కామారెడ్డి మండలం : హకీంపేట్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఇందిరా గాంధీ స్టేడియంలో ఎంపికలు : రంగా వెంకటేశ్వర్ గౌడ్ పత్రిక ప్రకటన తేది:28.03.2026 కామారెడ్డి జిల్లా . శనివారం. .. వైస్ చైర్మన్, మెనెజింగ్ డైరెక్టర్ (SATG), హైదరాబాద్ తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ వారి ఆదేశాల మేరకు , జిల్లా కలెక్టర్ అనుమతితో తేదీ :28.03.2026 నాడు ఇందిరా గాంధీ స్టేడియం, కామారెడ్డి జిల్లా నందు తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్స్ లో నాల్గవ తరగతి అడ్మిషన్స్ కొరకు జిల్లా స్థాయి సెలెక్షన్స్ ప్రక్రియ జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ ఆథ్వర్యంలో నిర్వహించబడినవి. ఈ ప్రక్రియలో (09) అంశాల నందు పిల్లల శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించబడినవి. ఈ పోటీల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన 25 మండలాల నుండి దాదాపు (80) మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారి సామర్థ్యములను నిరూపించుకోవటం జరిగింది. వీరిలో రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక కొరకు ఎంపిక అయిన (10) మంది విద్యార్థిని (10) విద్యార్థులు ఎంపిక చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో SGF సెక్రటరీ. హీరాలాల్, కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మాజీ SGF సెక్రటరీ, పి.వెంకట్, నాయబ్ రసూల్ క్రీడా స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ కమిటి మెంబెర్స్ నిర్వహించుటకు సహకరించిన వ్యాయమ ఉపాధ్యాయులు సాయి మౌర్య , వై నర్సింహారెడ్డి, నరేష్ రెడ్డి, అనిల్ కుమార్, లక్ష్మన్ రాథోడ్, పి.అశోక్, కేసురేష్, జె మోహన్ రెడ్డి, బాణాల భాస్కర్ రెడ్డి, బి అరుణ, కే. స్వప్న , యం. విజయ లక్ష్మి, బి. రేణుక, పి సంజీవులు , జిల్లా యువజన, క్రీడల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి మండలం : హకీంపేట్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఇందిరా గాంధీ స్టేడియంలో ఎంపికలు : రంగా వెంకటేశ్వర్ గౌడ్ పత్రిక ప్రకటన తేది:28.03.2026 కామారెడ్డి జిల్లా . శనివారం. .. వైస్ చైర్మన్, మెనెజింగ్ డైరెక్టర్ (SATG), హైదరాబాద్ తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ వారి ఆదేశాల మేరకు , జిల్లా కలెక్టర్ అనుమతితో తేదీ :28.03.2026 నాడు ఇందిరా గాంధీ స్టేడియం, కామారెడ్డి జిల్లా నందు తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్స్ లో నాల్గవ తరగతి అడ్మిషన్స్ కొరకు జిల్లా స్థాయి సెలెక్షన్స్ ప్రక్రియ జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ ఆథ్వర్యంలో నిర్వహించబడినవి. ఈ ప్రక్రియలో (09) అంశాల నందు పిల్లల శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించబడినవి. ఈ పోటీల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన 25 మండలాల నుండి దాదాపు (80) మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారి సామర్థ్యములను నిరూపించుకోవటం జరిగింది. వీరిలో రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక కొరకు ఎంపిక అయిన (10) మంది విద్యార్థిని (10) విద్యార్థులు ఎంపిక చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో SGF సెక్రటరీ. హీరాలాల్, కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మాజీ SGF సెక్రటరీ, పి.వెంకట్, నాయబ్ రసూల్ క్రీడా స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ కమిటి మెంబెర్స్ నిర్వహించుటకు సహకరించిన వ్యాయమ ఉపాధ్యాయులు సాయి మౌర్య , వై నర్సింహారెడ్డి, నరేష్ రెడ్డి, అనిల్ కుమార్, లక్ష్మన్ రాథోడ్, పి.అశోక్, కేసురేష్, జె మోహన్ రెడ్డి, బాణాల భాస్కర్ రెడ్డి, బి అరుణ, కే. స్వప్న , యం. విజయ లక్ష్మి, బి. రేణుక, పి సంజీవులు , జిల్లా యువజన, క్రీడల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* .. మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రౌండింగ్ నిర్మాణ తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ................ కలెక్టర్ వెంట ee సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఈఓ రాజు, mro, mpdo, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు.1
- మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో ప్రతిష్టించి సీతారాముల ఉత్సవమూర్తులను అందులో ప్రతిష్టించి పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.1
- రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేయాలి --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశ నిర్వహించారు . . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరాలన్నారు. రోడ్ల పై పెండింగ్ లో ఉన్న సి సి కెమెరాలు సిగ్నల్స్ విద్యుత్ దీపాలు సైన్ బోర్డులు, గుంతలు పూడ్చి పెండింగ్ పనులు లేకుండా చూడాలన్నారు. విద్యాసంస్థల్లో, కళాశాలలో రోడ్డు భద్రత నియమాల గూర్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున వాహన దారులు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, రోడ్ల పై ఉన్న వివిధ సిగ్నల్, మార్కింగ్ గురించి తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచించారు. మత్తు పదార్థాలపై నిఘా పెంచాలన్నారు. మత్తుకు అలవాటు పడి యువకులు భవిష్యత్తు కోల్పోకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారించవచ్చని, విద్యాలయాల్లో,మెడికల్ షాపుల్లో, పరిశ్రమలలో నిరతరం మత్తు పదార్థాలపై నిఘా పెట్టామన్నారు. మత్తు తో జీవితాలు చిత్తు అయిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, డి ఎస్పీ లు, మున్సిపల్ కమిషనర్లు,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- నిజామాబాద్ హమాల్వాడిలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో DJ వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన MLA.. స్వయంగా DJ వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడిపించడం చర్చనీయాంశమైంది.1
- ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు లు లేవు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం చేసింది కాంగ్రెస్ నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తాం వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ BRS నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండు సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలుపరచకుండా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిందని బాల్కొండ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలో అమలు కోసం నిధులు కూడా కేటాయించకుండా ఇంకా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది అని విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని అన్నారు మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారు ప్రజలను నమ్మించడానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాడు గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టింది కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 25 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదు. పథకాల అమలు తక్కువ... ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. 25 నెలలుగా 2500 చొప్పున 60 000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడింది.ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు వృద్దులకు, బీడీ పెన్షన్ వాళ్లకు అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో పెన్షన్ ల పెంపు ఊసే లేదని అన్నారు. దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు. రైతు భరోసా 15,000, కౌలు రైతులకు 15 వేలు, రుణమాఫీ కానీ వారికీ 2,00,000 రుణమాఫీ ఈ బడ్జెట్ లో ప్రస్థావించలేదు. విద్యాభరోసా కార్డు 5,00,000 ఇస్తామన్నారు నిధుల కేటాయింపు లేదు. ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున ఇస్తామని ఆరు గ్యారఆంటీల్లో చెప్పి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్,నిరుద్యోగ భృతి విద్యార్థులకు స్కూటి లు, ఫీ రియంబర్స్మెంట్ లను విస్మరించింంది ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం మాట బడ్జెట్ లో ఎత్తలేదు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి బడ్జెట్ లో నిదులు కేటాయించకుండా ప్రజలను నమ్మించి మోసం చేసింది.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన BRS పార్టీ పోరాటం చేస్తుంది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసిన మోసలను ప్రజాక్షేత్రం లో ఎండగడుతుంది. ఈ మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి,బద్దం ప్రవీణ్ రెడ్డి బాల్కొండ,కల్లెడ ఏలీయా, ప్రెసిడెంట్,దాసరి వెంకటేష్, రేగుంట దేవేందర్, జైడి నాగధర్,బద్దం రవి ,బద్దం నర్సారెడ్డి ,రేగుల్ల రాములు,దొంకంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష,రాజా పూర్ణనందం,కొలిపాక ఉపేందర్,శ్రీకాంత్, గడ్డం స్వామి, ఏలేటి రమేష్,ప్రతాప్ ,భోజపల్లి సురేష్ లోలపు సుమన్,బూరుకల కమలాకర్ డోల్ల రాజేశ్వర్,గంగారెడ్డి నడ్కుడా, నారాయణ, గంగాధర్, సూర్జీల్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, ఉమా శంకర్,ఆనంద్, యూసుఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు1
- బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.1
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *గుడ్డును తూకం వేసి బరువును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* . .... మద్నూర్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, స్వయంగా గుడ్లను తూకం వేసి వాటి బరువును పరిశీలించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్ల బరువు ఉందో లేదో తనిఖీ చేస్తూ, తక్కువ బరువుతో సరఫరా అవుతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తక్కువ బరువుతో గుడ్లు సరఫరా అయితే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, సరఫరాలో నాణ్యత లోపాలు ఉంటే గుత్తేదారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం, వసతులపై ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, విద్యార్థులకు పోషకాహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్కూల్ లో శుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట deo రాజు, dco రామ్మోహన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.1