స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు
స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు
- కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో తరలిస్తున్న పశువుల మేతకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్ ఇంజన్‌తో సహా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.1
- ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. చివరిసారిగా ఓ పేషెంట్కు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, ఆయన మందుల ఖర్చును కూడా తానే భరిస్తానని జగదీశ్ చెప్పారని తెలిపారు. ఎంతోమంది పేదలకు సహాయం చేశారని, రోజుకు 3–4 సర్జరీలు చేసేవారని పేర్కొన్నారు. అలాంటి డాక్టర్ మళ్లీ పుట్టరని, ఆయన లేని లోటు తీరనిదని కన్నీటిపర్యంతమయ్యారు.1
- శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా 2014 నుండి కేంద్రం ప్రభుత్వ అవార్డులు ప్రకటించిన విషయంలో క్షేత్రస్థాయిలో అనేక సేవలు చేసిన వారికే గుర్తింపు ఇచ్చి అవార్డులు ప్రకటించిన విషయం చాలా గొప్ప విషయంగా చెప్పారు: వంగవీటి1
- మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి మూడో రైల్వే లైన్ మహబూబాబాద్ జిల్లా: కాజీపేట నుండి విజయవాడకు219 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్ అందుబాటులోకి వచ్చింది.. నూతనంగా నిర్మించిన మూడో రైల్వే లైన్ పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.. న్యూఢిల్లీ-చెన్నై మధ్య ఉన్న ఈ గ్రాండ్ ట్రంక్ లైన్ పై విపరీతమైన రైళ్ల రద్దీ ఉండడంతో ప్రస్తుతం ఉన్న రెండు రైల్వే ట్రాక్‌ల లైన్లు సరిపోకపోవడంతో మూడో లైన్ నిర్మాణ పనులను పదేళ్ల క్రితం ప్రారంభించింది .. ఇందులో మహబూబాబాద్ నుండి కాజీపేట సెక్షన్‌ల మధ్య ఉన్న పనులు ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో మూడో లైన్‌పై నుంచి రైళ్ల రాకపోకలను కొనసాగించనున్నారు.. . ఇక రైళ్ల రాకపోకలు నిర్ణీత సమయంలో కొనసాగేందుకు అవకాశం ఉందని రైల్వేశాఖ భావిస్తోంది...1
- మారెళ్లపాడు లిఫ్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు •ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం •16,180 ఎకరాలకు సాగునీరు.. •తీరనున్న దశాబ్దాల రైతుల కల •ఎమ్మెల్యే పాయం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మంత్రి తుమ్మల •ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు: మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. గోదావరి జలాలను ఆయకట్టుకు తరలించే మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. . స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు పాల్గొనున్నారు..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇప్పటికే ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వరప్రదాయినిగా మారెళ్లపాడు సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. పథకంలో భాగంగా హెడ్‌వర్క్స్‌కు రూ.25 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రూ.25 కోట్లతో పంప్‌హౌస్ మెఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.25 కోట్లతో పంప్‌హౌస్ నిర్మాణాన్ని చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీరు కాలువల్లోకి చేరుతుంది. కాలువలు.. ఆయకట్టు వివరాలు సిస్టర్న్ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలు నిర్మించాల్సి ఉంది. 9.650 కి.మీ. పొడవైన కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 420 మీటర్ల ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మొత్తం 16,180 ఎకరాల్లో సుమారు 11 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కావడం విశేషం. తొలిదశలో 7 వేల ఎకరాలు ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. అందుకే తొలిదశలో లిఫ్ట్ ద్వారా తుమ్మల చెరువుకు నీటిని తరలించి, ఆ చెరువు కింద 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 2 వేల ఎకరాలకు కూడా నీరందుతుంది. కాలువ పనులు పూర్తయితే మొత్తం 16,180 ఎకరాలకు నీరు అందుతుంది. తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు లబ్ధి ఈ పథకం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్దాలో 1,877, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొందిగూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది. మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ ప్రాజెక్టు ప్రతిపాదనల దశ నుంచి పనుల పురోగతి వరకు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ చూపారు. పనుల పరిశీలనకు ఇప్పటివరకు అనేక సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన చొరవతో పనులు వేగంగా పూర్తయి ట్రయల్‌రన్ సఫలమైంది. ఎమ్మెల్యే పాయం పర్యవేక్షణ మంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులను నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 20 రోజుల పాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీంతో నిర్దేశిత గడువులోగా ట్రయల్‌రన్ పూర్తయింది. రైతన్నల్లో హర్షం గోదావరి జలాలు కాలువల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు1
- * సాయి మల్టీ స్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ... * గణపతి నవరాత్రుల సందర్భంగా సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాఅన్నదానం.... మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు గౌరీ శంకర్‌తో పాటు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....2
- భారత రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ ప్రకారంగా చట్టం అందరికీ సమానమేనని : వంగవీటి1
- * CEIR ద్వారా 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. 77 ఫోన్లు బాధితులకు అప్పగింత.... “మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి” * జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ *మహబూబాబాద్ జిల్లా పోలీస్... *ఇప్పటివరకు CEIR పోర్టల్ ద్వారా 2027 మొబైల్ ఫోన్ల రికవరీ.... * 77 ఫోన్లను గుర్తించి ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్,ఐపీఎస్. చేతులమిదిగా బాధితులకు అందజేత..... * CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి... * జిల్లా ఎస్పీ డా. శబరీష్. ఐపీఎస్.... పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుర్తించి రికవరీ చేయడంలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో తాజాగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో 77 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఈరోజు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ చేతులమిదిగా అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.... CEIR పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ, వివిధ ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తిస్తున్నామని అన్నారు. ఈ ప్రక్రియలో మహబూబాబాద్ డీఎస్పీ, CCS ఇన్‌స్పెక్టర్ హతీరామ్, ఐటీ సెల్ ఎస్‌ఐ జి.వి. కృష్ణారెడ్డి, పీసీ సుమన్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, CEIR ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలను పోలీసులకు అందించాలని తెలిపారు. CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి ఫోన్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు. ప్రజల ఆస్తి పరిరక్షణలో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేసేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.....2
- “చేతబడి అనుమానంతో వృద్ధురాలికి చిత్రహింసలు..! చెట్టుకు ఎక్కించి మేకులు కొట్టారా?” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో కలకలం రేపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌కే శకినాబి అనే వృద్ధ మహిళపై చేతబడి అనుమానంతో చిత్రహింసలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ప్రచారం జరుగుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి, మేకులు కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అసలు వృద్ధ మహిళను ఎవరు, ఎందుకు హింసించారు? చేతబడి అనుమానానికి కారణమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూఢనమ్మకాల పేరుతో ఒక వృద్ధ మహిళపై ఇలాంటి దాడి జరిగిందనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే బాధితురాలికి రక్షణ కల్పించి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. పూర్తి వివరాలు, అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.1