నుండి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లెవలింగ్ బ్లేడ్ ట్రాక్టర్ అకస్మాత్తుగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగావారు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చిన వెంటనే గాయపడిన వారిని లక్షేట్టిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు మగ్గిడి సురేష్ పరిస్థితి విషమంగా ఉందని మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆస్పత్రిలో వైద్యం జరుగుతున్న సమయంలో మగ్గిడి  సురేష్ చనిపోయాడు ఈ ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలియ రావలసి ఉంది
    user_కండ్లే శ్రావణ్ కుమార్
    కండ్లే శ్రావణ్ కుమార్
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    27 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.