రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కులేరి ప్రేమ్ సాగర్, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా, అభ్యసన ప్రక్రియలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభరీతిలో బోధించడానికి వీలుగా, విద్యార్థులతో కలిసి బోధనోపకరణలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల బోధనోపకరణల వర్క్ షాప్‌లో భాగంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, కవిత, కార్తీక్ లు పాల్గొన్నారు.2
- శనివారం నాడు గంబీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా, ఎస్పీ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు మరియు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు వృద్ధాశ్రమ సభ్యులు ఉన్నారు. ఈ సందర్శనలో భాగంగా, ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని మహేష్ బి.గితే స్పష్టం చేశారు, మానవతా సేవలో పోలీసు శాఖ యొక్క నిబద్ధతను తెలియజేశారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దాన్ని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపారు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. అంతేకాకుండా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు. ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. నిందితులు ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹46,21,358 మొత్తాన్ని ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.4
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామం వద్ద శనివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి ఈ ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.1
- కరీంనగర్ కిసానగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్‌పై కిసానగర్‌లోని రమణయ్య టిఫిన్ సెంటర్ వద్ద కారుతో దాడి జరిగింది. మొన్న రాత్రి 11 గంటలకు రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కారుతో దూసుకువచ్చి గుద్ది చంపే ప్రయత్నం చేశారని కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ వివరించారు. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అర్ధరాత్రి వేళ ఒక కార్పొరేటర్‌పైనే ఇలాంటి దాడి జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది; అయితే, ఈ దాడి నుండి కార్పొరేటర్ ప్రాణాలతో బయటపడ్డారు.1
- కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ రేఖ చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేఖ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా సెషన్ జడ్జి శివ కుమార్, రాజీ మార్గమే రాజ మార్గం అని పేర్కొంటూ, లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్ట్ న్యాయ సేవ సదన్ హాల్‌లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ కేసులను త్వరగా రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్‌లో తమ పేర్లను నమోదు చేసుకుని సత్వర న్యాయం పొందాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, హుజురాబాద్‌లలో కలిపి మొత్తం 12 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి శివ కుమార్ వివరించారు. జిల్లాలో మొత్తం 3 వేల పెండింగ్ కేసులను గుర్తించగా, వీటిలో ఇప్పటికే 2 వేలకు పైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం వరకు వచ్చే వారి కేసులను పరిష్కరించడానికి బ్యాంకులు, ఫైనాన్స్, ఇతర సంస్థలు కూడా ఈ లోక్ అదాలత్‌లో పాల్గొని సహకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ తో పాటు ఇతర న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.1