logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిజామాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన నిజామాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన నిజామాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పరిస్థితులు, కార్యకర్తల సమస్యలపై కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల అంశం ఈ సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకోనుంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన నిబద్ధత కలిగిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో, అర్హులైన కార్యకర్తలపై చర్చ జరిగే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీని సెప్టెంబర్‌లో చేపట్టనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ప్రకటించారు. దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి అధిక ప్రాధాన్యతతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. కార్యకర్తల కష్టానికి గుర్తింపు – నిబద్ధతకు ప్రాధాన్యత – పార్టీ బలోపేతమే లక్ష్యం అనే దిశగా నిజామాబాద్ సమావేశం కొనసాగనుంది. పీసీసీ చీఫ్ పర్యటనతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో రాజకీయంగా మరింత ఉత్సాహం నెలకొంది.

2 hrs ago
user_NIMMANAGANTI ANIL BABU
NIMMANAGANTI ANIL BABU
Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
2 hrs ago
68976b27-7b51-4874-908f-d7d882fc8268

నిజామాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన నిజామాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన నిజామాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పరిస్థితులు, కార్యకర్తల సమస్యలపై కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల అంశం ఈ సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకోనుంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన నిబద్ధత కలిగిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో, అర్హులైన కార్యకర్తలపై చర్చ జరిగే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీని సెప్టెంబర్‌లో చేపట్టనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ప్రకటించారు. దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి అధిక ప్రాధాన్యతతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. కార్యకర్తల కష్టానికి గుర్తింపు – నిబద్ధతకు ప్రాధాన్యత – పార్టీ బలోపేతమే లక్ష్యం అనే దిశగా నిజామాబాద్ సమావేశం కొనసాగనుంది. పీసీసీ చీఫ్ పర్యటనతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో రాజకీయంగా మరింత ఉత్సాహం నెలకొంది.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.
    1
    ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.
ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు.
ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.
    user_మాంధాత సత్య
    మాంధాత సత్య
    Astrologer సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..
    1
    తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో  టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    43 min ago
  • పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన... కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు.. అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది.. మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..
    1
    పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి 
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన...
కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు..
అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. 
ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది..
మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
    1
    వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
    1
    ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. 
నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... 
కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    1
    *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!*

*- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. 

*సూర్యాపేట సిటీ ఆగస్టు 26:
అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    14 hrs ago
  • నేలకొండపల్లిలో మాజీ పిడిఎస్ యు మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఒకప్పుడు పీడీఎస్ పార్టీలో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మాజీ పిడిఎస్ యు మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఒకప్పుడు పీడీఎస్ పార్టీలో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు. ఈ సమావేశంలో ప్రస్తుతం వివిధ పార్టీలలో ఉన్న వారు వివిధ రంగాల్లో ఉన్న వారు పాల్గొన్నారు.ఒకప్పుడు పార్టీలో పనిచేసినప్పుడు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, ప్రజల కోసం చేసిన పనులను నెమరు వేసుకున్నారు. తమ గత స్మృతులను ఒకరికొకరు పంచుకున్నారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఆనాటి స్నేహం, ఆత్మీయత ఇంకా అలాగే ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కలయికలు మరిన్ని జరగాలని కోరుకున్నారు.
    1
    నేలకొండపల్లిలో మాజీ పిడిఎస్ యు మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఒకప్పుడు పీడీఎస్ పార్టీలో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మాజీ పిడిఎస్ యు మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఒకప్పుడు పీడీఎస్ పార్టీలో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు.
ఈ సమావేశంలో ప్రస్తుతం వివిధ పార్టీలలో ఉన్న వారు వివిధ రంగాల్లో ఉన్న వారు పాల్గొన్నారు.ఒకప్పుడు పార్టీలో పనిచేసినప్పుడు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, ప్రజల కోసం చేసిన పనులను నెమరు వేసుకున్నారు. తమ గత స్మృతులను ఒకరికొకరు పంచుకున్నారు.
రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఆనాటి స్నేహం, ఆత్మీయత ఇంకా అలాగే ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కలయికలు మరిన్ని జరగాలని కోరుకున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.