గంజాయి రహిత సమాజమే లక్ష్యం: పాల్వంచలో 'ఈగల్ ఫోర్స్' భారీ అవగాహన సదస్సు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ (ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక)లో భాగంగా, మాదకద్రవ్యాల నిర్మూలనపై పాల్వంచ పట్టణంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక నెహ్రూ నగర్, ఇందిరానగర్ కాలనీలలో విద్యార్థులు, యువత లక్ష్యంగా ఈ సదస్సులు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన 'ఈగల్ ఫోర్స్' ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించడమే కాకుండా, వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ డిఎస్పీ భిక్షపతి రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి, ఇతర యాంటీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వారి వివరాలను ఎవరైనా తెలియజేస్తే, వారి పేర్లను అత్యంత గోప్యంగా ఉంచుతామని, మత్తుకు బానిసైన వారికి హైదరాబాద్‌లో ప్రభుత్వం తరపున ఉచితంగా మెరుగైన వైద్యం, కౌన్సిలింగ్ అందిస్తాం అన్నారు.అలాగే బాధితుల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ అవగాహన సదస్సులో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మార్వో ప్రసాద్, ఎక్సైజ్ సిఐ, పట్టణ సిఐ సతీష్, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: పాల్వంచలో 'ఈగల్ ఫోర్స్' భారీ అవగాహన సదస్సు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ (ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక)లో భాగంగా, మాదకద్రవ్యాల నిర్మూలనపై పాల్వంచ పట్టణంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక నెహ్రూ నగర్, ఇందిరానగర్ కాలనీలలో విద్యార్థులు, యువత
లక్ష్యంగా ఈ సదస్సులు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన 'ఈగల్ ఫోర్స్' ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించడమే కాకుండా, వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ డిఎస్పీ
భిక్షపతి రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి, ఇతర యాంటీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వారి వివరాలను ఎవరైనా తెలియజేస్తే, వారి పేర్లను అత్యంత గోప్యంగా ఉంచుతామని, మత్తుకు బానిసైన వారికి హైదరాబాద్‌లో ప్రభుత్వం తరపున ఉచితంగా మెరుగైన వైద్యం, కౌన్సిలింగ్ అందిస్తాం
అన్నారు.అలాగే బాధితుల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ అవగాహన సదస్సులో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మార్వో ప్రసాద్, ఎక్సైజ్ సిఐ, పట్టణ సిఐ సతీష్, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. "ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు." ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- Post by JADI RAJU1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.1
- Post by Ippili tulasi1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1