మంచిర్యాల జిల్లా చెన్నూరులో పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి చెన్నూరు మహిళా మండల అధ్యక్షురాలిగా కర్రు శ్రావణి ఎన్నికయ్యారు. ఆమె ప్రగతిశీల మహిళా మండలి పి.ఓ.డబ్ల్యూ.లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అక్క (జ్యోతక్క) మరియు చెన్నూరు మండల ఉపాధ్యక్షురాలు అనిత అక్క మహిళల అన్యాయాలు, హక్కుల గురించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు నెలకు ₹4,000 పెన్షన్ ఇస్తామని, అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ₹2,600 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని, ఆ మాటలకు అర్థం లేకుండా పోయిందని వారు విమర్శించారు. ఈ హామీల గురించి ఇప్పటివరకు ఎటువంటి ఊసూ లేదని, ప్రభుత్వం మహిళలను చులకన చేస్తోందని ఆరోపించారు. మహిళల కోసం ఏదైనా చేస్తామని, కోట్ల అధికారిణులను చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో లేవని స్పష్టం చేశారు. పనిచేసే పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి ఎల్లప్పుడూ మహిళల వెంటే ఉంటుందని, వారి కోసం పోరాడుతుందని జ్యోతక్క అన్నారు. మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు ఎక్కడో ఒకచోట రోజూ వినబడుతున్నాయని, దీనికి సరైన చట్టాలు లేకపోవడంతో నిందితులు చట్టపరంగా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళల కోసం ఎంతకైనా తెగించి ముందడుగు వేస్తామని కర్రు శ్రావణి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు జ్యోతక్క, ఉపాధ్యక్షురాలు అనిత అక్క, కర్రు శ్రావణి, సరోజన తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి చెన్నూరు మహిళా మండల అధ్యక్షురాలిగా కర్రు శ్రావణి ఎన్నికయ్యారు. ఆమె ప్రగతిశీల మహిళా మండలి పి.ఓ.డబ్ల్యూ.లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అక్క (జ్యోతక్క) మరియు చెన్నూరు మండల ఉపాధ్యక్షురాలు అనిత అక్క మహిళల అన్యాయాలు, హక్కుల గురించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు నెలకు ₹4,000 పెన్షన్ ఇస్తామని, అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ₹2,600 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని, ఆ మాటలకు అర్థం లేకుండా పోయిందని వారు విమర్శించారు. ఈ హామీల గురించి ఇప్పటివరకు ఎటువంటి ఊసూ లేదని, ప్రభుత్వం మహిళలను చులకన చేస్తోందని ఆరోపించారు. మహిళల కోసం ఏదైనా చేస్తామని, కోట్ల అధికారిణులను చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో లేవని స్పష్టం చేశారు. పనిచేసే పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి ఎల్లప్పుడూ మహిళల వెంటే ఉంటుందని, వారి కోసం పోరాడుతుందని జ్యోతక్క అన్నారు. మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు ఎక్కడో ఒకచోట రోజూ వినబడుతున్నాయని, దీనికి సరైన చట్టాలు లేకపోవడంతో నిందితులు చట్టపరంగా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళల కోసం ఎంతకైనా తెగించి ముందడుగు వేస్తామని కర్రు శ్రావణి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు జ్యోతక్క, ఉపాధ్యక్షురాలు అనిత అక్క, కర్రు శ్రావణి, సరోజన తదితరులు పాల్గొన్నారు.
- మంచిర్యాల జిల్లా చెన్నూరులో పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి చెన్నూరు మహిళా మండల అధ్యక్షురాలిగా కర్రు శ్రావణి ఎన్నికయ్యారు. ఆమె ప్రగతిశీల మహిళా మండలి పి.ఓ.డబ్ల్యూ.లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అక్క (జ్యోతక్క) మరియు చెన్నూరు మండల ఉపాధ్యక్షురాలు అనిత అక్క మహిళల అన్యాయాలు, హక్కుల గురించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు నెలకు ₹4,000 పెన్షన్ ఇస్తామని, అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ₹2,600 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని, ఆ మాటలకు అర్థం లేకుండా పోయిందని వారు విమర్శించారు. ఈ హామీల గురించి ఇప్పటివరకు ఎటువంటి ఊసూ లేదని, ప్రభుత్వం మహిళలను చులకన చేస్తోందని ఆరోపించారు. మహిళల కోసం ఏదైనా చేస్తామని, కోట్ల అధికారిణులను చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో లేవని స్పష్టం చేశారు. పనిచేసే పి.ఓ.డబ్ల్యూ. ప్రగతిశీల మహిళా మండలి ఎల్లప్పుడూ మహిళల వెంటే ఉంటుందని, వారి కోసం పోరాడుతుందని జ్యోతక్క అన్నారు. మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు ఎక్కడో ఒకచోట రోజూ వినబడుతున్నాయని, దీనికి సరైన చట్టాలు లేకపోవడంతో నిందితులు చట్టపరంగా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళల కోసం ఎంతకైనా తెగించి ముందడుగు వేస్తామని కర్రు శ్రావణి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు జ్యోతక్క, ఉపాధ్యక్షురాలు అనిత అక్క, కర్రు శ్రావణి, సరోజన తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మరియు కలెక్టర్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు తెలిపారు. అనంతరం, నాటిన మొక్కలను పరిశీలించిన మంత్రులు, వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రవి ప్రసాద్, డీఆర్‌డీఓ రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ సహా పలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- సిర్పూర్(టి) మండలంలోని వేంపల్లి నర్సరీ వద్ద సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు వన మహోత్సవం 2026-27 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేప మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే, జీవ వైవిధ్యం మెండుగా ఉన్న నియోజకవర్గంలో ప్రజల భాగస్వామ్యం లేనిదే అటవీ సంరక్షణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కన్నెపల్లి మండలంలోని సాలిగాం నల్లవాగు వద్ద లక్షల సంవత్సరాల క్రితం రాక్షస బల్లులు తిరిగాయని, వాటి పాదముద్రలు ఇటీవలే శాస్త్రవేత్తలకు లభించాయని ఆయన పేర్కొన్నారు. అడవిలోని చెట్లు, జంతువుల సంరక్షణ కోసం యువత, మహిళలు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ అప్పయ్య, ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మణ్, డీఆర్‌ఓలు శశిధర్ బాబు, హేమలత, ఎఫ్‌ఎస్‌ఓలు జగన్ మోహన్ గౌడ్, కామరాజు, ఎఫ్‌బీఓ విజయ్, రమాదేవి, స్వాతి, శ్రీనివాస్, సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.1
- జన్నారం-బాదంపెల్లి మార్గంలో నిర్మిస్తున్న కల్వర్టులో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 18mm నుండి 24mm మందం గల ఇనుప రాడ్లను వాడాల్సి ఉండగా, నిర్మాణంలో కేవలం 6mm నుండి 12mm రాడ్లనే ఉపయోగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా, నాణ్యత లేని సిమెంట్ వాడకంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా భద్రతను విస్మరిస్తూ సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులు వెంటనే విచారణ జరిపి, నాణ్యత ప్రమాణాల మేరకు పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, అధికారుల నిర్లక్ష్యంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.2
- తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు దొర గారి మెప్పు పొందడం కోసమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్‌కు తాను సాటి దళితుడిగా అండగా నిలిచానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అని ఆయన స్పష్టం చేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమీషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించానని మంత్రి అడ్లూరి తెలిపారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్, గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పని చేశారని గుర్తు చేస్తూ, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించగా, ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని అడ్లూరి అన్నారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ. 683 కోట్లతో టెండర్లు పిలిచామని, అలాగే రూ. 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లను ఖరారు చేశాయని వివరించారు. మొత్తం రూ. 1,183 కోట్లకు టెండర్లు పిలిస్తే, మాజీ మంత్రి హరీష్ రావు రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడంపై తాను సమాధానం చెప్పగా, దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు 'ఖాబ్దార్' అని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి విమర్శించారు. కొప్పుల ఈశ్వర్ గత ఎన్నికల్లో ఎలా గెలిచారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని మంత్రి అడ్లూరి అన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తాళం పోతే ఎక్కడ పోయిందని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కొప్పులపై తాను 2009లో పోటీ చేసి కేవలం 1,165 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన సమయంలో రాష్ట్రంలో ఎవరికీ డిపాజిట్ రాలేదని, తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందని అడ్లూరి అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఆర్టీసీ బస్సు డిపో వంటివి ఏమీ తీసుకురాకపోవడంతోనే 2023 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు కొప్పులకు ఓట్లే వేయలేదని మంత్రి అడ్లూరి తెలిపారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల, గురుకుల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ కలిసి దోచుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ పునరుద్ఘాటించారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.2
- బొమ్మెన చింతగూడ వద్ద రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి జూన్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బొమ్మెన చింతగూడ గ్రామాల మధ్య అర్థరాత్రి 9 గంటల సమయంలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది లక్షట్ పేట వైపు నుండి వస్తున్న లెవలింగ్ ట్రాక్టర్ జన్నారం వైపు నుండి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొట్టడంతో మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సునార్కరి పవన్ మగ్గిడి సురేష్ ఆటోలో 9 గంటలకు జన్నారం నుండి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లెవలింగ్ బ్లేడ్ ట్రాక్టర్ అకస్మాత్తుగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగావారు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చిన వెంటనే గాయపడిన వారిని లక్షేట్టిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు మగ్గిడి సురేష్ పరిస్థితి విషమంగా ఉందని మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆస్పత్రిలో వైద్యం జరుగుతున్న సమయంలో మగ్గిడి సురేష్ చనిపోయాడు ఈ ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలియ రావలసి ఉంది1