Shuru
Apke Nagar Ki App…
మెట్ పల్లిలో కవిత పర్యటనలో జేబుదొంగల చేతివాటం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యకర్తల రద్దీలో మమేకమైన దుండగులు ఒకరి జేబులో నుంచి రూ.17 వేలు, మరో ఇద్దరి నుంచి రూ.2 వేల చొప్పున నగదు అపహరించారు. అనుమానితుడిని పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహారాష్ట్ర అప్పగించారు. అనుమానితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
K.V.REDDY
మెట్ పల్లిలో కవిత పర్యటనలో జేబుదొంగల చేతివాటం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యకర్తల రద్దీలో మమేకమైన దుండగులు ఒకరి జేబులో నుంచి రూ.17 వేలు, మరో ఇద్దరి నుంచి రూ.2 వేల చొప్పున నగదు అపహరించారు. అనుమానితుడిని పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహారాష్ట్ర అప్పగించారు. అనుమానితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
More news from తెలంగాణ and nearby areas
- బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర...ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచి పెడతాం-కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కరీంనగర్ లో ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందని మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు...కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తా అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా..? సీఎంకు బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి డీల్ కోసం బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.1
- రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.4
- చరిత్ర పురుషుడు అంబేద్కర్ ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న పుస్తకం. చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం అని అన్నారు. చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్ లు పాల్గొన్నారు1
- మడికొండలో కొండచిలువ కలకలం.. అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం మడికొండ హైవేపై డీసీసీ బ్యాంక్ పక్కన వేకువజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. రద్దీ ప్రాంతంలో పాము రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యార. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అలాగే ఇలాంటి ఘటనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌.𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏#𝐌𝐀𝐋𝐄][𝐁𝐀3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐀𝐍𝐀𝐌 𝐌𝐎𝐍𝐃𝐀-𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂][𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀-𝐒𝐓𝐀𝐓𝐄#𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃)4
- సిరిసిల్లలో పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన. సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.1
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- మెట్ పల్లిలో కవిత పర్యటనలో జేబుదొంగల చేతివాటం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యకర్తల రద్దీలో మమేకమైన దుండగులు ఒకరి జేబులో నుంచి రూ.17 వేలు, మరో ఇద్దరి నుంచి రూ.2 వేల చొప్పున నగదు అపహరించారు. అనుమానితుడిని పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహారాష్ట్ర అప్పగించారు. అనుమానితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.1