Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల..... వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వేడుకలు ..... స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్న జగిత్యాల డిఎస్పి రఘుచందర్ జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా "జగిత్యాల డిఎస్పి రఘు చందర్ దంపతులు" కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనాన్ని అందజేశారు.
Venu Gopal
జగిత్యాల..... వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వేడుకలు ..... స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్న జగిత్యాల డిఎస్పి రఘుచందర్ జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా "జగిత్యాల డిఎస్పి రఘు చందర్ దంపతులు" కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనాన్ని అందజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Venu Gopal1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం మ. 3 గంటలకు జన్నారంతో పాటు పలు గ్రామాలలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లిలో 38 డిగ్రీలు, లక్షెట్టిపేట 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.1
- Post by KR NEWS 3691
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* .. మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రౌండింగ్ నిర్మాణ తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ................ కలెక్టర్ వెంట ee సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఈఓ రాజు, mro, mpdo, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు.1
- సిర్పూర్ టి నియోజకవర్గం అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు గ్రామ పంచాయతీల సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.1100 కోట్లు పంచాయతీల నిర్వహణకు, కార్మికుల జీతాలకు సరిపోవడం లేదని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేయాలని కోరారు. వర్షాకాలంలో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వేసవి దృష్ట్యా ప్రతి గ్రామానికి రెండు బోర్వెల్స్ మంజూరు చేయాలని సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు వంటి అభివృద్ధి పనులు ఎక్కువగా కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గానికి కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని అసెంబ్లీలో ప్రస్తావించారు.1
- Post by Venu Gopal1