పారిశుధ్య చర్యలతో అప్రమత్తమైన జాదరావుపేట గ్రామపంచాయతీ... కాటారం, ఆగస్టు 1: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో పెరిగిన పిచ్చిమొక్కల నిర్మూలనకు గడ్డి మందు పిచికారీ నిర్వహించారు. అలాగే మురుగు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించి పారిశుధ్య కార్మికులతో శుభ్రపరిచారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, డెంగీ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు. గ్రామ ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి సువర్ణ-రమేష్, ఉపసర్పంచ్ కోట అశోక్, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, 5వ వార్డు సభ్యుడు దుర్గం అజయ్‌తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుధ్య చర్యలతో అప్రమత్తమైన జాదరావుపేట గ్రామపంచాయతీ... కాటారం, ఆగస్టు 1: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో పెరిగిన పిచ్చిమొక్కల నిర్మూలనకు గడ్డి మందు పిచికారీ నిర్వహించారు. అలాగే మురుగు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించి పారిశుధ్య కార్మికులతో శుభ్రపరిచారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, డెంగీ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు. గ్రామ ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి సువర్ణ-రమేష్, ఉపసర్పంచ్ కోట అశోక్, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, 5వ వార్డు సభ్యుడు దుర్గం అజయ్‌తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.1
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.1
- లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు...... ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పాలిచ్చే తల్లులకు ఉచితంగా ప్రోటీన్ పౌడర్, విటమిన్ బిళ్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 35వ డివిజన్ కార్పొరేటర్ సదావేణి సుజాత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, డాక్టర్ విజయ రేకులపల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లులకు 200 ప్రోటీన్ పౌడర్ బాక్సులు, రూ.50,000 విలువగల ఈఎస్‌వివై కంపెనీ విటమిన్ మాత్రలతో పాటు ప్లాస్టిక్ నివారణకు గుడ్డ సంచులను అందజేశారు. నవజాత శిశువుల సమగ్ర ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమని, ప్రతి తల్లి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ కృషిని కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మేతుకు కృష్ణ చైతన్య, ఉదారంగా సహకరించిన గజవాడ రాధాకృష్ణ, గజవాడ ప్రభు, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.3
- ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.1
- ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది1