Shuru
Apke Nagar Ki App…
ఏప్రిల్ 25న పార్టీని ప్రకటిస్తా.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని ప్రకటించనున్నట్లు నిజామాబాదు మాజీ ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు.. ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు మేడ్చల్ లోని మునీరాబాద్ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
Sri 8341234584
ఏప్రిల్ 25న పార్టీని ప్రకటిస్తా.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని ప్రకటించనున్నట్లు నిజామాబాదు మాజీ ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు.. ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు మేడ్చల్ లోని మునీరాబాద్ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- నిజామాబాద్ హమాల్వాడిలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో DJ వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన MLA.. స్వయంగా DJ వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడిపించడం చర్చనీయాంశమైంది.1
- ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు లు లేవు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం చేసింది కాంగ్రెస్ నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తాం వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ BRS నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండు సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలుపరచకుండా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిందని బాల్కొండ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలో అమలు కోసం నిధులు కూడా కేటాయించకుండా ఇంకా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది అని విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని అన్నారు మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారు ప్రజలను నమ్మించడానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాడు గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టింది కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 25 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదు. పథకాల అమలు తక్కువ... ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. 25 నెలలుగా 2500 చొప్పున 60 000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడింది.ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు వృద్దులకు, బీడీ పెన్షన్ వాళ్లకు అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో పెన్షన్ ల పెంపు ఊసే లేదని అన్నారు. దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు. రైతు భరోసా 15,000, కౌలు రైతులకు 15 వేలు, రుణమాఫీ కానీ వారికీ 2,00,000 రుణమాఫీ ఈ బడ్జెట్ లో ప్రస్థావించలేదు. విద్యాభరోసా కార్డు 5,00,000 ఇస్తామన్నారు నిధుల కేటాయింపు లేదు. ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున ఇస్తామని ఆరు గ్యారఆంటీల్లో చెప్పి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్,నిరుద్యోగ భృతి విద్యార్థులకు స్కూటి లు, ఫీ రియంబర్స్మెంట్ లను విస్మరించింంది ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం మాట బడ్జెట్ లో ఎత్తలేదు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి బడ్జెట్ లో నిదులు కేటాయించకుండా ప్రజలను నమ్మించి మోసం చేసింది.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన BRS పార్టీ పోరాటం చేస్తుంది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసిన మోసలను ప్రజాక్షేత్రం లో ఎండగడుతుంది. ఈ మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి,బద్దం ప్రవీణ్ రెడ్డి బాల్కొండ,కల్లెడ ఏలీయా, ప్రెసిడెంట్,దాసరి వెంకటేష్, రేగుంట దేవేందర్, జైడి నాగధర్,బద్దం రవి ,బద్దం నర్సారెడ్డి ,రేగుల్ల రాములు,దొంకంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష,రాజా పూర్ణనందం,కొలిపాక ఉపేందర్,శ్రీకాంత్, గడ్డం స్వామి, ఏలేటి రమేష్,ప్రతాప్ ,భోజపల్లి సురేష్ లోలపు సుమన్,బూరుకల కమలాకర్ డోల్ల రాజేశ్వర్,గంగారెడ్డి నడ్కుడా, నారాయణ, గంగాధర్, సూర్జీల్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, ఉమా శంకర్,ఆనంద్, యూసుఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు1
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* .. మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రౌండింగ్ నిర్మాణ తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ................ కలెక్టర్ వెంట ee సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఈఓ రాజు, mro, mpdo, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691
- మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో ప్రతిష్టించి సీతారాముల ఉత్సవమూర్తులను అందులో ప్రతిష్టించి పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.1
- రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేయాలి --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశ నిర్వహించారు . . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరాలన్నారు. రోడ్ల పై పెండింగ్ లో ఉన్న సి సి కెమెరాలు సిగ్నల్స్ విద్యుత్ దీపాలు సైన్ బోర్డులు, గుంతలు పూడ్చి పెండింగ్ పనులు లేకుండా చూడాలన్నారు. విద్యాసంస్థల్లో, కళాశాలలో రోడ్డు భద్రత నియమాల గూర్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున వాహన దారులు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, రోడ్ల పై ఉన్న వివిధ సిగ్నల్, మార్కింగ్ గురించి తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచించారు. మత్తు పదార్థాలపై నిఘా పెంచాలన్నారు. మత్తుకు అలవాటు పడి యువకులు భవిష్యత్తు కోల్పోకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారించవచ్చని, విద్యాలయాల్లో,మెడికల్ షాపుల్లో, పరిశ్రమలలో నిరతరం మత్తు పదార్థాలపై నిఘా పెట్టామన్నారు. మత్తు తో జీవితాలు చిత్తు అయిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, డి ఎస్పీ లు, మున్సిపల్ కమిషనర్లు,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని ప్రకటించనున్నట్లు నిజామాబాదు మాజీ ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు.. ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు మేడ్చల్ లోని మునీరాబాద్ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.1