Shuru
Apke Nagar Ki App…
నగరంలో డీజే కు పర్మిషన్ లేదని యాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే ధనపాల్ ఫైర్ నిజామాబాద్ హమాల్వాడిలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో DJ వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన MLA.. స్వయంగా DJ వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడిపించడం చర్చనీయాంశమైంది.
Sri 8341234584
నగరంలో డీజే కు పర్మిషన్ లేదని యాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే ధనపాల్ ఫైర్ నిజామాబాద్ హమాల్వాడిలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో DJ వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన MLA.. స్వయంగా DJ వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడిపించడం చర్చనీయాంశమైంది.
More news from తెలంగాణ and nearby areas
- నిజామాబాద్ హమాల్వాడిలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో DJ వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన MLA.. స్వయంగా DJ వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడిపించడం చర్చనీయాంశమైంది.1
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* .. మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రౌండింగ్ నిర్మాణ తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ................ కలెక్టర్ వెంట ee సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఈఓ రాజు, mro, mpdo, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691
- రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేయాలి --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశ నిర్వహించారు . . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరాలన్నారు. రోడ్ల పై పెండింగ్ లో ఉన్న సి సి కెమెరాలు సిగ్నల్స్ విద్యుత్ దీపాలు సైన్ బోర్డులు, గుంతలు పూడ్చి పెండింగ్ పనులు లేకుండా చూడాలన్నారు. విద్యాసంస్థల్లో, కళాశాలలో రోడ్డు భద్రత నియమాల గూర్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున వాహన దారులు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, రోడ్ల పై ఉన్న వివిధ సిగ్నల్, మార్కింగ్ గురించి తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచించారు. మత్తు పదార్థాలపై నిఘా పెంచాలన్నారు. మత్తుకు అలవాటు పడి యువకులు భవిష్యత్తు కోల్పోకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారించవచ్చని, విద్యాలయాల్లో,మెడికల్ షాపుల్లో, పరిశ్రమలలో నిరతరం మత్తు పదార్థాలపై నిఘా పెట్టామన్నారు. మత్తు తో జీవితాలు చిత్తు అయిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, డి ఎస్పీ లు, మున్సిపల్ కమిషనర్లు,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- Post by Venu Gopal1
- ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని ప్రకటించనున్నట్లు నిజామాబాదు మాజీ ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు.. ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు మేడ్చల్ లోని మునీరాబాద్ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.1