Shuru
Apke Nagar Ki App…
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.
Bandi Laxman
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గప్‌చుప్‌లు విక్రయించిన మోహన లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. అతని గప్‌చుప్‌లు తిని 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో మోహన్‌లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గప్‌చుప్‌ల తయారీకి అతను ఉపయోగించిన వివిధ రకాల ఆహార పదార్థాల ఏడు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఈ సంఘటన జరిగిన చాలా ఆలస్యంగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన చిన్నారులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.3
- జన్నారం-బాదంపెల్లి మార్గంలో నిర్మిస్తున్న కల్వర్టులో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 18mm నుండి 24mm మందం గల ఇనుప రాడ్లను వాడాల్సి ఉండగా, నిర్మాణంలో కేవలం 6mm నుండి 12mm రాడ్లనే ఉపయోగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా, నాణ్యత లేని సిమెంట్ వాడకంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా భద్రతను విస్మరిస్తూ సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులు వెంటనే విచారణ జరిపి, నాణ్యత ప్రమాణాల మేరకు పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, అధికారుల నిర్లక్ష్యంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.2
- కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులను పరిశీలించారు. CCTNS అప్‌డేట్‌లను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రౌడీషీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రాజేశ్ చంద్ర సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.1
- లింగంపేట్ : ఉపాధి హామీ ద్వారా వలసలను నివారించవచ్చు.... లింగంపేట మండలం భవానిపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పనులు చేయడం వలన వలసలు నివారించవచ్చు ఈ పనుల ద్వారా చెరు వు పూడిక, కంధకాలు, మొక్కలు నాటడం, వంటి పనుల ద్వారా, గ్రామం లోప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది ఈ పని.1
- తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు దొర గారి మెప్పు పొందడం కోసమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్‌కు తాను సాటి దళితుడిగా అండగా నిలిచానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అని ఆయన స్పష్టం చేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమీషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించానని మంత్రి అడ్లూరి తెలిపారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్, గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పని చేశారని గుర్తు చేస్తూ, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించగా, ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని అడ్లూరి అన్నారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ. 683 కోట్లతో టెండర్లు పిలిచామని, అలాగే రూ. 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లను ఖరారు చేశాయని వివరించారు. మొత్తం రూ. 1,183 కోట్లకు టెండర్లు పిలిస్తే, మాజీ మంత్రి హరీష్ రావు రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడంపై తాను సమాధానం చెప్పగా, దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు 'ఖాబ్దార్' అని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి విమర్శించారు. కొప్పుల ఈశ్వర్ గత ఎన్నికల్లో ఎలా గెలిచారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని మంత్రి అడ్లూరి అన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తాళం పోతే ఎక్కడ పోయిందని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కొప్పులపై తాను 2009లో పోటీ చేసి కేవలం 1,165 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన సమయంలో రాష్ట్రంలో ఎవరికీ డిపాజిట్ రాలేదని, తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందని అడ్లూరి అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఆర్టీసీ బస్సు డిపో వంటివి ఏమీ తీసుకురాకపోవడంతోనే 2023 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు కొప్పులకు ఓట్లే వేయలేదని మంత్రి అడ్లూరి తెలిపారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల, గురుకుల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ కలిసి దోచుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ పునరుద్ఘాటించారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.2
- ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని కాండ్లీ గ్రామ సర్పంచ్ జాదవ్ అనిత రాంకిషన్, ఉప సర్పంచ్ గంగయ్య, గిన్నూర్ ఉప సర్పంచ్ రాజేందర్ యాదవ్, కాండ్లీ గ్రామ నాయక్, కొత్తపల్లి గ్రామ పటేల్ సహా పలువురు నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చగా, రైతులు సంతోషంగా, ప్రజల జీవితాలు సుభిక్షంగా ఉండేవని ప్రజలు స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అని ఆయన కొనియాడారు. మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరిగిందని, రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు గ్రామ పంచాయతీల బలోపేతంతో పల్లెలు ప్రగతి బాటలో నడిచాయని వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాలన ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ సందర్భంగా మరోసారి నొక్కి చెప్పారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలను సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో మంచి వర్షాలు కురవాలని, పంటలు, పశువులు, గ్రామస్తులు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.1
- తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌కు చెందిన పలువురు చిన్నారులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఈ ఘటనతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు పరామర్శించారు. అలాగే, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.1
- కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలో గురువారం సైబర్ నేరాలు మరియు ఓటీపీల మోసాలపై ఖాతాదారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీపక్ కుమార్ మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ అధికారులు గానీ, పోలీస్ అధికారులు గానీ ఫోన్ చేసి ఓటీపీలు అడగరని ప్రజలు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్సై దీపక్ కుమార్ సూచించారు. అంతేకాకుండా, ఇతర అత్యవసర సమయాల్లో 100 లేదా 112 నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.1