logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో జూన్ 18, 2026న జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాశ్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ బలరాం నాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు (రిటైర్డ్ ఐపీఎస్) కూడా పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ పాలకుర్తి సారంగపాణి కూడా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు కూడా ఈ దిశ సమావేశంలో పాల్గొన్నారు.

12 hrs ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
12 hrs ago

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో జూన్ 18, 2026న జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాశ్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ బలరాం నాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు (రిటైర్డ్ ఐపీఎస్) కూడా పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ పాలకుర్తి సారంగపాణి కూడా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు కూడా ఈ దిశ సమావేశంలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో జూన్ 18, 2026న జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాశ్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ బలరాం నాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు (రిటైర్డ్ ఐపీఎస్) కూడా పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ పాలకుర్తి సారంగపాణి కూడా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు కూడా ఈ దిశ సమావేశంలో పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో జూన్ 18, 2026న జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాశ్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ బలరాం నాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు (రిటైర్డ్ ఐపీఎస్) కూడా పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ పాలకుర్తి సారంగపాణి కూడా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు కూడా ఈ దిశ సమావేశంలో పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • హనుమకొండ జిల్లాలోని హంటర్ రోడ్ దుర్గ కాలనీలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటద్రి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూమిని కొనుగోలు చేసిన రవీందర్ రావు డబ్బులు చెల్లించకపోవడంతో పాటు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చంద్రశేఖర్ ఆరోపించారు. పలుమార్లు డబ్బులు అడిగినా రవీందర్ రావు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
    1
    హనుమకొండ జిల్లాలోని హంటర్ రోడ్ దుర్గ కాలనీలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటద్రి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూమిని కొనుగోలు చేసిన రవీందర్ రావు డబ్బులు చెల్లించకపోవడంతో పాటు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చంద్రశేఖర్ ఆరోపించారు. పలుమార్లు డబ్బులు అడిగినా రవీందర్ రావు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గురువారం కామారెడ్డిలో మాట్లాడుతూ, 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న తనపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన తనపై నిందలు వేయడం బాధాకరమని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలో తనకంటే జానారెడ్డి కూడా జూనియర్ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విమర్శలు చేస్తున్న వారికి హెచ్చరిక చేస్తూ, "ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే తిరిగి పడుతుంది" అని షబ్బీర్ అలీ అన్నారు.
    1
    కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గురువారం కామారెడ్డిలో మాట్లాడుతూ, 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న తనపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన తనపై నిందలు వేయడం బాధాకరమని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలో తనకంటే జానారెడ్డి కూడా జూనియర్ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విమర్శలు చేస్తున్న వారికి హెచ్చరిక చేస్తూ, "ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే తిరిగి పడుతుంది" అని షబ్బీర్ అలీ అన్నారు.
    user_Dokidi Thirupathi
    Dokidi Thirupathi
    Farmer వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు వచ్చి తన అన్నపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ సిరిసిల్లకు వీకెండ్ టూర్‌లా వచ్చిపోతాడని కవిత విమర్శించారు. జెండా పండుగలో భాగంగా సిరిసిల్లలో జెండా ఆవిష్కరించిన ఆమె, నేతన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కవిత, కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు డిస్కం గురించి కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని, మాట్లాడేంత తీరిక ఆయనకు లేదా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించిన ఆమె, కేటీఆర్ రేవంత్ రెడ్డిపై మాట్లాడడం మానేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ నాయకులు పేగు బంధం తెంచుకున్నారని, అందుకే తెలంగాణ రక్షణ సేన వచ్చిందని తెలిపారు. అక్రమ ఇసుక దందా కారణంగా నేరెళ్లలో ఎనిమిది మంది బీసీ, ఎస్సీలను తీవ్రంగా కొట్టారని గుర్తు చేసిన కవిత, కేంద్ర ఎస్సీ ఎస్టీ సంఘం దగ్గర పెండింగ్‌లో ఉన్న నేరెళ్ల బాధితుల కేసు స్థితిని బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల అన్నదమ్ములకు అండగా ఉంటామని, వారికి న్యాయం ఎలా జరగదో తాను చూస్తానని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో లక్షా ఎనిమిది వేల ఎకరాలకు రావాల్సిన నీరు కేవలం 480 ఎకరాలకు మాత్రమే వస్తుందని కవిత ఆరోపించారు. 'వర్కర్ టు ఓనర్' పథకం అమలు చేయకపోవడంతో ఆ షెడ్లు ధాన్యం నిలువ చేయడానికి వాడుతున్నారని తెలిపారు. సిరిసిల్లలో నేతన్నల పవర్లూమ్‌లు ఉన్నప్పటికీ, యార్న్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పిల్లలను చదివించడానికి ప్రైవేట్ స్కూలు ఫీజులు కట్టే పరిస్థితి లేదని, ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేవని, ప్రభుత్వ ఆసుపత్రిలో సూది ఉంటే దూది ఉండటం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతుందని ఎత్తిచూపారు. తెలంగాణలో ప్రజల బతుకులు ఏం చేస్తే మారుతాయో ఆలోచించాలని, ఆడవాళ్ళ గురించి ఆలోచించే పార్టీ ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేనను స్థాపించుకున్నామని కవిత వివరించారు. ఉచిత విద్య, వైద్యమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామని, నిరుద్యోగ యువతకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
    4
    తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు వచ్చి తన అన్నపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ సిరిసిల్లకు వీకెండ్ టూర్‌లా వచ్చిపోతాడని కవిత విమర్శించారు. జెండా పండుగలో భాగంగా సిరిసిల్లలో జెండా ఆవిష్కరించిన ఆమె, నేతన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేత కార్మికులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కవిత, కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు డిస్కం గురించి కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని, మాట్లాడేంత తీరిక ఆయనకు లేదా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించిన ఆమె, కేటీఆర్ రేవంత్ రెడ్డిపై మాట్లాడడం మానేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ నాయకులు పేగు బంధం తెంచుకున్నారని, అందుకే తెలంగాణ రక్షణ సేన వచ్చిందని తెలిపారు. అక్రమ ఇసుక దందా కారణంగా నేరెళ్లలో ఎనిమిది మంది బీసీ, ఎస్సీలను తీవ్రంగా కొట్టారని గుర్తు చేసిన కవిత, కేంద్ర ఎస్సీ ఎస్టీ సంఘం దగ్గర పెండింగ్‌లో ఉన్న నేరెళ్ల బాధితుల కేసు స్థితిని బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల అన్నదమ్ములకు అండగా ఉంటామని, వారికి న్యాయం ఎలా జరగదో తాను చూస్తానని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో లక్షా ఎనిమిది వేల ఎకరాలకు రావాల్సిన నీరు కేవలం 480 ఎకరాలకు మాత్రమే వస్తుందని కవిత ఆరోపించారు. 'వర్కర్ టు ఓనర్' పథకం అమలు చేయకపోవడంతో ఆ షెడ్లు ధాన్యం నిలువ చేయడానికి వాడుతున్నారని తెలిపారు. సిరిసిల్లలో నేతన్నల పవర్లూమ్‌లు ఉన్నప్పటికీ, యార్న్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పిల్లలను చదివించడానికి ప్రైవేట్ స్కూలు ఫీజులు కట్టే పరిస్థితి లేదని, ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేవని, ప్రభుత్వ ఆసుపత్రిలో సూది ఉంటే దూది ఉండటం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతుందని ఎత్తిచూపారు.

తెలంగాణలో ప్రజల బతుకులు ఏం చేస్తే మారుతాయో ఆలోచించాలని, ఆడవాళ్ళ గురించి ఆలోచించే పార్టీ ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేనను స్థాపించుకున్నామని కవిత వివరించారు. ఉచిత విద్య, వైద్యమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామని, నిరుద్యోగ యువతకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు దొర గారి మెప్పు పొందడం కోసమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్‌కు తాను సాటి దళితుడిగా అండగా నిలిచానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అని ఆయన స్పష్టం చేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమీషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించానని మంత్రి అడ్లూరి తెలిపారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్, గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పని చేశారని గుర్తు చేస్తూ, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించగా, ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని అడ్లూరి అన్నారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ. 683 కోట్లతో టెండర్లు పిలిచామని, అలాగే రూ. 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లను ఖరారు చేశాయని వివరించారు. మొత్తం రూ. 1,183 కోట్లకు టెండర్లు పిలిస్తే, మాజీ మంత్రి హరీష్ రావు రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడంపై తాను సమాధానం చెప్పగా, దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు 'ఖాబ్దార్' అని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి విమర్శించారు. కొప్పుల ఈశ్వర్ గత ఎన్నికల్లో ఎలా గెలిచారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని మంత్రి అడ్లూరి అన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తాళం పోతే ఎక్కడ పోయిందని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కొప్పులపై తాను 2009లో పోటీ చేసి కేవలం 1,165 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన సమయంలో రాష్ట్రంలో ఎవరికీ డిపాజిట్ రాలేదని, తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందని అడ్లూరి అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఆర్టీసీ బస్సు డిపో వంటివి ఏమీ తీసుకురాకపోవడంతోనే 2023 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు కొప్పులకు ఓట్లే వేయలేదని మంత్రి అడ్లూరి తెలిపారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల, గురుకుల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ కలిసి దోచుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ పునరుద్ఘాటించారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.
    2
    తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు దొర గారి మెప్పు పొందడం కోసమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్‌కు తాను సాటి దళితుడిగా అండగా నిలిచానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అని ఆయన స్పష్టం చేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమీషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించానని మంత్రి అడ్లూరి తెలిపారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్, గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పని చేశారని గుర్తు చేస్తూ, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించగా, ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని అడ్లూరి అన్నారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ. 683 కోట్లతో టెండర్లు పిలిచామని, అలాగే రూ. 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లను ఖరారు చేశాయని వివరించారు. మొత్తం రూ. 1,183 కోట్లకు టెండర్లు పిలిస్తే, మాజీ మంత్రి హరీష్ రావు రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడంపై తాను సమాధానం చెప్పగా, దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు 'ఖాబ్దార్' అని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి విమర్శించారు.

కొప్పుల ఈశ్వర్ గత ఎన్నికల్లో ఎలా గెలిచారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని మంత్రి అడ్లూరి అన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తాళం పోతే ఎక్కడ పోయిందని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కొప్పులపై తాను 2009లో పోటీ చేసి కేవలం 1,165 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన సమయంలో రాష్ట్రంలో ఎవరికీ డిపాజిట్ రాలేదని, తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందని అడ్లూరి అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఆర్టీసీ బస్సు డిపో వంటివి ఏమీ తీసుకురాకపోవడంతోనే 2023 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు కొప్పులకు ఓట్లే వేయలేదని మంత్రి అడ్లూరి తెలిపారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల, గురుకుల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ కలిసి దోచుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ పునరుద్ఘాటించారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    8 hrs ago
  • మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకిలో గురువారం, జూన్ 18న నిర్వహించిన ఒక కార్యక్రమంలో 51 మంది లబ్ధిదారులకు రూ.20.67 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMGRF) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరిన ఆయన, గత పాలకులు ప్రజా సమస్యలను విస్మరించారని విమర్శించారు. అనంతరం, రేగులపల్లి స్టేజి నుంచి మల్లెంచెరువు వరకు రూ.2 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, మల్లెంచెరువు ప్రాథమిక పాఠశాలకు రూ.10 లక్షలతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు, విద్యా సంస్థలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివెరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    4
    మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకిలో గురువారం, జూన్ 18న నిర్వహించిన ఒక కార్యక్రమంలో 51 మంది లబ్ధిదారులకు రూ.20.67 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMGRF) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరిన ఆయన, గత పాలకులు ప్రజా సమస్యలను విస్మరించారని విమర్శించారు. అనంతరం, రేగులపల్లి స్టేజి నుంచి మల్లెంచెరువు వరకు రూ.2 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, మల్లెంచెరువు ప్రాథమిక పాఠశాలకు రూ.10 లక్షలతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు, విద్యా సంస్థలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివెరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ, తనను కలవాలని ఆకాంక్షించిన వీడియోను చూసిన పవన్ కళ్యాణ్, అతని కోరికను నెరవేర్చాలని భావించారు. ఈ రోజు హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అరుదైన వ్యాధితో నిరంజన్ చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయమని తెలిపారు. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించారు. అలాగే, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ, తనను కలవాలని ఆకాంక్షించిన వీడియోను చూసిన పవన్ కళ్యాణ్, అతని కోరికను నెరవేర్చాలని భావించారు. ఈ రోజు హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

అరుదైన వ్యాధితో నిరంజన్ చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయమని తెలిపారు.

నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించారు. అలాగే, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణంలో, పాత మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మికులు తమ ప్రధాన డిమాండ్లలో భాగంగా, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. అలాగే, నెలవారీ వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత కల్పించడంతో పాటు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం అందించాలని వారు తమ నిరసనలో నొక్కిచెప్పారు.
    1
    హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణంలో, పాత మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కార్మికులు తమ ప్రధాన డిమాండ్లలో భాగంగా, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. అలాగే, నెలవారీ వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత కల్పించడంతో పాటు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం అందించాలని వారు తమ నిరసనలో నొక్కిచెప్పారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.