*ఫీజుల పేరుతో విద్యార్థులను ఇంటికి పంపకుండా వేధిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి — DSFI డిమాండ్......!!* * *ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలకు బినామిగా మారిన జిల్లా విద్యాశాఖ అధికారి పై జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.....* * *గుగులోతు సూర్య ప్రకాష్ — DSFI రాష్ట్ర నాయకులు* *మహబూబాబాద్* ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక వేధింపులకు గురిచేయడాన్ని *డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DSFI) తీవ్రంగా ఖండిస్తోంది*. విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో బకాయిల పేరుతో విద్యార్థులను తరగతి గదుల బయట నిలబెట్టడం, హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళాకనీయకుండా అడ్డుకోవడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడుతున్న పాఠశాలలపై ప్రభుత్వం, విద్యాశాఖ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా DSFI రాష్ట్ర నాయకులు *గూగులోతు సూర్య ప్రకాష్* మాట్లాడుతూ.. విద్యా బోధనను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ శక్తులు, నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా, సామాన్య మరియు మధ్యతరగతి తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని మరియు బాధ్యులైన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.*ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి గారికి* అనేకసార్లు ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదు పట్టించుకోవడంలేదని అన్నారు.. పూర్తిగా ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలలకు బినామీగా మారిపోయాడని తెలిపారు. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న పాఠశాలలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని,ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న అదనపు ఫీజులపై నియంత్రణ ఉండాలి అని అన్నారు,ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలి అని తెలిపారు.ఫీజుల వేధింపుల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కోవాలని, లేనిపక్షంలో DSFI ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాము.

- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్‌మెంట్‌లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్‌తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- Post by Ali ammu1
- బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోసోమవారంఉదయం ఘనంగా బసవేశ్వర జయంతి సాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ జ్యొతి ప్రజ్వలన చేసికార్యక్రమాన్ని ప్రారంబించారు. బసవేశ్వరచిత్రపటానికి పూలమాల వేసిపూజలు చేశారు.కొబ్బరికాయ కోట్టారు పుష్పాలువేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో లింగాయతచ సమాజం గౌరవ అద్యక్షులుపి డి ఆనందం, జిల్లా అధ్యక్షులు లింగన్న గారిమల్లప్ప, ప్రధాన కార్యదర్శి వీరేశం, డిసిసి అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంతప్ప, మెదక్ మున్సపల్ కౌన్సిలర్లు లలిత విశ్వం, స్వరూప పంతులు మహలింగంతదితరులుపాల్గోన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులు వర్షం కురిసింది. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు తాటి చెట్టు దగ్ధమైంది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం, వడగళ్ల వాన ప్రజల్ని ఉక్కిరి బిక్కిరికి గురిచేసింది. జోరుగా కురిసిన వర్షం, పిడుగులతో ప్రజలు భయాందోళన చెందారు.1
- కరీంనగర్ లో బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. ముకరంపురలోని లక్కీబార్ సమీపంలో నివసించే రావత్ ఆకాష్ అనే యువకుడు ఓ భవనం పైనుంచి దూకేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అతడికి నచ్చజెప్పారు. తగిన భద్రతా చర్యలు చేపట్టి బిల్డింగ్ పై నుండి దూకకుండా కాపాడి కిందికి దింపారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.1