Shuru
Apke Nagar Ki App…
* సాయి మల్టీ స్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ... * గణపతి నవరాత్రుల సందర్భంగా సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాఅన్నదానం.... మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు గౌరీ శంకర్‌తో పాటు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
ఓలాద్రి వెంకన్న
* సాయి మల్టీ స్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ... * గణపతి నవరాత్రుల సందర్భంగా సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాఅన్నదానం.... మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు గౌరీ శంకర్‌తో పాటు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.1
- స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు1
- 🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం! రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.2
- 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది. ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభమని, పేదలను ఏడిపిస్తున్నారని.. వాళ్లు బాగుపడరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడుంటున్న ఇళ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలని చెప్పింది. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని పేర్కొన్నారు.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,050, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.8,800, కొత్త పత్తి ధర రూ.8,850 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.50, కొత్త పత్తి ధర రూ.161 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.1
- బూర్గంపహాడ్: దయ్యం పట్టిందని వృద్ధురాలికి చిత్రహింసలు.. బూర్గంపాడు మండలంలోని జింకలగూడెంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి దయ్యం పట్టిందని కొందరు ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి కిందకి జారకుండా మేకులు కొట్టి, ఆపై ఆమెను తాడుతో కొట్టారని పేర్కొన్నారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరగగా సోమవారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.1
- అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జారీచేసిన డ్రా సిస్టాన్ని రద్దు చేయాలని రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో,ధర్నా చేసిన నిరుపేద కుటుంబాలు.1
- 🔥 రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక అన్నదానం.. భారీగా తరలివచ్చిన భక్తులు! 🙏 రాపత్రి నగర్‌లో శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. వినాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.1
- ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. చివరిసారిగా ఓ పేషెంట్కు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, ఆయన మందుల ఖర్చును కూడా తానే భరిస్తానని జగదీశ్ చెప్పారని తెలిపారు. ఎంతోమంది పేదలకు సహాయం చేశారని, రోజుకు 3–4 సర్జరీలు చేసేవారని పేర్కొన్నారు. అలాంటి డాక్టర్ మళ్లీ పుట్టరని, ఆయన లేని లోటు తీరనిదని కన్నీటిపర్యంతమయ్యారు.1